Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఎగ్జిబిషన్ సోసైటీ అధ్యక్షుడిగా ఆర్థిక మంత్రి హరీశ్ రావు

ఎగ్జిబిషన్ సోసైటీ అధ్యక్షుడిగా ఆర్థిక మంత్రి హరీశ్ రావు

ఎగ్జిబిషన్ సోసైటీ అధ్యక్షుడిగా ఆర్థిక మంత్రి హరీశ్ రావు ఎన్నికయినట్లు ఎగ్జిబిషన్ సోసైటీ యాజమాన్య కమిటీ ప్రకటించింది.

తమ విన్నపాన్ని మన్నించి అధ్యక్షుడిగా ఉండేందుకు అంగీకరించినందుకు కమిటీ సభ్యులు మంత్రి హరీశ్ రావును ఆయన నివాసంలో కలిసి ధన్యవాదాలు తెలిపారు.

ఎగ్జిబిషన్ సోసైటీని మరింత ముందుకు తీసుకెళ్తా – ఆర్థిక మంత్రి హరీశ్ రావు

ఎగ్జిబిషన్ సోసైటీని మరింత ప్రగతి పథంలో నడిచేలా శక్తివంచన లేకుండా పని చేస్తానని తనను కలిసిన సోసైటీ యాజమాన్య కమిటీ ప్రతినిధులతో మంత్రి హరీశ్ రావు అన్నారు.

నా బాధ్యత మరింత పెరిగిందన్న ఆయన ప్రతిష్టాత్మక సంస్థను అందరం కలిసి ముందుకు తీసుకెళ్దామన్నారు.

గత 80 ఏళ్లుగా ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ను ఘనంగా నిర్వహిస్తున్నారని, ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో నుమాయిష్ ను విశ్వవ్యాప్తంగా గుర్తింపు పొందేలా కలిసి పని చేద్దామన్నారు.

సోసైటీ ఆధ్వర్యంలో నడిచే విద్యా సంస్థల ద్వారా పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, వృత్తి నైపుణ్యం మెరుగుపడి ఉపాధి అవకాశాలు పొందేలా చేద్దామన్నారు.

Related posts

Drukpadam

తాలిబన్లతో అమీ తుమీ కే సిద్ధపడ్డ పంజ్ షీర్ హోరాహోరీ పోరాటం!

Drukpadam

Here’s Why Your Salad May Not Be The Most Healthy Meal

Drukpadam

Leave a Comment