Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను తప్పుబట్టిన ఆదిలాబాద్ ఎస్పీ.. కేసులు పెడతామని హెచ్చరిక!

రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను తప్పుబట్టిన ఆదిలాబాద్ ఎస్పీ.. కేసులు పెడతామని హెచ్చరిక!

-సభకు రాకుండా కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారన్న రేవంత్‌రెడ్డి
-ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్న ఎస్పీ రాజేశ్‌చంద్ర
-మూడు రోజులపాటు అన్ని విధాలుగా సహకరించామన్న ఎస్పీ

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ నిన్న నిర్వహించిన దళిత, గిరిజన దండోరా సభలో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ సభకు హాజరు కాకుండా కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారని ఆరోపించారు. రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన జిల్లా ఇన్‌చార్జ్ ఎస్పీ ఎం.రాజేశ్‌చంద్ర ఈ ఆరోపణలను కొట్టిపడేశారు. రేవంత్ వ్యాఖ్యల్లో నిజం లేదన్నారు.

కాంగ్రెస్ సభ కోసం జిల్లా పోలీసులు మూడు రోజులుగా బందోబస్తు ఏర్పాటు చేసి అన్ని విధాలా సహకరించారని అన్నారు. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు చెప్పారు. సభకు పదివేల మంది మాత్రమే హాజరవుతారని అనుమతి పొందారని పేర్కొన్నారు. అంతకుమించి తరలించినా ఇబ్బందులు కలగకుండా బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఇకపై ఎవరైనా ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

కాంగ్రెస్ లో జోష్ నింపిన ఇంద్రవెల్లి సభ

ఇంద్రవెల్లి లో నిన్న నిర్వహించగా కాంగ్రెస్ దళిత,గిరిజన దండోరా సభ అంచనాలకు మించి జనం రావడంతో కాంగ్రెస్ లో జోష్ నింపింది. సభకు కేవలం 10 మందికి మాత్రమే అనుమతి ఉందని అంతకు మించి హాజరైయ్యారని జిల్లా ఇంచార్జి ఎస్పీ అన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలనుంచి కూడా ప్రజలు స్వచందంగా తరలి వచ్చారు. ఇంక్కేక్కడ కాంగ్రెస్ ,కాంగ్రెస్ పని అయిపొయింది. అనే వారికీ కాంగ్రెస్ ఎక్కడికి పోలేదు జనం లేనే ఉందని నిరూపించింది. ఇంద్రవెల్లి సభ లక్ష్యం లక్ష మంది అందువలో ఒక్కరు తక్కువైనా తన తల తీసుకుంటానని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటింహరు. అన్నట్లుగానే భారీగా ప్రజలు సభకు హాజరైయ్యారు. 2023 లో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10 సీట్లకు పాడి సీట్లు కాంగ్రెస్ గెలుస్తుందని జిల్లా సీనియర్ నేత సభకు కర్త కర్మగా నిలిచినా ప్రేమ్ సాగర్ రావు అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ దే అధికారం 100 సీట్లు గెలుస్తుందని అన్నారు. రేవంత్ రెడ్డి ఉపన్యాసం ఆందరిని ఆకట్టుకునేలా ఉండాలి . ప్రధానంగా కాంగ్రెస్ కార్యకర్తలకు భరోసా నిచ్చింది. ఈ సభలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క , సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి,సీతక్క , శ్రీధర్ బాబు , తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ,జగ్గా రెడ్డి , విహెచ్ , కోమటి రెడ్డి బ్రదర్స్ పొన్నం ప్రభాకర్ లాంటి వారు హాజరు కాకపోవడం చర్చనీయాంశం అయింది.

Related posts

పాలేరులో షర్మిల ఎంట్రీ …ఆసక్తిగా మారిన జిల్లా రాజకీయాలు !

Drukpadam

లఖింపూర్ కేసు: యూపీ సర్కారు తీరుపై మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు అక్టోబరు 3న ఘటన!

Drukpadam

హైదరాబాదు పబ్ లకు… 21 ఏళ్లు నిండిన వారికే ప్రవేశం..

Drukpadam

Leave a Comment