Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

హుజురాబాద్ లో మంత్రి హరీష్ రావు అరాచకాలు …బెదిరింపులు :ఈటల!

హుజురాబాద్ లో మంత్రి హరీష్ రావు అరాచకాలు …బెదిరింపులు :ఈటల!
-జాగ్రత్త బిడ్డ …భరతం పడతాం : ఈటల ఘాటు హెచ్చరిక
-టీఆర్ఎస్ లో చేరాలని బీజేపీ కార్యకర్తలను బెదిరిస్తున్నారు
-పోలీసులను రాత్రి పూట ఇళ్లకు పంపి బెదిరింపులకు పాల్పడుతున్నారు
-2023 వరకే టీఆర్ఎస్ అధికారంలో ఉంటుంది

కత్తి చేతులో ఉందని తెలంగాణ వల్లనే పొడవాలని కేసీఆర్ ,హరీష్ రావు లు చూస్తున్నారని ఇది అత్యంత దుర్మార్గమైన చర్య అని మాజీ మంత్రి బీజేపీ నేత ఈటల రాజేందర్ దుయ్యబట్టారు . హుజురాబాద్ లో గెలవలేమని తెలుసుకున్న కేసీఆర్ ఎన్నికలను వాయిదా వేయించడమే కాకుండా అనైతిక ,అక్రమాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు . వారు ఎన్ని ఎత్తులు వేసిన , అరాచకాలు సృష్టించిన హుజురాబాద్ ప్రజలు భయపడేవారు కాదని అన్నారు . కేసీఆర్ వ్యూహాలను హరీష్ రావు అమలు చేస్తున్నారని హరీష్ రావు అరాచకాలకు బెదిరింపులు ఎంతోకాలం సాగవని హెచ్చరించారు . 2023 ఎన్నికల్లో టీఆర్ యస్ అధికారంలోకి వచ్చే ప్రశ్న ఉత్పన్నం కాదని అన్నారు .

మంత్రి హరీశ్ రావు అధికారాన్ని అడ్డుపెట్టుకుని అరాచకాలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ మండిపడ్డారు. బీజేపీ కార్యకర్తలను టీఆర్ఎస్ లో చేరాలని బెదిరిస్తున్నారని… రాత్రి పూట ఇళ్లకు పోలీసులను పంపి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేధింపులు ఆపకపోతే భరతం పడతామని హెచ్చరించారు.

ప్రగతి భవన్ నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశిస్తే… హుజూరాబాద్ లో హరీశ్ రావు ఆచరిస్తున్నారని ఈటల అన్నారు. తన వెంట ఉండేవారిని టీఆర్ఎస్ లో చేరాలని బెదిరిస్తున్నారని మండిపడ్డారు. గతంలో టీఆర్ఎస్ లో చేరినవారు ఇప్పుడు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నరని చెప్పారు. వారు ఎదుర్కొంటున్న అవమానాలను చూసి టీఆర్ఎస్ లో చేరడానికి ఎవరూ ముందుకు రావడం లేదని తెలిపారు. ఈ కారణం వల్లే ఇప్పుడు పోలీసుల చేత బెదిరింపులకు పాల్పడుతున్నారని చెప్పారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కత్తి ఏపీ పాలకుల చేతిలో ఉండేదని, ఆ కత్తితో వాళ్లు తెలంగాణ వాళ్లను పొడిచేవారంటూ కేసీఆర్ చెప్పేవాడని… ఇప్పుడు కత్తి కేసీఆర్, హరీశ్ రావుల చేతిలో ఉందని, వీరిద్దరు కూడా ఆ కత్తితో మనోళ్లనే పొడుస్తున్నారని ఈటల దుయ్యబట్టారు. అధికారం ఉంది కదా అని కేసీఆర్, హరీశ్ లు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని అన్నారు. 2023 వరకే టీఆర్ఎస్ అధికారంలో ఉంటుందని.. ఆ తర్వాత వీరికి సహకరిస్తున్న అధికారుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.

Related posts

పెగాసస్’తో నిఘాపెట్టారని మేం చెప్పలేదంటున్న అమ్నెస్టీ…

Drukpadam

ఉద్యమ కేసుల ఎత్తివేతపై ముద్రగడ హర్షం: సీఎం జగన్ కు లేఖ!

Drukpadam

కుప్పం మున్సిపల్ వార్ …వైసీపీకి ప్రజాబలం లేదని లోకేష్ విమర్శలు!

Drukpadam

Leave a Comment