ఆంధ్రప్రదేశ్

బతుకమ్మ చీరెలకు 17 రంగులు ,15 డిజైన్లు…

బతుకమ్మ చీరెలు సిద్ధమయ్యాయి. అందరికీ నచ్చేలా 17 రంగులు, 15 డిజైన్లలో తయారైన ఈ చీరెలు జిల్లాలకు చేరుకొంటున్నాయి.

ఈసారి కూడా 18 ఏండ్ల వయసు దాటిన అర్హులైన మహిళలందరికీ చీరెలు పంపిణీ చేసేందుకు కార్యప్రణాళిక రూపొందించారు. అక్టోబర్‌ 6లోగా ఈ చీరెల పంపిణీ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఏటా అర్హులైన మహిళలందరికీ ఉచితంగా చీరెలు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే.

రాష్ట్రంలో 1.05 కోట్ల మంది అర్హులైన మహిళలుండగా.. ఏటా దాదాపు 97 లక్షల మంది బతుకమ్మ చీరెలు తీసుకొంటున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈసారి రూ.333 కోట్లు కేటాయించి టెస్కో ఆధ్వర్యంలో కోటి చీరెలను తయారు చేయించేందుకు మూడు జిల్లాల్లోని పవర్‌లూమ్స్‌కు ఆర్డర్‌ ఇచ్చింది. దీంతో సిరిసిల్లలోని పవర్‌లూమ్స్‌పై 75 లక్షలు, వరంగల్‌లో 13 లక్షలు, కరీంనగర్‌లో 12 లక్షల చీరెలు తయారు చేశారు. వీటిలో ఇప్పటికే 35 లక్షల చీరెలను 18 జిల్లాలకు తరలించి గోదాముల్లో భద్రపరిచారు. మిగిలిన జిల్లాలకు రానున్న పక్షం రోజుల్లో చీరెలను రవాణా చేసేందుకు కార్యప్రణాళిక రూపొందించారు. వృద్ధులకు 6.3 మీటర్లు, ఇతరులకు 5.5 మీటర్ల చీరెలను తయారు చేశారు.

చీరెలోనే బ్లౌజ్‌ కూడా ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ చీరెల తయారీ ద్వారా దాదాపు 10 వేలమంది నేత కార్మికులు, 5 వేలమంది డిజైనర్లు, ఇతర అనుబంధ కార్మికులు ఉపాధి పొందినట్లు అధికారులు వివరించారు.

Related posts

నేను ఆరోగ్యంగా ఉన్నా.. ఎవరూ ఆందోళన చెందవద్దు: వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి!

Drukpadam

దేశ ప్రజలకు దీపావళి కానుక.. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించిన కేంద్ర ప్రభుత్వం!

Drukpadam

ప్రభుత్వం పై సన్నగిల్లిన ఆశలు- పిండిప్రోలులో స్వచ్ఛంద లాక్ డౌన్

Drukpadam