Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

హమ్మయ్య తెలంగాణ ప్రజలకు శుభవార్త -లాక్ డౌన్ ఎత్తి వేత…

హమ్మయ్య తెలంగాణ ప్రజలకు శుభవార్త -లాక్ డౌన్ ఎత్తి వేత…
-ఇక ఎలాంటి ఆంక్షలు ఉండవు … తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం
-ఈ రోజు భేటీ అయిన కేబినెట్ లో లాక్ డౌన్ పై మంత్రుల అభిప్రాయాలు తీసుకున్న సీఎం
-వైద్య శాఖ అధికారుల నివేదిక -రాష్ట్రంలో కేసుల సంఖ్య తగ్గుముఖం
-గత 36 రోజులుగా పకడ్బందీ చర్యలు -రోజురోజుకు గణనీయంగా తగ్గిన కేసులు
-అంతర్ రాష్ట్ర బస్ సర్వీసులపై నిర్ణయం వెలువడాల్సి ఉందన్న ప్రభుత్వ వర్గాలు
-థర్డ్ వెవ్ ప్రభావం పై అధికారులను ఆదేశాలు

జులై 1 విద్యాసంస్థల పునః ప్రారంభం …

కరోనా సెకండ్ వెవ్ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ను పూర్తిగా ఎత్తి వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది . దీంతో రాష్ట్ర ప్రజలు హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు. చాలామంది ప్రజలు ఇళ్లలోనుంచి బయటకు రాలేదు వచ్చిన లాక్ డౌన్ ఆంక్షల మధ్య బిక్కుబిక్కు మంటూ కాలం గడిపారు. లాక్ డౌన్ గత నెల 12 న మొదట పది రోజుల పాటు విధించిన ప్రభుత్వం తరువాత రెండు దఫాలుగా పెంచుతూ మొత్తం 36 రోజుల పాటు కఠినాతి కఠినమైన లాక్ డౌన్ అమలు చేసింది. దీంతో మంచి ఫలితాలు వచ్చాయి. కరోనా కేసుల సంఖ్య , మరణాల సంఖ్య గణనీయంగా తగ్గించగలిగారు . ఇదే విషయంపై ఈ రోజు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భెటిలో సుదీర్ఘంగా చర్చించారు.

రాష్ట్రంలో లాక్ ఎత్తు వేత వెంటనే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. ఇక నుంచి అన్ని వ్యాపార ,వర్తక వాణిజ్య సముదాయాలు గతంలో లాగానే నడుపుకోవచ్చు …. ప్రభుత్వ కార్యాలు యధావిధిగా పని చేస్తాయి.

రైళ్ల విషయంలో కేంద్రం తీసుకోవాల్సిన నిర్ణయం అయినందున రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని బస్ లు ఇతర వాహనాలు ఇక నుంచి రోడ్లపై రయ్ రయ్ న పరుగులు పెట్టనున్నాయి. గతంలో నల్లగొండ ,ఖమ్మం జిల్లాలలో 7 నియోజకవర్గాల పరిధిలో విధించిన ఆంక్షలు పూర్తిగా ఎత్తి వేశారు .

ఇక నుంచి ప్రభుత్వం పరిపాలనపై ద్రుష్టి పెట్టాలని, ప్రత్యేకించి పల్లె ప్రగతి ,పట్టణ ప్రగతి పై అధికార యంత్రంగాం కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని ఆదేశాలు జారీచేశారు. దీనిపై ముఖమంత్రి జిల్లాల పర్యటనలకు సమాయత్తం అవుతున్నారు.

థర్డ్ వెవ్ ప్రభావం పై చర్చ

కేబినెట్ సమావేశంలో కరోనా థర్డ్ వెవ్ ప్రభావం పై కూడా చర్చించారు. ఇది అక్టోబర్ నుంచి వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించిన నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖను అప్రత్తం చేశారు. ఇప్పటి నుంచే దాన్ని ఎదుర్కొనేందుకు చర్యలు చేపట్టారు .థర్డ్ వెవ్ లో చిన్న పిల్లలపై ప్రభావం ఎక్కువగా ఉంటుందని వార్తలు వస్తున్నందున నిలోఫర్ ఆసుపత్రి ని సంసిద్ధం చేయాలనీ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. రాష్ట్రంలో 5 కేంద్రాలను సిద్ధం చేయనున్నారు.

జులై 1 విద్యాసంస్థల పునః ప్రారంభం …

కేబినెట్ సమావేశంలో జులై 1 విద్యాసంస్థల పునః ప్రారంభించాలని మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. విద్యాసంస్థలు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇప్పటికే విద్యార్థులు వివిధ రకాల పోటీ పరీక్షలకు దూరంగా ఉంటున్నారని అందువల్ల విద్య సంస్థల విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకోని వాటిని తెరవాలని కేబినెట్ నిర్ణయించింది.

Related posts

ఆనందయ్య కరోనా మందు పంపిణి పై చేతులెత్తేసిన రాష్ట్ర ప్రభుత్వం…

Drukpadam

మహమ్మారి సమయంలో దేశంలో లెక్కలోకి రాని మరణాలు 49 లక్షలు!

Drukpadam

ఆగస్ట్ నాటికీ ఉపందుకోనున్న ఉచిత టీకా …

Drukpadam

Leave a Comment