Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

జడ్పీ చైర్మన్ల తో కేసీఆర్ భేటీ -చైర్మన్లు ఉబ్బితబ్బిబ్బు

జడ్పీ, డీసీసీబీ,డీసీఎంస్ చైర్మన్ల తో కేసీఆర్ భేటీ -చైర్మన్లు ఉబ్బితబ్బిబ్బు
-జడ్పీ చైర్మన్లకు కోటి రూపాయలు కేటాయిస్తామని ప్రకటన
-కొత్త జిల్లాలో జడ్పీ చైర్మన్లకు కొత్త నివాసాలు
-సహకార వ్యవస్థను బలోపేతం చేయాలనీ క్లాస్
-డీసీఎంస్ లు యాక్టీవ్ గా ఉంటె రైతులు ప్రవేట్ వ్యాపారుల దగ్గరకు పోరన్న కేసీఆర్
-జడ్పీ చైర్మన్లు విందు సమావేశాలు పెట్టాలని సూచన

ఈ నెల 7 తేదీన టీఆరెఎస్ రాష్ట్ర విస్తృత సమావేశం హైద్రాబాద్ లోని తెలంగాణ భవన్ జరిగింది . ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు , ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు , జడ్పీచైర్మన్లు , డీసీసీబీ, డీసీఎంస్ చైర్మన్లు హాజరైయ్యారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్లు , డీసీసీబీ,డీసీఎంస్ చైర్మన్లతో జరిపిన ప్రత్యేక సమావేశం పై చర్మన్లు ఉబ్బితబ్బి అవుతున్నారు. జిల్లాలో మంత్రి పెద్దగా పట్టించుకోడు, ఎమ్మెల్యేలు కూడా అంతతే ….. మాపని బ్యాక్ బెంచ్ విద్యార్థులుగా ఉంది .కేసీఆర్ సమావేశం తరువాత తమకు ఒక విశ్వాసం కలిగిందనే అభిప్రాయంతో చైర్మన్లు ఉన్నారు. పార్టీ సమావేశంలో అనేక విషయాలు ప్రస్తావించిన కేసీఆర్, ప్రత్యేకించి జడ్పీ చైర్మన్ల పాత్రపై గురించి వివరించారు. జిల్లాలో మంత్రులు, ఎంపీలు ,ఎమ్మెల్యేలు ,ఎమ్మెల్సీలు అందరికి నేనొకసారి జడ్పీ చైర్మన్ భోజనాలు ఏర్పాటు చేయాలనీ ఆసందర్బంగా నాయకులూ అందరు కలుసుకొని మనసు విప్పి మాట్లాడుకుంటారని దాని వల్ల అనేక సమస్యలు పరిస్కారం అవుతాయని అన్నారు. ఇగోలు తొలిగి పోయి ఒకరిపట్ల ఒకరికి నమ్మకం ఏర్పడుతుందని అన్నారు. మంత్రితో సహా అందరు ఈ విందుకు హాజరు కావాలని అన్నారు. అంతటితో ఆగలేదు. సమావేశం అయినా తరువాత , జడ్పీ చైర్మన్లతోను , డీసీసీబీ, డీసీఎంస్ చైర్మన్లతో విడివిడిగా ప్రత్యేక సమావేశం వేర్పాటు చేసి వారిని పేరుపేరునా పలకరించి యోగక్షేమాలు తెలుసుకున్నారు. వారికీ సంవత్సరానికి కోటి రూపాయలు బడ్జట్ కేటాయిస్తామన్నారు. కొత్తగా ఏర్పడిన జిల్లాలో కొత్తగా నివాసాలు నిర్మిస్తామని చెప్పారు. దీంతో వారికీ పట్టరాని ఆనందం . స్వయంగా సీఎం పిలిచి సమావేశం వేర్పాటు చేయటమే కాకుండా తమకు నిధులు కేటాయించడంపై హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. స్థానిక సంస్థలను బలోపేతం చేయడంలో జడ్పీ చైర్మన్లు క్రియాశీలకంగా వ్యవహరించాలని చూచించారు. ప్రజలను మెప్పించేలా ప్రజాప్రతినిధులు వ్యవహరించాలని అన్నారు. ప్రజలిచ్చిన అధికారాన్ని గౌరవంగా స్వీకరించి వారికీ సేవచేయాలన్నారు. త్వరలో ప్రగతి భవన్ ఒక సమావేశం ఏర్పాటు చేసి జడ్పీ చైర్మన్ల నిధులు ,విధులపై చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకుందామన్నారు. జడ్పీ చైర్మన్ కు కేటాయించే కోటి రూపాయల నిధులు అత్యవసర సమయాలలో అవసరానికి వినియోగించు కొనేలా చేద్దాం అన్నారు.
జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షులు, డీసీఎంస్ అధ్యక్షులతో విడిగా సమావేశమైన కేసీఆర్ సహకార వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని వారికీ గుర్తు చేశారు. సహకార సంఘాలు బాగా పనిచేస్తే రైతులు ప్రవేట్ వ్యాపారుల వద్దకు వెళ్ళలిసిన అవసరం రాదని అన్నారు. గతంలో సహకార సంఘాలు బాగా పని చేశాయని మీరు బాగా పనిచేసి వాటికీ పూర్వవైభవం తేవాలని కేసీఆర్ అన్నారు. బలమైన నెట్ వర్క్ రైతులకు మేలు చేయాలనే తపన డీసీఎంస్ లేక్ ఉంటుందని అందువల్ల డీసీఎంస్ లో యాక్టీవ్ రోల్ ప్లే చేయాలన్నారు. రైతులకు అవసరమైన ఎరువులు, పురుగు మందులు , బయట వ్యాపారులకన్నా తక్కువరేటుకు , నాణ్యమైన వాటిని అందేంచేందుకు చెర్యలు తీసుకోవాలని కేసీఆర్ సూచించారు.

Related posts

సావర్కర్‌పై రాహుల్ వ్యాఖ్యల కలకలం.. మహారాష్ట్రలోని మహావికాస్ అఘాడీలో ముసలం!

Drukpadam

బడా బూర్జవపార్టీల విధానాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. –తమ్మినేని

Drukpadam

రేవంత్ రెడ్డి నియామకానికి రూ. 25 కోట్లు తీసుకున్నానా?.. క్షమాపణ చెప్పండి: ఎమ్మెల్యే సుధీర్!

Drukpadam

Leave a Comment