Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

జగన్ ప్రభుత్వానికి మరో ఎదురు దెబ్బ  !

జగన్ ప్రభుత్వానికి మరో ఎదురు దెబ్బ  !

దమ్మాలపాటి శ్రీనివాస్ పై ఇన్సైడర్ ట్రేడింగ్ కేసును కొట్టివేసిన హైకోర్టు
గత నెలరోజులుగా విచారణ.. నేడు తీర్పు
దమ్మాలపాటి శ్రీనివాస్ కు హైకోర్టు క్లీన్ చిట్
దమ్మాలపాటిపై నమోదైన ఎఫ్ఐఆర్ రద్దు
అక్రమ కేసులు పెట్టినందుకు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చని తీర్పు

మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ తో పాటు మరికొందరిపై… అమరావతి భూముల వ్యవహారంలో పెట్టిన ఇన్సైడర్ ట్రేడింగ్, అవినీతి నిరోధక చట్టం కేసులను ఏపీ హైకోర్టు కొట్టివేసింది.

పూర్తి వివరాల్లోకి వెళితే, దమ్మాలపాటి ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారంటూ అవినీతి నిరోధక చట్టం కింద ఆయనపై ఏపీ ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు స్టే ఇచ్చింది. దీంతో, ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. ఈ పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు… ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది జరగలేదని హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం ధర్మాసనం సమర్థించింది. ఈ కేసును నెల రోజుల్లో విచారణ చేయాలని ఏపీ హైకోర్టును ఆదేశించింది.

ఈ నేపథ్యంలో గత నెల రోజులుగా ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో వాదనలు కొనసాగాయి. ఈరోజు తీర్పును వెలువరించింది. దమ్మాలపాటి, ఆయన బంధువులు, కుటుంబీకులపై చేసిన ఆరోపణలు నిరాధారమని హైకోర్టు తెలిపింది. దమ్మాలపాటిపై నమోదైన ఎఫ్ఐఆర్ ను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు… దమ్మాలపాటిపై అక్రమంగా కేసులు నమోదు చేసి, ఆయనను మానసిక వేదనకు గురి చేసినందుకు చట్ట ప్రకారం ఆయన చర్యలు తీసుకోవచ్చని సూచించింది.

భూ పరిహారం ఇవ్వకపోవడంపై ఐఏఎస్​ లపై ఏపీ హైకోర్టు మండిపాటు.. ఐదుగురికి జైలు శిక్ష
-అందరికీ రూ.వెయ్యి చొప్పున జరిమానా
-కోర్టు చెప్పినా ఇవ్వకపోవడమేంటని ఆగ్రహం
-శిక్షపై అప్పీల్ చేసుకునేందుకు నెల గడువు

ఓ మహిళ నుంచి భూమి తీసుకుని పరిహారం అందించని ఐఏఎస్ అధికారులపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశించినా పరిహారం చెల్లింపులను ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటూ మండిపడిన కోర్టు.. ఐదుగురు ఐఏఎస్ లకు జైలు శిక్ష, జరిమానాను విధించింది. వారి జీతాల నుంచి కోత పెట్టి పరిహారం అందించాలని ఆదేశించింది. నెల్లూరు జిల్లా తాళ్లపాకకు చెందిన సాయి బ్రహ్మ అనే మహిళకు సంబంధించిన భూ పరిహారం కేసుపై హైకోర్టు ఈ తీర్పునిచ్చింది.

విశ్రాంత ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్ కు జైలు శిక్షతో పాటు రూ.వెయ్యి జరిమానాను విధించింది. నాటి నెల్లూరు కలెక్టర్ శేషగిరిబాబుకు రెండు వారాలు, ఐఏఎస్ అధికారి ఎస్.ఎస్. రావత్ కు నెల రోజులు, ముత్యాల రాజుకు రెండు వారాలు, మరొక ఐఏఎస్ కు రెండు వారాల జైలు శిక్షను విధించింది. అందరికీ రూ.వెయ్యి చొప్పున జరిమానా వేసింది. శిక్షపై అప్పీల్ చేసుకునేందుకు నెల రోజుల గడువునిచ్చింది.

Related posts

దేశంలో జనాభా తగ్గుతోంది.. మంచిది కాదంటున్న నిపుణులు!

Drukpadam

పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తుండగా ఆగిన గుండె.. నిర్మల్ జిల్లాలో యువకుడు మృతి!

Drukpadam

టియుడబ్ల్యుజె రాష్ట్ర మహాసభలకు ఆహ్వానసంఘం ఆధ్వరంలో చురుగ్గా ఏర్పాట్లు…

Ram Narayana

Leave a Comment