Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కేసీఆర్ పై రేవంత్ మాట్లాడుతున్న తీరు పట్ల సోనియాకు ఫిర్యాదు : జీవన్ రెడ్డి

కేసీఆర్ పై రేవంత్ మాట్లాడుతున్న తీరు పట్ల సోనియాకు ఫిర్యాదు : జీవన్ రెడ్డి
-రేవంత్ వర్సెస్ టీఆర్ఎస్
-ఇటీవల సీఎం కేసీఆర్ కు రేవంత్ సవాల్
-ఘాటుగా బదులిచ్చిన మల్లారెడ్డి
-తాజాగా జీవన్ రెడ్డి ప్రెస్ మీట్
-థర్డ్ క్లాస్ మాటలు మాట్లాడుతున్నాడని విమర్శలు

టీపీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక ఎంపీ రేవంత్ రెడ్డి దూకుడు పెంచి టీఆర్ఎస్ అధినాయకత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా సీఎం కేసీఆర్ ను, ఆయన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఇటీవల సీఎం కేసీఆర్ దత్తత గ్రామాల్లో ఏం అభివృద్ధి జరిగిందో చూపిస్తే తాను ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.

దీనిపై ఇప్పటికే మంత్రి మల్లారెడ్డి ఘాటైన పదజాలంతో జవాబివ్వగా, తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి స్పందించారు. సీఎం కేసీఆర్ పై రేవంత్ మాట్లాడుతున్న తీరును కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీల దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. వారిరువురికీ లేఖలు రాశామని వెల్లడించారు.

రేవంత్ రెడ్డి మాటలు థర్డ్ క్లాస్ మాటలని జీవన్ రెడ్డి అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరూ తనను పట్టించుకోవడంలేదన్న అసంతృప్తితో రేవంత్ ఈ విధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. అధికారంలోకి రాలేమన్న సత్యాన్ని గ్రహించే నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. ఇకనైనా రేవంత్ తీరు మార్చుకోవాలని హితవు పలికారు.

మంత్రి మల్లారెడ్డి ,రేవంత్ మధ్య మాటల యుద్ధం

సాయంత్రం వరకు రేవంత్ కు గడువిస్తున్నా.. సవాల్ కి కట్టుబడి ఉన్నా: మల్లారెడ్డి
రాజీనామా చేసి ఎన్నికలకు రావాలి
నా సవాల్ ను రేవంత్ స్వీకరించాలి
కేసీఆర్, కేటీఆర్ లపై రేవంత్ వాడిన భాషను చూసే తాను స్పందించానని వ్యాఖ్య

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి తెలంగాణ మంత్రి మల్లారెడ్డి మరోసారి సవాల్ విసిరారు. మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి తాను రాజీనామా చేస్తానని… దమ్ము, ధైర్యం ఉంటే నీవు కూడా పీసీసీ, ఎంపీ పదవికి రాజీనామా చేయ్… ఇద్దరం మళ్లీ పోటీ చేద్దామని నిన్న మల్లారెడ్డి సవాల్ విసిరారు. నువ్వు గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పారు. ఓడినోళ్లు ముక్కు నేలకు రాసి వెళ్లిపోవాలని అన్నారు.

ఈ రోజు మరోసారి ఇదే అంశంపై మల్లారెడ్డి మాట్లాడారు. ఈరోజు సాయంత్రం వరకు రేవంత్ రెడ్డికి సమయం ఇస్తున్నానని… తన సవాల్ ను రేవంత్ స్వీకరించాలని అన్నారు. తన రాజీనామాకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. కేసీఆర్, కేటీఆర్ లపై రేవంత్ రెడ్డి వాడిన భాషను చూసే తాను స్పందించానని చెప్పారు.

Related posts

షర్మిల పార్టీ పేరు వైయస్ ఆర్ టీపీ నా …?

Drukpadam

ఎవరితో పొత్తులేదు ..వీలినంలేదు …43 స్థానాల్లో ఫోర్స్ గా ఉన్నాం ..షర్మిల

Drukpadam

‘మహా’ సర్కారు కుప్పకూలడం ఖాయమేనా?గంటగంటకు మారుతున్న పరిణామాలు !

Drukpadam

Leave a Comment