Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఆర్టీసీ ఎం డి గా వి సి సజ్జనార్ …అభినందనలు తెలిపిన మంత్రి పువ్వాడ!

ఆర్టీసీ ఎం డి గా వి సి సజ్జనార్ …అభినందనలు తెలిపిన మంత్రి పువ్వాడ
-ఇప్పటివరకు ఎం డి గా బాధ్యతలు నిర్వహించిన సునీల్ శర్మ ను సత్కరించిన పువ్వాడ
-అనంతరం అధికారులతో సమీక్షా నిర్వహించిన మంత్రి పువ్వాడ

TSRTC ఎండి గా నేడు రవాణా శాఖ ప్రధాన కార్యాలయం నందు V.C సజ్జనార్ గారు బాధ్యతలు చేపట్టారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సజ్జనార్ గారికి పుష్పగుచ్ఛం అందజేసి మంత్రి పువ్వాడ అభినంధనలు తెలియజేశారు. నేటి వరకు బాధ్యతలు నిర్వర్తించిన సునీల్ శర్మ గారికి పుష్పగుచ్ఛం ఇచ్చి, శాలువా కప్పి సత్కరించచి వీడుకోలు పలికారు.. అనంతరం రవాణా శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సజ్జనార్ ను సీఎం ప్రత్యకంగా టీఎస్ ఆర్టీసీ ఎం డి గా నియమించడమా పట్ల సంతోషం వ్యక్తం చేశారు. సీఎం కు ఆర్టీసీ గురించి పూర్తీ అవగాహన ఉన్నందున సజ్జనార్ ను నియమించినట్లు చెప్పారు.

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ఎండీగా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి వీసీ సజ్జనార్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం అధికారాలను మర్యాదపూర్వకంగా కలిశారు . హైదరాబాద్‌లోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయం బస్‌ భవన్‌లో శుక్రవారం సజ్జనార్‌ ఎండీగా బాధ్యతలు చేపట్టారు. సజ్జనార్‌ అంతకుముందు సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌గా పని చేసిన విషయం తెలిసిందే. మూడేళ్ల పాటు సైబరాబాద్‌ సీపీగా పని చేసి నేరాల కట్టడికి కఠిన చర్యలు తీసుకున్నారు. 2009లో దేశంలోనే సంచలనం సృష్టించిన ‘దిశ’ కేసులో సజ్జనార్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సజ్జనార్‌ గతంలో సీఐడీ, ఇంటిలిజెన్స్‌ విభాగాల్లో పని చేశారు.

ఆయన ఎక్కడ పనిచేసిన అంకిత భావంతో పనిచేస్తారని పేరుంది. కొత్త ఆలోచనల సంస్థ అభివృద్ధికి ఆయన తనదైన శైలిలో పనిచేయనున్నారు. పోలీస్ శాఖలో సజ్జనార్ కు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. అనేక జటిలమైన సమస్యలను పరిష్కరించటంలో ఆయన చూపిన చొరవ పట్టుదల దేశంలోనే ప్రసంశలు అందుకుంది.

 

Related posts

ఏడాదిలోగా అన్ని టోల్ ప్లాజాలను తొలగిస్తాం: లోక్ సభలో నితిన్ గడ్కరీ ప్రకటన

Drukpadam

ఏపీ నూతన ఎస్ఈసీగా నీలం సాహ్నీ

Drukpadam

విమానాల్లో మధ్యసీటును వదిలేస్తే కొవిడ్ ముప్పు తగ్గుతుంది: శాస్త్రవేత్తలు

Drukpadam

Leave a Comment