Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

హుజురాబాద్ పై కేంద్రీకృతమైన రాజకీయ తుఫాన్ !

హుజురాబాద్ పై కేంద్రీకృతమైన రాజకీయ తుఫాన్
-బీజేపీ ,టీఆర్ యస్ మధ్య రసవత్తర పోరుకు రంగం సిద్ధం
-ఇప్పటికే ఇరుపార్టీలమధ్య మాటల యుద్ధం
-కేంద్రం అండతో బీజేపీ అభ్యర్థిగా ఈటల
-అధికారం అండతో ప్రజలపై వరాలు కురిపిస్తున్న టీఆర్ యస్
-కాంగ్రెస్ తరుపున కౌశిక్ రెడ్డి సైతం బరిలో

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయాలు హుజురాబాద్ నియోజకవర్గం మీద కేంద్రీకృతం అయివున్నాయి . మారిన రాజకీయపరిస్థితిలో అనుహ్యంగా బీజేపీ లో చేరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి హుజురాబాద్ ఉపఎన్నికకు సవాల్ విసిరిన మాజీమంత్రి ఈటల రాజేందర్ తిరిగి ఎన్నికకకు సిద్దపడుతున్నారు. రాజీనామా చేసిన ఆరు నెలల లోపు ఎన్నిక జరగలిసి ఉంటుంది. అందువల్ల ఏ క్షణమైనా ఎన్నిక జరిగే అవకాశం ఉంది. ఫలితంగా హురాబాద్ లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఇక్కడ అధికార పార్టీ తరుపున పోటీలో ఎవరు ఉన్న ఈటల వర్సెస్ కేసీఆర్ లాగా మారనున్నది .కాంగ్రెస్ తరుపున తిరిగి కౌశిక్ రెడ్డి బరిలో దిగే అవకాశం ఉంది. సవాళ్లు ప్రతి సవాళ్లకు హుజురాబాద్ వేదిక అయింది. రేపు జరిగే ఎన్నిక ఎన్నికలా కాకుండా పోట్ల గిత్తలు పోట్లాడుకుంటున్నట్లు ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఈటల హుజురాబాద్ లో జరిగే ఎన్నిక కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుందని ప్రకటించారు.

ఇక్కడ ఎట్టి పరిస్థితిలోను ఈటలను ఓడించటం ద్వారా కేసీఆర్ కుటుంబంపై తిరుగుబాటు చేస్తే పుట్టగతులు ఉండవనే సంకేతాన్ని ఇవ్వాలని టీఆర్ యస్ చూస్తుంది. ఈటల బీజేపీ లో చేరిక మింగుడుపడని కేసీఆర్ పెద్ద ఎత్తున నిధుల వరద పారించడం ద్వారా నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరేయాలని వ్యూహాలు పన్నుతున్నారు. మొన్నటికి మొన్న , 30 కోట్ల రూపాయల నిధులు కేటాయించారు. అభివృద్ధి పనుల వేగం పెంచారు. ఎక్కడ ఏ గ్రామానికి ఏమి కావాలో తెలుసుకొని మంజూరి చేయడంద్వారా నియోజకవర్గ ప్రజలను సంతృప్తి పరిచే పనిలో అధికార టీఆర్ యస్ ఉంది. కేంద్రం నుంచి ఎలాంటి మేళ్లు జరుగుతున్నాయనే డేటా కలెక్ట్ చేయాం ద్వారా ప్రజలకు వివరించాలని బీజేపీ నేతలు ప్రయత్నం చేస్తున్నారు. ఎత్తులకు పై ఎత్తులతో ప్రత్యర్థులను చిత్తుచేయాలని ఎవరికీ వారు పావులు కదుపుతున్నారు.

రాష్ట్రంలో హుజురాబాద్ ఎన్నిక హాట్ టాపిక్ గా మారింది.టీఆర్ యస్ నుంచి బరిలో ఎవరు ఉంటారనే విషయంలో ఇంకా ఒక క్లారిటీ రాలేదు . ఇద్దరు ముగ్గురు పరిశీలనలో ఉన్నారని అంటున్నారు . నియోజకవర్గంలో పార్టీ వ్యవహారాలను చూసే భాద్యతను సీనియర్ మంత్రి హరీష్ రావు కు అప్పగించారు .కరీంనగర్ కు చెందిన గంగుల కమలాకర్ నియోజకవర్గంపై కేంద్రీకరించారు .మాజీఎంపీ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోదరావు ,మరో రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మి కాంతారావు ,సత్యనారాయణ , వరంగల్ నుంచి ధర్మారెడ్డి లను ఇప్పటికే నియోజవర్గంలో సమావేశాలకు పంపుతున్నారు.

కొంతమంది టీఆర్ యస్ కు చెందిన ఎంపీపీ లు , జడ్పీటీసీ లు , టీఆర్ యస్ పార్టీ మండల అధ్యక్షులు ఇప్పటికి ఈటలతో ఉండటంతో వారిని తమవైపుకు తిప్పుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ నాయకులనే డబ్బులతోనే కొనే సంస్కృతీ ఎక్కడైనా చేశామా ? అది హుజురాబాద్ నియోజవర్గంలో జరుగుతుందని ఈటల టీఆర్ యస్ పైన నాయకుడు కేసీఆర్ పైన విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అహంకారానికి ఆత్మగౌరవానికి జరుగుతున్నా పోరాటంలో ఆత్మగౌరవం విజయం సాదిస్తుందని ఈటల విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

ఈటల భూకబ్జాలకు పాల్పడినందునే ఆయన్ను మంత్రివర్గం నుంచి తప్పించడం జరిగిందని టీఆర్ యస్ నేతలు అంటున్నారు. ఆయన కేసీఆర్ దయతోనే టికెట్ పొంది విజయం సాధించారని అంటున్నారు. ఈసారి నియోజకవర్గంలో జరిగే ఉప ఎన్నికలో ఈటల ఓటమి తప్పదని టీఆర్ యస్ ధీమా వ్యక్తం చేస్తుంది.

ఈటల బీజేపీ లో చేరతారని ఊహించని టీఆర్ యస్ అధినేత కేసీఆర్ అనూహ్యంగా బీజేపీలో చేరడంతో కంగు తిన్నారు. ఈటల కూడా ఇంత తొందరగా బీజేపీ లోకి వెళతారని రాజకీయపరిశీలకులు సైతం ఊహించలేదు. భూకబ్జా ఆరోపణలు రావడంతో దానిపై తన కాబినెట్ సహచరుడైన ఈటల ను కనీసం పిలిచి అడగకుండానే , కొందరు రైతులు చేసిన ఆరోపణలపై విచారణ జరిపించడం , వెంటనే ఆయన్ను మంత్రి వర్గంనుంచి తప్పించడం ఆగమేఘాలమీద జరిగిపోయాయి.

దీంతో ఈటల కూడా తన రాజకీయ భవిషత్ పై మదనపడ్డారు . క్రాస్ రోడ్డులో ఉన్న ఈటల ముందు నాలుగు మార్గాలు ఉన్నాయి. ఒకటి బీజేపీ లో చేరడం రెండు కాంగ్రెస్ లో చేరడం ,మూడు స్వంతగా పార్టీ పెట్టడం నాలుగు స్వతంత్రంగా ఉండటం . అయితే కింద ఉన్న మూడు కారణాల వల్ల లాభం లేక పోగా నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల మొదటి మార్గమైన బీజేపీ లో చేరడం కరెక్ట్ అనుకున్నారు. అందుకు అనుగుణంగా బీజేపీ నేతలు కూడా వేగంగా పావులు కదిపారు. తమ పార్టీలో చేరితే కలిగే ప్రయోజనాలు గురించి వివరించారు . వత్తిడి తెచ్చారు. దీంతో బీజేపీ లో చేరితేనే తనకు తక్షణ ప్రయోజనం ఉంటుందని భావించిన ఈటల బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

 

Related posts

పెగాసస్ వివాదం.. రేపు రాజ్‌భవన్‌ను ముట్టడిస్తామన్న రేవంత్‌రెడ్డి ఢిల్లీలో విలేకరులతో మాట్లాడిన రేవంత్

Drukpadam

అప్ప‌ట్లో కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్య‌పై ఎగ‌తాళి చేశారు: కేటీఆర్!

Drukpadam

లాలూ ఆగాయా …బీహార్ రాజకీయాలు మారనున్నాయా!

Drukpadam

Leave a Comment