Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

వారెవ్వా ఏమి అధికారి … లంచాల కోసమా వాట్స్ అప్ గ్రూప్!

వారెవ్వా ఏమి అధికారి … లంచాల కోసమా వాట్స్ అప్ గ్రూప్

-వ్యవసాయాధికారి నిర్వాకం .. వలపన్ని అరెస్టు చేసిన ఏసీబీ!
-భద్రాద్రి కొత్తగూడెంలో జిల్లా చండ్రుగొంగా లో ఘటన
-ప్రతి ఫర్టిలైజర్ దుకాణదారుడు రూ. 15 వేలు లంచం ఇవ్వాలంటూ మెసేజ్‌లు
-ఏసీబీకి ఫిర్యాదు చేసిన వ్యాపారులు

వారెవ్వా ఏమిఅధికారీరిరా నాయన ….లంచాల కోసం వాట్స్ అప్ గ్రూప్ నే తయారు చేసి లంచాలు వాసులు డిమాండ్ చేస్తున్న ప్రబుద్దుడిని భరించలేని వ్యాపారులు ఎసిబి కి పట్టించిన ఘటన చండ్రుగొండ లో జరిగింది. మన ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతి లేని పాలనా అందిస్తామని చెప్పారు. వరంగల్ సభలో లంచాలు అడిగిన అధికారి సిబ్బంది ఎవరైనా ఉంటె ఫలానా నెంబర్ కు ఫోన్ చేయాలని చెప్పారు. తరువాత కాలంలో ఆ నెంబర్ ఎప్పుడు పని చేయలేదని కొండి. కేసీఆర్ రెండవసారి అధికారంలోకి వచ్చారు .లంచాల మాత్రం తగ్గలేదు .

ఏ నెలలో ఎవరు ఎంతెంత ముడుపులు చెల్లించుకోవాలో చెబుతూ ఏకంగా వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి మరీ లంచాలు వసూలు చేస్తున్న మండల వ్యవసాయాధికారి ఏసీబీకి పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారుల కథనం ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలంలో నార్లపాటి మహేశ్‌చందర్‌ ఛటర్జీ 8 సంవత్సరాలుగా మండల వ్యవసాయాధికారి (ఏవో)గా పనిచేస్తున్నారు.

లంచాల రుచిమరిగిన ఆయన ఎరువులు, పురుగుమందుల దుకాణాల యజమానుల నుంచి ముడుపులు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. తాను తనిఖీలు నిర్వహించకుండా ఉండాలంటే నెల నెలా ముడుపులు సమర్పించుకోవాలంటూ ఏకంగా వాట్సాప్ గ్రూపునే ఏర్పాటు చేశారు. ఈ నెలలో ప్రతి దుకాణం రూ. 15 వేల చొప్పున ఇవ్వాలంటూ మెసేజ్‌లు పంపారు. ఆయన వేధింపులు భరించలేని వ్యాపారులు గత నెల 30న ఏసీబీకి ఫిర్యాదు చేశారు.

ఏసీబీ అధికారుల సలహా మేరకు ఆరు దుకాణాల నుంచి సేకరించిన సొమ్మును తీసుకునేందుకు రావాలంటూ దుకాణదారులు ఏవోను కోరారు. నిన్న చంద్రుగొండ రైతు వేదికలో యజమానుల నుంచి రూ. 90 వేల లంచం సొమ్ము తీసుకుంటుండగా వల పన్నిన ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అదే సమయంలో అశ్వారావుపేటలోని ఆయన స్వగృహంలోనూ సోదాలు నిర్వహించారు. ఏవోపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

తండ్రికాదు వాడు కసాయి ….కన్న కూతురిపై గొడ్డలి వేటు …

Drukpadam

డిప్యూటీ సీఎం భట్టి నివసిస్తున్న ప్రజా భవన్ కు బాంబు బెదిరింపు …

Ram Narayana

ఏమిటీ సూప్?’ అంటూ రెస్టారెంట్‌ మేనేజ‌ర్ ముఖంపై వేడివేడి సూప్ పోసిన క‌స్ట‌మ‌ర్.. 

Drukpadam

Leave a Comment