Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

టీఆర్ యస్ యువజన విభాగాన్ని బలోపేతం చేస్తాం :కృష్ణ చైతన్య

కృష్ణ చైతన్య

జిల్లాలో యువజన విభాగాన్ని బలోపేతం చేస్తాం త్వరలో అన్ని మండల మరియు పట్టణ కమిటీలు
టి.ఆర్.ఎస్. యువజన విభాగం జిల్లా అధ్యక్షులుచింతనిప్పు కృష్ణ చైతన్య టి.ఆర్.ఎస్. అధినేత, ముఖ్యమంత్రి కె.సి.ఆర్. మరియు టి.ఆర్.ఎస్. వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్. సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధిని యువతకు కల్పించిన అవకాశాలను ప్రజలకు వివరించడమే. లక్ష్యంగా రాష్ట్రమంత్రివర్యులు శ్రీ పువ్వాడ అజయకుమార్ అదేశాలమేరకు జిల్లా వ్యాప్తంగా టి.ఆర్.ఎస్. పార్టీకి అనుబంధంగా యువజన విభాగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా కార్యచరణ రూపొందించినట్లు టి.ఆర్.ఎస్. పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు చింతనిప్పు కృష్ణ చైతన్య తెలిపారు.
ఖమ్మంలోని తెలంగాణ భవన్ లో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ప్రతిపక్ష పార్టీలు విద్యార్థులను, నిరుద్యోగ యువతను తప్పుదోవ పట్టించే విధంగా అసత్య ప్రచారాలు చేస్తున్నాయని, టి.ఆర్.ఎస్. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు అన్ని రంగాలలో ప్రాధన్యత కల్పించారని, ఉద్యోగల భర్తీలో కూడా ప్రతిపక్షాలు అధికారంలో వున్న రాష్ట్రాల కంటే మిన్నగా మన రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి కల్పన ఎక్కువ జరిగిందని, అందుకు ఉదాహరణ గ్రాడ్యూయేట్ ఎమ్.ఎల్.సి. ఎన్నికలలో రెండు స్థానాలలో కూడా టి.ఆర్.ఎస్. అభ్యర్థులు ఘన విజయం సాధించారని, ముఖ్యంగా ఐ.టి. మంత్రి కె.టి.ఆర్ గారు హైద్రాబాద్ కు పరిమితమైన ఐ.టి. రంగాన్ని ద్వితీయ శ్రేణి పట్టణాలకు విస్తరింపజేసి ముఖ్యంగా ఖమ్మం లాంటి పట్టణాలలో ఐ.టి. ఉద్యోగాల కల్పనకు శ్రీకారంచుట్టిన చరిత్ర టి.ఆర్.ఎస్. ప్రభుత్వానిదేనని, ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత కె.సి.ఆర్ కే దక్కిందని అన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో త్వరలో స్థానిక ఎమ్.ఎల్.ఎ.లు మరియు నియోజకవర్గ ఇంచార్ట్లు సలహాలు, సూచనలతో పట్టిష్టమైన యువజన విభాగ కమిటి ఏర్పాటు చేయడం ద్వారా ప్రతిపక్ష పార్టీలకు టి.ఆర్.ఎస్. యువజన విభాగం ధీటుగా సమాధానం చెప్పే విధంగా తీర్చిదిద్దుతామని, జిల్లా వ్యాప్తంగా ఉన్న యువత అంతా టి.ఆర్.ఎస్. పార్టీకి అండగా నిలవాలని కోరారు.

Related posts

వచ్చే ఏడాది నుంచి పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం..రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం!

Drukpadam

ఇళ్లల్లోంచి బయటకు రావద్దంటూ సుడాన్‌లోని భారతీయులకు హెచ్చరిక!

Drukpadam

చీమలపాడు ఘటనపై మాజీ ఎంపీ పొంగులేటి దిగ్భ్రాంతి…

Drukpadam

Leave a Comment