Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ కష్టాలు!

హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ కష్టాలు!
-జాతీయరహదానిపై భారీగా ట్రాఫిక్ జామ్
-ప్రజల ఇబ్బందులు -విమానాశ్రయం వెళ్లే వారికీ తప్పని తిప్పలు
-గమ్యస్థానం చేరుకునేందుకు గంటల కొద్దీ ఆలశ్యం
-నిన్న రాత్రి హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షాలు
-జ‌ల‌మ‌య‌మైన రోడ్లు
-నిండిన చింతలచెరువు

విశ్వనగరంగా చెప్పుకుంటున్న హైద్రాబాద్ లో కొద్దిపాటి వర్షం కురిసిన రోడ్లన్నీ జలమయం అవుతున్నాయి వర్షపు నీరు పోయేందుకు తెరిచాను మ్యాన్ ఓల్స్ మృత్యు కుప్పలుగా మారుతున్నాయి. ఇక హైద్రాబాద్ చుట్టుపక్కల జాతీయరహదార్లు వెంట వెళ్లాలన్న ఇబ్బందులు తప్పడం లేదు . వర్ష వస్తే రోడ్ల పక్కన ఉన్న కుంటలు పొంగి రోడ్లమీదకు నీళ్లు వస్తున్నాయి. నిన్న మొన్న కురిసిన భారీ వర్షాలకు మహానగరంలో ఉన్న కొన్ని బ్రిడ్జి లు సైతం మునిగిపోయాయి. బ్రిడ్జి లమీద నుంచి వరదలు పారాయి .నగరంలోని ప్రజలు వణికి పోయారు . బయటకు వెళ్లిన తమ వారు క్షేమంగా వస్తారా ? లేదా ? అనే భయం వెంటాడుతుంది. దంచి కొడుతున్న వర్షాలతో రోడ్లన్నీ జలమయం కావడం ప్రజలు బయటకు వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. హైద్రాబాద్ ఎంజిబిఎస్ బస్ స్టేషన్ కు సమీపంలో ఉన్న చాదర్ ఘాట్ బ్రిడ్జి పై నుంచి మూసి నది పారింది. ఇది దాదాపు నగరంలో నది బోడ్డున ఉంది. బస్సు స్టాండ్ కు వెళ్లాల్సిన బస్ లను వేరే రూట్ లో కి మరల్చారు .విజయవాడ -హైద్రాబద్ జాతీయ రహదారిపై అబ్దుదుల్లా పూర్ మెట్ వద్ద ఉన్న కుంట నిండి రోడ్డుపై కి నీరు చేరడంతో జాతీయరహదారిపై ట్రాఫిక్ జాం అయింది. గంటల కొద్దీ ఆలశ్యం అయింది. కొందరు హాస్పత్రికి చేరుకోవాల్సిన వారు . మరికొందరు విమాన ప్రయాణం పెట్టుకున్నవారు ఆందోళన వ్యక్తం చేశారు.

నిన్న రాత్రి హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షాలు కుర‌వ‌డంతో రోడ్లు జ‌ల‌మ‌య‌మైన విష‌యం తెలిసిందే. దీంతో హైదరాబాద్‌ శివారులోని అబ్దుల్లాపూర్‌మెట్‌ సమీపంలోని చింతలచెరువు నిండిపోవ‌డంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. అంతేకాదు, హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపైకి వరద నీరు చేరింది.

వాహనదారుల‌కు ఇక్క‌ట్లు త‌ప్ప‌ట్లేవు. ఈ రోజు జాతీయ ర‌హ‌దారిపై ట్రాఫిక్‌ స్తంభించడంతో స్థానిక పోలీసులు ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఆ ప్రాంతంలో వాహ‌నాలు న‌త్త‌క‌డ‌క‌న ముందుకు కదులుతున్నాయి. అలాగే, బాటసింగారం నుంచి మజీద్‌పూర్‌ వెళ్లే దారిలోనూ వ‌ర‌ద ప్ర‌భావం అధికంగా ఉండ‌డంతో వాహ‌న‌దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Related posts

The Classic ‘Jeans & A Nice Top’ Look Is Making A Comeback

Drukpadam

జూన్ లో వీటికి ముగిసిపోతున్న గడువు.. త్వరపడండి..!

Drukpadam

గర్భస్థ శిశువుకూ హక్కులుంటాయి: హైకోర్టు..

Drukpadam

Leave a Comment