సాగర్ లో పోటీకి విజయశాంతి సై అంటారా ?
– దీటైన అభ్యర్థి కోసం చూస్తున్న టీఆర్ యస్
-జానారెడ్డి కి ఎదురులేదంటున్న కాంగ్రెస్
నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికైన అధికార టీఆర్ యస్ శాసనసభ్యులు నోముల నరసింహయ్య ఆకస్మిక మరణం తో అక్కడ ఉపఎన్నిక జరగాల్సి ఉంది . ఎన్నిక ఎప్పుడు జరుగుతున్నది . ఎన్నికల సంఘం ఎప్పుడు షడ్యూల్ ప్రకటిస్తుంది అనే దానికోసం అన్ని పార్టీలు ఎదురుచూస్తున్నాయి. ఖాళీ అయినా స్థానానికి ఆరునెల్లలోపు ఎప్పుడైనా ఎన్నిక జరగవచ్చు . ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి లోకసభకు ఉపఎన్నిక జరగాల్సి ఉన్నందున దానితో పాటు సాగర్ అసెంబ్లీ కి ఉపఎన్నిలక కోసం ఎన్నికల సంఘం ఫిబ్రవరి లో షడ్యూల్ ప్రకటించే ఆవకాశం ఉంది. అన్ని పార్టీలు దీనిపై కసరత్తు చేస్తున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్, టీఆర్ యస్ బీజేపీ లు నువ్వా నేనా అన్నట్లు ప్రచారం చేసేందుకు సిద్ధమవుతున్నాయి .2023 జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం రిహార్సల్ గా ఈ ఎన్నికను చుస్తునందున ప్రతిష్టాత్మకంగా చూస్తున్న బీజేపీ తన తన అభ్యర్థి గా విజయశాంతిని పోటీకి నిలపబోతున్నారా ? అనే చర్చ జరుగుతుంది. అందుకు ఆమె సై అంటున్నారా? విజయశాంతి పోటీకి నిలిచే అవకాశాలను కొట్టి పారేయలేము అంటున్నారు పరిశీలకులు. విజయశాంతి అయితే సెలబ్రిటీ, కొత్తగా పరిచయం అక్కరలేదు. పైగా సినీ గ్లామర్ తోడు అవుతుందని బీజేపీ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం. ఇదే విషయాన్నీ బీజేపీ అధిష్టానానికి తెలియజేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఇందుకు రాములమ్మ ఒప్పుకుంటారా ? లేదా అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి. ఆమె పోటీకి ఒప్పుకుంటే సరే సరి లేకపోతె ప్రచార భాద్యత అంత ఆమెమీద పెట్టాలనే యోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తుంది. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా నివేదితారెడ్డి పోటీచేశారు. ఆమెకు కేవలం 2 వేల 675 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి . డిపాజిట్ పోగొట్టుకున్నారు. అంటే బీజేపీకి ఈ నియోజకవర్గంలో పెద్దగా బలం లేదు. గతంలో టీడీపీ కి బలముంది. వారంతా టీఆర్ యస్ లో చేరారు. అంతకు ముందు ఎన్నికలలో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన అంజయ్య యాదవ్ కు 30 వేలు ఓట్లు వచ్చాయి. అయితే ప్రస్తుతం బీజేపీ వెవ్ ఉందనే ఉద్దేశం తో పలువురు బీజేపీ వైపు చూస్తున్నారు. నివేదితా రెడ్డి ,అంజయ్య యాదవ్ లు ఇరువురు బీజేపీ టికెట్ కోసం తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. వారు కాకుండా మరో ఇద్దరు పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కుందూరి జానారెడ్డి అనే బలమైన అభ్యర్థి రంగంలోకి దిగుతున్నందున ఆయనకు పోటీగా దీటైన అభ్యర్థిని పెట్టాలనే యోచనలో ఉన్న బీజేపీ తమ పార్టీ తరుపున విజయశాంతి లాంటి వారు అయితేనే గట్టి పోటీ ఇవ్వగలమే అభిప్రాయంతో ఉన్నారు. దుబ్బాక ఓటమి , గ్రేటర్ హైద్రాబాద్ కార్పొరేషన్ ఎన్నికలలో గెలుపు ఓటముల మధ్య కొట్టుమిట్టాడు తుండటంతో టీఆర్ యస్ ఈ ఎన్నికను ఛాలంజ్ గా తీసుకోబోతుంది. అందువల్ల అందరి కళ్ళు సాగర్ పైనే ఉన్నాయి. టీఆర్ యస్ నోముల కుటుంబం నుంచి ఎవరినైనా నిలబడుతుందా? అంటే దుబ్బాక ప్రయోగం తరువాత వెనుకంజ వేస్తుంది. కానీ నోముల నరసింహయ్య కుమారుడు కూడా టికెట్ ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగనున్న జానారెడ్డి కి మంచి పేరు ఉండటంతో పాటు నియోజకవర్గంలో పంచి పట్టు ఉండటంతో టీఆర్ యస్ సైతం సీని గ్లామర్ కోసం చూస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నియోజకవర్గంలో యాదవ్ లు బలమైన సామజిక వర్గంగా ఉన్నారు. వారి ఓట్లు 40 వేలకు పైగానే ఉన్నాయి. గత ఎన్నికల్లో టీఆర్ యస్ యాదవ సామజిక వర్గానికి చెందిన నోములను పెట్టి ఫలితం రాబట్టింది. ఎస్టీలు సైతం 30 వేలకు పైగానే ఓట్లు కలిగి ఉన్నారు. రెడ్డి సామాజికవర్గం బలమైనదే. యాదవులకు ఉన్నన్ని ఓట్లు లేకపోయినా గ్రామాలను ప్రభావితము చేయగలిగినవారు కావటంతో ఆవైపున కూడా రాజకీయ పార్టీలు ఆలోచనలు చేస్తున్నాయి. బీజేపీ ఇప్పటికే నియోజక వర్గ ఇంచార్జిలుగా సంకినేని వెంకటేశ్వరరావు, చాడ సురేష్ రెడ్డి లను నియమించింది. ఎన్నికలు ప్రకటించగానే పెద్దఎత్తున కార్యకర్తలను రంగంలోకి దించేందుకు బీజేపీ సిద్ధం అవుతుంది.విజయశాంతిని ఒప్పించి బరిలో దించుతారో లేక మరో అభ్యర్థిని పోటీకి పెడతారో అనే ఆశక్తి నెలకొన్నది.
next post