Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ప‌లువురు సినీ న‌టుల‌తో క‌లిసి బీజేపీలో చేరిన కరాటే క‌ల్యాణి..

ప‌లువురు సినీ న‌టుల‌తో క‌లిసి బీజేపీలో చేరిన కరాటే క‌ల్యాణి..
-టీఆర్ఎస్‌పై విజ‌య‌శాంతి విమ‌ర్శ‌లు
-బండి సంజయ్ సమక్షంలో ప‌లువురి చేరిక‌
-తెలంగాణలో పాల‌న‌ రాక్షసుల చేతుల్లోకి వెళ్లిందన్న విజ‌య‌శాంతి
-తెలంగాణ బీజేపీ చేతుల్లోకి వెళితేనే అభివృద్ధి సాధ్యమని వ్యాఖ్య

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో సినీ న‌టి కరాటే కల్యాణి, ఇత‌ర సినీన‌టులు కొంద‌రు ఈ రోజు బీజేపీలో చేరారు. అలాగే, కౌన్సిలర్ యాదయ్యతో పాటు ప‌లు పార్టీల నేతలు కూడా బీజేపీలో చేరారు. వారంద‌రినీ రాష్ట్ర బీజేపీ నాయ‌కులు పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు.

ఈ సంద‌ర్భంగా బీజేపీ నాయ‌కురాలు విజయశాంతి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో పాల‌న‌ రాక్షసుల చేతుల్లోకి వెళ్లిందని మండిప‌డ్డారు. తెలంగాణ బీజేపీ చేతుల్లోకి వెళితేనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. బీజేపీలో ప్ర‌ధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ నడ్డా వంటి ఎందరో సమర్థ‌వంత‌మైన నేత‌లు ఉన్నార‌ని చెప్పారు.

తెలంగాణ‌లో సంజయ్ వంటి నేత ఉన్నార‌ని ఆమె చెప్పారు. రాష్ట్ర‌ ప్రజలకు ఏం చేస్తే బాగుంటుందో తెలుసుకునేందుకు ఆయ‌న‌ పాదయాత్ర చేప‌ట్టాల‌ని నిర్ణ‌యం తీసుకున్నార‌ని తెలిపారు. ఆయ‌న‌ పాదయాత్ర విజ‌య‌వంతం కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని చెప్పారు.

తెలంగాణ లో ఇటీవల కాలంలో కొంత స్తబ్దతగా ఉన్న బీజేపీ స్పీడ్ పెంచింది. ఇతర పార్టీలతో పాటు ఇతర రంగాలలో ఉన్నవారికి గాలం వేస్తుంది. అందులో భాగంగా కొందరు సినీ నటులు ,మరికొందరు ఇతర పార్టీల నాయకులు బీజేపీ లో చేరారు. మరికొందరు ముఖ్యమైన నేతలను బీజేపీ లోకి ఆకర్షించడం ద్వారా రాష్ట్రంలో బీజేపీ బలపడే పధక రచన చేస్తుంది. ప్రధానంగా టీఆర్ యస్ నుంచి వలసలను ప్రోత్సహించటంద్వారా నైతికంగా దెబ్బకొట్టాలని బీజేపీ ఎత్తుగడగా ఉంది. ఇప్పటికే అనేక మంది పెద్ద తలలతో బీజేపీ నేతలు టచ్ లో ఉన్నారు. వారితో మంతనాలు జరుపుతున్నారు. 2024 ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ వస్తుందా లేదా అనే సందేహాల నడుమ కొంతమంది శషభిషలలో ఉన్నారు.

 

Related posts

అమెరికా కు తగ్గేదే లేదంటున్న ఉత్తర కొరియా అధ్యక్షడు కిమ్ !

Drukpadam

టీఆర్ఎస్ నేతలెవరూ మీడియాతో మాట్లాడొద్దు: కేటీఆర్

Drukpadam

అమేథి లో రాహుల్, ప్రియాంక కవాత్…భారీగా స్పందన!

Drukpadam

Leave a Comment