Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

చైనాలో ముగ్గురు పిల్లల్ని కనేందుకు గ్రీన్ సిగ్నల్.. సవరణ చట్టానికి పార్లమెంటు ఆమోదం!

చైనాలో ముగ్గురు పిల్లల్ని కనేందుకు గ్రీన్ సిగ్నల్.. సవరణ చట్టానికి పార్లమెంటు ఆమోదం
-దేశంలో దారుణంగా పడిపోతున్న జననాల రేటు
-పెరుగుతున్న ఖర్చుల కారణంగా అధిక సంతానానికి దంపతుల విముఖత
-ఖర్చులు తగ్గించి వెసులుబాటు కల్పించడమే లక్ష్యంగా తాజా ప్రతిపాదన

దేశంలో దారుణంగా పడిపోతున్న జననాల రేటును తిరిగి పెంచేందుకు చైనా ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఇకపై ప్రతి ఒక్కరు ముగ్గురు పిల్లల్ని కనేందుకు అధికార కమ్యూనిస్ట్ పార్టీ తీసుకొచ్చిన ప్రతిపాదనకు ఆ దేశ పార్లమెంట్ ‘నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్’ (ఎన్‌పీసీ) స్థాయీ సంఘం నిన్న గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి తగ్గట్టుగా కుటుంబ నియంత్రణ చట్టానికి సవరణ చేసింది.

పెరుగుతున్న ఖర్చుల నేపథ్యంలో అధిక సంతానానికి ప్రజలు విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం తాజా ప్రతిపాదన తీసుకొచ్చింది. కుటుంబాలపై పడే భారం, పిల్లలను పెంచేందుకు, చదువుకు అయ్యే వ్యయాలను తగ్గించడంతోపాటు ఆర్థిక సాయం కల్పించడమే లక్ష్యంగా ఈ ప్రతిపాదనను తీసుకొచ్చింది. కాగా, ఈ ఏడాది మేలో ఇద్దరు పిల్లల విధానాన్ని సడలించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ముగ్గురు పిల్లల్ని కనేందుకు అనుమతి నిచ్చింది.

చైనా లో ముగ్గురు పిల్లలు కనేందుకు నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ ఆమోదం తెలపడంతో జనాభా పెరగనుంది . జనాభాకు తగ్గట్లుగా ఆర్థిక వనరులు పెంచాలని కూడా నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ నిర్ణయించింది. చైనాలో జరిగిన సంస్కరణలపై దేశంలో ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక దేశంలో జనాభా పెరగటం ఖాయమని అంటున్నారు . ఇప్పటికి ప్రపంచ జనాభాలో మొదటి స్తనాత్మలో ఉన్న చైనా తరువాత స్థానంలో ఉన్న ఇండియా కంటే కొచం మాత్రమే అధికంగా ఉంది. మరికొన్ని సంత్సరాలలోనే ఇండియా చైనా జనాభాను అధికగామించే అవకాశం ఉంది. అయితే చైనా చేసిన చట్టం వల్ల ఇప్పట్లో ఇండియా చైనా జనాభాను అధిగమించే అవకాశాలు లేవని అంటున్నారు. ఇప్పటికే అగ్ర రాజ్యాంగ ఉన్న చైనా అన్ని రంగాలలో దూసుకుపోతుంది. కరోనా మహమ్మారిలో సైతం దేశ ఆర్థిక ప్రగతి గణాంకాలు గణనీయంగా ఉన్నాయి. అందువల్ల జనాభా పెరిగిన పెద్దగా ఇబ్బంది ఉండదనే అభిప్రాయంతో ఆదేశ పాలకులు ముందుకు పోతున్నారు.

Related posts

తల్లి సత్యం.. తండ్రి అపోహ.. రాజయ్యకు వర్తించదా?: కడియం సూటి ప్రశ్న

Drukpadam

జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు ఉద్యమ కార్యాచరణ చేపడతాం :కె .రాంనారాయణ!

Drukpadam

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్

Ram Narayana

Leave a Comment