Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కేంద్ర ప్రభుత్వంపై మంత్రి పువ్వాడ అజయ్ ఫైర్!

కేంద్ర ప్రభుత్వంపై మంత్రి పువ్వాడ అజయ్ ఫైర్!
-రాష్ట్రానికి ఏం మేలు చేశారని.. కిషన్​రెడ్డి యాత్రలు చేస్తున్నారు?
-రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా రాలేదని మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్​ పేర్కొన్నారు. కేంద్రం మొండి చేయి చూపించినా.. కేసీఆర్​ నాయకత్వంలో అభివృద్ధి ఆగదని స్పష్టం చేశారు. ఖమ్మంలో నిర్వహించిన గ్రామీణ రహదారుల సదస్సులో ఆయన పాల్గొన్నారు. కేంద్ర వైఖరిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు .కేంద్ర బీజేపీ యేతర ప్రభుత్వాలపై వివక్ష చూపుతుందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వాలపై సవతి తల్లి ప్రేమ చూపుతుందని ఆయన దుయ్యబట్టారు . అయినప్పటికీ రాష్ట్ర లో వివిధ అభివృద్ధి పథకాల అమలు కోసం కేసీఆర్ పట్టుదలతో ప్రణాళిక బద్దంగా కృషి చేస్తున్నారని అన్నారు.

కేంద్రం నుంచి ఏం నిధులు తీసుకువచ్చారని.. రాష్ట్రానికి ఏం మేలు చేశారని రాష్ట్రంలో కేంద్ర మంత్రులు యాత్రలు చేస్తున్నారో చెప్పాలని రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ డిమాండ్​ చేశారు. ఆజాదికా అమృత్ ఉత్సవాల్లో భాగంగా ఖమ్మం జడ్పీ సమావేశ మందిరంలో ఛైర్మన్‌ లింగాల కమల్‌ రాజు అధ్యక్షతన గ్రామీణ రహదారులపై సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వంపై పువ్వాడ పలు విమర్శలు చేశారు.

రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా రాలేదని పువ్వాడ తెలిపారు. రాష్ట్రం నుంచి రూ.3 లక్షల కోట్లు పన్నుల రూపంలో చెల్లిస్తుంటే లక్షా 40వేల కోట్లు మాత్రమే తిరిగి రాష్ట్రానికి వస్తోందని తెలిపారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులతో ఉత్తర్​ ప్రదేశ్‌, బిహార్ రాష్ట్రాలకు వేల కిలోమీటర్ల మేర రహదారులు వేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలోని గ్రామీణ రోడ్లకు మాత్రం కేంద్రం రోడ్లు మంజూరు చేయడం లేదని మండిపడ్డారు. ఏడేళ్ల కాలంలో గ్రామాల్లో రోడ్లను రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే వేసుకున్నామని చెప్పారు. కేంద్రం మొండి చేయి చూపినా రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు.

Related posts

ఈటలను ఎదుర్కోవడానికి కేసీఆర్ సిద్ధంగా ఉండాలని సవాల్ …ఈటల భార్య జమున!

Drukpadam

ఏపీది దాదాగిరి.. కేంద్రానిది వ్యతిరేక వైఖరి: కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు…

Drukpadam

టీడీపీ కార్య‌క‌ర్త‌లు బ‌రి తెగించారు… కుప్పం ఘ‌ర్ష‌ణ‌ల‌పై స‌జ్జ‌ల ఆగ్ర‌హం

Drukpadam

Leave a Comment