Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

తాలిబన్ల మరో కిరాతకం.. జానపద గాయకుడి హత్య!

తాలిబన్ల మరో కిరాతకం.. జానపద గాయకుడి హత్య!
-ప్రముఖ జానపద గాయకుడు ఫవాద్‌ను కాల్చి చంపిన తాలిబన్లు
-తిరుగుబాటు దళాల పనేనన్న తాలిబన్లు
-హంతకులను గుర్తించి శిక్షిస్తామని హామీ

ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల అరాచకాలు కొనసాగుతున్నాయి. వ్యతిరేకులను యథేచ్ఛగా హత్య చేస్తున్న తాలిబన్లు తాజాగా ప్రముఖ జానపద గాయకుడు ఫవాద్ అంరాబీని దారుణంగా హతమార్చారు. బగ్లాన్ ప్రావిన్స్‌లో నిన్న ఆయనను కాల్చి చంపారు. ఈ ప్రాంతంలో తాలిబన్ వ్యతిరేక దళాలకు గట్టి పట్టుంది. కొన్ని ప్రాంతాలు వారి అధీనంలో కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

తాలిబన్లు తన తండ్రిని కాల్చి చంపారని ఆయన కుమారుడు జవాద్ అందరాబీ తెలిపారు. తాలిబన్లు తమ ఇంటికి రావడం ఇదే తొలిసారి కాదని, గతంలోనూ ఓసారి వచ్చి ఇంట్లో తనిఖీలు చేశారని పేర్కొన్నారు. అంతేకాదు, ఇంట్లో తన తండ్రితో కలిసి టీ కూడా తాగారని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడేమైందో తెలియదని, తన తండ్రిని కాల్చి చంపారని జవాద్ ఆవేదన వ్యక్తం చేశారు.

మరోవైపు, ఫవాద్‌ను హత్య చేసింది తాము కాదని, తిరుగుబాటుదారులే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని తాలిబన్లు చెబుతున్నారు. తండ్రి హత్యపై న్యాయం కోరుతూ స్థానిక తాలిబన్ కౌన్సిల్‌ను ఆశ్రయించగా .. ఫవాద్ హంతకులను గుర్తించి శిక్షిస్తామని హామీ ఇచ్చినట్టు జవాద్ తెలిపారు. ఘటనపై దర్యాప్తు జరిపించి కారకులైన తిరుగుబాటుదారులను శిక్షిస్తామని తాలిబన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ హామీ ఇచ్చారని జవాద్ తెలిపారు.

చుట్టూ సాయుధ తాలిబన్లు.. ‘భయపడుతూనే’ ఈ జర్నలిస్ట్​ లైవ్​ షోలో చెప్పిన మాటిది…


తాలిబన్లంటే భయం వద్దంటూ కామెంట్
వీడియోను ట్వీట్ చేసిన ఇరాన్ జర్నలిస్ట్
కొన్ని రోజులుగా జర్నలిస్టులపై తాలిబన్ల దాడులు

‘భయపెట్టడం’.. ఇదే తాలిబన్ల నైజం. భయపడకుంటే కాల్చి పారేయడం ఇదే వారి క్రూరత్వం. అలాంటి వారు ఓ పది మంది తుపాకులు పట్టుకుని మన చుట్టూ చేరితే..! ఓ జర్నలిస్ట్ కు ఇదే అనుభవం ఎదురైంది. ఓ వార్తా సంస్థలో పనిచేస్తున్న జర్నలిస్ట్ ను వారు భయపెట్టి.. భయపడొద్దంటూ ఆఫ్ఘన్లకు చెప్పించడం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.

ఓ 8 మంది సాయుధ తాలిబన్లు ఆ యాంకర్ చుట్టూ ఉండగా.. ‘ఆఫ్ఘన్లెవరూ తాలిబన్లను చూసి భయపడొద్దు. ఇస్లామిక్ ఎమిరేట్ అంటే భయం వద్దు’ అని లైవ్ లో చెప్పాడు. భయపడొద్దు అని చెప్పేటప్పుడు అతడి మాటల్లో భయం కనిపించడం గమనార్హం. అయితే, పత్రికా స్వేచ్ఛను కాపాడుతామని చెప్పిన తాలిబన్లు ఇప్పుడు ఇలా తుపాకులు భయపెట్టి బెదిరించి చెప్పించడమేంటని ఆగ్రహం వ్యక్తమవుతోంది.

దానికి సంబంధించిన వీడియోను ఇరాన్ కు చెందిన మాసీ అలీనాజాద్ అనే మహిళా జర్నలిస్టు ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. కొన్ని రోజుల క్రితం టోలో న్యూస్ కు చెందిన జర్నలిస్టును, కెమెరామ్యాన్ ను తాలిబన్లు చితకబాదారు. జర్నలిస్టులు, వారి బంధువుల ఇళ్లలోకి చొరబడి సోదాలు చేశారు. కాబూల్, జలాలాబాద్ లలో జర్నలిస్టులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. ఇలాంటి సందర్భాల్లో పత్రికా స్వేచ్ఛ ఎక్కడుందని జర్నలిస్టులు ప్రశ్నిస్తున్నారు.

Related posts

వ్యక్తిగత జీవితంలోకి యాపిల్​ చొరబాటు.. ఐక్లౌడ్​, గ్యాలరీ, మెసేజ్​ లలో పంపే ఫొటోలన్నింటిపైనా నిఘా!

Drukpadam

మహారాష్ట్రలో భారీ ఎన్ కౌంటర్.. మావోలకు పెద్ద ఎదురుదెబ్బ 26 మంది మృతి!

Drukpadam

చనిపోయిందని సీబీఐ నిర్ధారించిన మహిళ కోర్టులో ప్రత్యక్షమైంది!

Drukpadam

Leave a Comment