చిన్నమ్మకు తమిళనాట బ్రహ్మరథం
బెంగుళూరు నుంచి చెన్నై కి 12 గంటలకు పైగా ప్రయాణం
-66 చోట్ల స్వాగతం… భారీగా తరలివచ్చిన ప్రజలు
-మంత్రుల్లో వణుకు -అన్నా డీఎంకె తనదేనంటూ సంకేతాలు
చిన్నమ్మ గ్రేట్ ఎంట్రీతో తమిళనాట ఏమి జరగ బోతుంది అనేది ఆశక్తిగా మారింది. ఆమె గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు . ఈమె దెబ్బకు ప్రత్యర్థి పార్టీల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఆమె వాళ్ళ ఏపార్టీకి నష్టం , ఏపార్టీకి లాభం , ఆమె ఏమి చేయబోతున్నారు అనేది ప్రస్తుతం హాట్ టాఫిక్ గా మారింది .
జయలలిత నెచ్చలి చిన్నమ్మగా పిలవబడే శశికళ నాలుగు సంవత్సరాల తరువాతబెంగుళూరు నుంచి చెన్నై కి బయలుదేరి వచ్చారు . ఆమె మేనల్లుడు అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం పార్టీ నేత దినకరన్ 30 కార్లతో బెంగుళూరు నుంచి చిన్నమ్మను చెన్నై కి తోడ్కొని వచ్చారు. ఆమెకు తమిళనాడు బోర్డర్ జాజువాడి వద్ద ఘన స్వాగతం లభించింది . తమిళనాట ప్రజలు బ్రహ్మరథం పట్టారు .ఆమె ప్రయాణిస్తున్న కార్ కు అన్నా డీఎంకె జెండా పెట్టుకొని రావడాన్ని అధికార పార్టీ అభ్యంతరం చెప్పింది . పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒకమంత్రి జెండా తొలగించాలని డీజీపీ ఆఫీస్ కు కూడా వెళ్లారు. అధికారంలో ఉన్న అన్నా డీఎంకె ప్రభుత్వం ఆమెను తమిళనాట అడ్డుకునే ప్రయత్నాలన్నీ బెడిసికొట్టాయి. ఆమెకు 60 చోట్ల తమిళ ప్రజలు స్వాగతం పలికారు . ఆమె వస్తున్నా వాహనం కదలటమే ఇబ్బంది కరంగా మారింది. ఆమెకు లభిస్తున్న ప్రజా మద్దతుతో తమిళ మంత్రుల్లో వణుకు మొదలైందని వార్తలు వస్తున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని ఆమెకు 4 సంవత్సరాల క్రితం జైలు శిక్ష విధించారు. శిక్ష అనంతరం ఆమె బెంగుళూరులోని మణిప్పరం అగ్రహారం జైల్లో ఆమె శిక్ష పూర్తీ అయిన అనంతరం విడుదలైన చెన్నైకి చేరుకున్నారు. జైలు శిక్ష పడిన వెంటనే ఆమెను అధికార అన్నా డీఎంకె నుంచి బహిష్కరించారు. ఆమె మేనళ్లుడు దినకరన్ వేరే పార్టీ పెట్టుకున్నారు. ఇప్పుడు ఆమె మేనల్లుడి పార్టీ ద్వారా రాజకీయాలు చేస్తారని అందరు బాహించారు . కానీ ఆమె మాత్రం అన్నా డీఎంకె కు తానే నిజమైన రాజకీయ నాయకురాలునని చాటబోతున్నారు. జయలలిత మరణం తరువాత ఆమె రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండగా ఆమెకు జైలు శిక్ష పడింది. దీనితో ఆమె ప్రమాణ స్వీకారం చేయకుండానే జైలుకు వెళ్లాల్సివచ్చింది . కేంద్రం జోక్యం వల్లనే ఆమె జైలుకు వెళ్లాల్సి వచ్చిందని అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి . కేంద్రం కూడా దక్షిణాదిన ఒక రాష్ట్రము తన చేతులో ఉండాలనే రీతిలో పావులు కదిపింది . మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్న విద్యాసాగర్ రావు ను తమిళనాడుకు ఇంచార్జి గవర్నర్ గా నియమించి శశికళ ప్రమాణ స్వీకారం చేయకుండా అడ్డుకున్నది . చాల రోజులపాటు క్యాంపు రాజకీయాల అనంతరం ఆమె జైలుకు వెళ్ళినతరువాత పళనిస్వామి , ఓపీ సెల్వం మధ్య బీజేపీ నే రాజీ కుదుర్చి పళనిస్వామిని కుర్చీపై కూర్చో పెట్టింది . నాటి నుంచి తమిళ రాజకీయాలు బీజేపీ కనుసన్నలలో నడుస్తున్నాయనేది బహిరంగ రహస్యమే . చిన్నమ్మ ఎంట్రీతో తమిళ రాజకీయాలు ఏ మలుపు తిరగ బోతున్నాయనే ఆశక్తి నెలకొన్నది .
previous post
next post