Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఉత్కంఠ‌కు తెర‌.. గెల్లు శ్రీనివాస్ టీఆర్ యస్ అభ్యర్థి ప్రకటించిన సీఎం కేసీఆర్!

ఉత్కంఠ‌కు తెర‌.. గెల్లు శ్రీనివాస్ టీఆర్ యస్ అభ్యర్థి ప్రకటించిన సీఎం కేసీఆర్
-హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో పోటీకి టీఆర్ఎస్ అభ్య‌ర్థి బీసీనే
-గెల్లు శ్రీ‌నివాస్ యాద‌వ్‌ను ఖ‌రారు చేసిన టీఆర్ఎస్‌
-తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న‌ విద్యార్థి నాయకుడని ప్ర‌క‌ట‌న‌
-ఉద్యమ కాలంలో ప‌లు సార్లు అరెస్ట‌యి జైలుకెళ్లార‌న్న టీఆర్ఎస్

తెలంగాణ మంత్రి ఈటల రాజేంద‌ర్ రాజీనామాతో ఖాళీ అయిన హుజూరాబాద్ అసెంబ్లీ నియోజ‌క వ‌ర్గం నుంచి టీఆర్ఎస్ పార్టీ ఎవ‌రిని ఉప ఎన్నిక బ‌రిలోకి దింపుతుంద‌న్న ఉత్కంఠ‌కు తెర‌ప‌డింది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న‌ విద్యార్థి నాయకుడు, టీఆర్ఎస్‌వీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీ‌నివాస్ యాద‌వ్‌ను త‌మ పార్టీ అభ్య‌ర్థిగా ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు.

గెల్లు శ్రీనివాస్ యాదవ్ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచే పార్టీలో అంకితభావంతో పనిచేస్తున్నారని ఆ పార్టీ ప్ర‌క‌ట‌న చేసింది. ఉస్మానియా యూనివర్సిటీ టీఆర్ఎస్‌వీ విభాగం అధ్యక్షుడుగా పనిచేసిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఉద్యమ కాలంలో ప‌లు సార్లు అరెస్ట‌యి జైలుకెళ్లారని చెప్పింది. గెల్లు శ్రీనివాస్ క్రమశిక్షణతో కూడిన వ్యక్తిత్వాన్ని, సేవాభావాన్ని, నిబద్ధ‌తను గుర్తించిన సీఎం కేసీఆర్ ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారని చెప్పింది.

Related posts

తిరుమలలో ఒకరోజు అన్నప్రసాద వితరణ చేయాలంటే ఎన్ని లక్షలు డొనేట్ చేయాలో తెలుసా?

Ram Narayana

న్యూ ఇయర్ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో వెల్లువెత్తిన మద్యం అమ్మకాలు!

Drukpadam

ఒక ఫ్లాట్ కలిగి ఉన్న వాళ్లు నాలుగైదు కార్లు కొంటామంటే కుదరదు: బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు!

Drukpadam

Leave a Comment