Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

నా ప్రాణాలకు ముప్పు ఉంది.. జడ్ ప్లస్ సెక్యూరిటీ ఇవ్వండి: అమిత్ షాను కోరిన కేంద్ర మంత్రి!

నా ప్రాణాలకు ముప్పు ఉంది.. జడ్ ప్లస్ సెక్యూరిటీ ఇవ్వండి: అమిత్ షాను కోరిన కేంద్ర మంత్రి
-కాల్స్, మెసేజీల ద్వారా బెదిరింపులు వస్తున్నాయి
-హాజీపూర్ పర్యటన సందర్భంగా ఆయిల్ విసిరారు
-నాకు రక్షణ కల్పించడం ప్రభుత్వాల బాధ్యత

తన ప్రాణాలకు హాని ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కేంద్ర మంత్రి పశుపతి కుమార్ పరాస్ మొరపెట్టుకున్నారు. తనకు జడ్ ప్లస్ సెక్యూరిటీతో భద్రతను కల్పించాలని కోరుతూ అమిత్ షాకు లేఖ రాశారు. తన భద్రతా సమస్యలకు సంబంధించి బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కు కూడా ఆయన లేఖ రాశారు. ఎల్జేపీకి చెందిన కేశవ్ సింగ్ ఫోన్ కాల్స్, మెసేజీల ద్వారా తనను బెదిరిస్తున్నారని పశుపతి కుమార్ పరాస్ తెలిపారు.

తన నియోజకవర్గం హాజీపూర్ లో ఈ నెల 23న తాను పర్యటించానని… ఆ సందర్భంగా తనకు భారీ ఎత్తున ప్రజామద్దతు లభించడంతో ప్రత్యర్థులు ఆశ్చర్యపోయారని చెప్పారు. దీంతో ప్రత్యర్థులు నియమించిన వ్యక్తుల గుంపు ద్వారా తన అశ్విక దళానికి నల్ల జెండాలు చూపించారని, ఆయిల్ కూడా చల్లారని తెలిపారు. తన పార్టీలోని మరికొందరు నేతలకు కూడా బెదిరింపులు వచ్చాయని చెప్పారు. ఎల్జేపీ పార్టీ అధ్యక్షుడినైన తనకు సరైన భద్రత కల్పించడం ప్రభుత్వాల బాధ్యత అని తెలిపారు.

రామ్ విలాశ్ పాశ్వాన్ చనిపోయిన తర్వాత ఎల్జీపీ పార్టీ ముక్కలైంది. పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్ తానే పార్టీ అధ్యక్షుడినని ప్రకటించుకున్నారు. అయితే ఆయన చిన్నాన్న పశుపతి కుమార్ పరాస్ పార్టీని చీల్చి… ఎల్జేపీ అధ్యక్షుడిని తానే అని ప్రకటించుకున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య రాజకీయ వైరం నడుస్తోంది. ఈ నేపథ్యంలో పాశ్వాన్ కుటుంబంలో తీవ్ర మనస్పర్థలు ఏర్పడ్డాయి. పశుపతి కుమార్ పరాస్ ,చిరాగ్ పాశ్వాన్ మధ్య పచ్చ గడ్డి వేస్తె భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. చిరాగ్ లేకుండానే పార్లమెంటరీ పార్టీ నాయకుడుగా ఆ తరువాత ఎల్జేపీ అధ్యక్షుడుగా పరాస్ ప్రకటించుకున్నారు. పరాస్ ఏకపక్షంగా ప్రకటించుకున్నారని చిరాగ్ ఆరోపణలు , కేంద్రంలోని బీజేపీ సర్కార్ సైతం పరాస్ కు మద్దతు ప్రకటించడం ,ఆయనను మంత్రి వర్గంలోకి తీసుకోవడంపై చిరాగ్ మండి పడుతున్నారు ….

Related posts

బెంగాల్ సిఎం పై దాడి

Drukpadam

ధాన్యం ఇతరదేశాల నేరుగా ఎగుమతి చేయాలి …ఏపీ సీఎం జగన్

Drukpadam

ఏపీ సహా ఐదు రాష్ట్రాల అప్పులపై ‘ది ప్రింట్’ సంచలనాత్మక కథనం..

Drukpadam

Leave a Comment