అమరరాజా చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్న గల్లా జయదేవ్
-తెలుగు దేశం ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్
-అమరరాజా బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన గల్లా రామచంద్రనాయుడు
-అవరోధాలను అధిగమించడమే నాయకత్వ లక్షణమన్న నాయుడు
-న్యాయస్థానాల పరిధిలో ఉన్న అంశాలపై మాట్లాడబోనని స్పష్టీకరణ
అమరరాజా బ్యాటరీస్ నూతన చైర్మన్‌గా గల్లా జయదేవ్ నేడు బాధ్యతలు చేపట్టారు . తెలుగుదేశం పార్టీ నుంచి గుంటూరు ఎంపీగా జయదేవ్ ఉన్నారు. ఆ సంస్థ అధినేత గల్లా రామచంద్రనాయుడు గల్లా జయదేవ్ బాధ్యతలు స్వీకరించనున్నట్లు ప్రకటించారు. తిరుపతి సమీపంలోని కరకంబాడిలో ఉన్న పరిశ్రమ ఆవరణలో మొన్న నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయనీ విషయాన్ని వెల్లడించారు. అలాగే, గౌరినేని హర్షవర్ధన్, గౌరినేని విక్రమాదిత్య డైరెక్టర్లుగా వ్యవహరిస్తారని తెలిపారు.
అవరోధాలను అధిగమించడమే నాయకత్వ లక్షణమన్న ఆయన.. చైర్మన్ బాధ్యతల నుంచి వైదొలగతున్నట్టు తెలిపారు. పరిశ్రమ విషయంలో కొన్ని అంశాలు న్యాయస్థానం పరిధిలో ఉన్నాయని, కాబట్టి వాటి గురించి మాట్లాడబోనని చెప్పారు. అమరరాజా చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్న గల్లా జయదేవ్ మాట్లాడుతూ.. పరిస్థితులను బట్టి ఏం జరగాలన్నది కాలమే నిర్ణయిస్తుందని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
ఎన్నో సంవత్సరాలుగా అమర్ రాజా బ్యాటరీ సంస్థ జయప్రదంగా నడుస్తున్నదని చెప్పారు. పరిశ్రమ మనుగడ కోసం తమ ముందు అనేక సవాళ్లు ఉన్నాయని వాటన్నిటిని అధిగమిస్తామని విశ్వాసం ఉందని అన్నారు. పరిశ్రమ నుంచి కాలుష్యం వస్తుందని ఉద్దేశంతో సంస్థ కు నోటీసులు వెళ్లడంతో ఏపీలో రాజకీయ దుమారమే రేగింది. వైసీపీ అధికారంలో ఉన్నందున తెలుగుదేశం ఎంపీగా ఉన్న జయదేవ్ పరిశ్రమపై కక్ష గట్టారనే అభిప్రాయాలూ ఉన్నాయి. దాన్ని అధికార పార్టీ ఖండించింది. ఈ నేపథ్యంలో తండ్రినుంచి కుమారుడు జయదేవ్ ఫ్యాక్టరీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. దీన్ని ఎలా అధిగమించగలరో అనేది చూడాలి మరి !