Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ప్రభుత్వ ఏర్పాటు వేడుకకు రావాలన్న తాలిబన్ల ఆహ్వానంపై చైనా మౌనం!

ప్రభుత్వ ఏర్పాటు వేడుకకు రావాలన్న తాలిబన్ల ఆహ్వానంపై చైనా మౌనం!
-చైనా వ్యూహం ఏమిటనేది ఆశక్తిగా ఎదురు చూస్తున్న నాటో కూటమి
-ఇప్పటికే తాలిబన్లు ఏర్పాటు చేయబోయే ప్రభుత్వానికి పాక్ మద్దతు
-చైనా తమ ఆర్థీక అభివృద్ధిలో ప్రముఖ పాత్ర వహిస్తుందన్న తాలిబన్లు
-శరణార్థులను తరలించేందుకు సిద్ధం చేసిన విమానాలను అడ్డుకున్న తాలిబన్లు
-ఆరు విమానాలను అడ్డుకున్న తాలిబన్లు
-1000 మంది కొన్ని రోజులపాటు విమానాశ్రయంలో పడిగాపులు

ఆఫ్ఘన్ లో తాలిబన్ల ప్రభుత్వం కొలువు తీరనుంది అయితే అది అంత తేలికగా ఉండేలా లేదు . తాలిబన్లు అంటేనే ఉగ్రవాదులన్న అపప్రద వారిపై ఉన్నది. ఆఫ్ఘన్ లో ప్రభుత్వాన్ని పడగొట్టి అధికారంలోకి వచ్చేందుకు పావులు కదుపుతున్న తాలిబాన్లకు ఆంతర్జాతీయ సమాజం నుంచి అనుకున్నంత మద్దతు లభించడం లేదు . అంటే కాకుండా పంజ్ షేర్ ప్రాంతంలో తాలిబన్ల కు వ్యతిరేకత ఉంది. దీంతో అక్కడ హోరా హోరి పోరాటం జరిగింది. అమెరికా సైన్యం ఆఫ్ఘన్ నుంచి వెళ్లి పోయినప్పటికీ తిరిగి వచ్చి తమను రక్షించక పోతుందా అని పంజ్ షేర్ ప్రాంతం ఆశగా ఉంది. అయితే ఇప్పట్లో అమెరికా సైన్యం తిరిగి ఆఫ్ఘన్ గడ్డపై కాలు మోపే పరిస్థితులు లేవు . అందువల్ల పంజ్ షేర్ తో పాటు ఆఫ్ఘన్ అతను లలిబన్లు చెప్పినట్లు గా వినాల్సిందే .ఇక తాలిబాన్లకు గట్టి ముద్దగా ఉన్నాడని చెప్పబడుతున్న చైనా ,పాక్ లలో చైనా తాలిబన్లు తాలిబన్ ప్రభుత్వం ఏర్పాటు సందర్భంగా జరిగే కార్యక్రమంలో పాల్గొంటుందా? లేదా ? అనే సందేహాలు ఉన్నాయి. తాలిబన్లు మంత్రం తమ దేశం ఆర్థికంగా నిలదొక్కు కోవడంలో చైనా సహాయం ఉంటుందని స్పష్టం చేశారు .

 

ఆప్ఘనిస్థాన్ నుంచి వేలాదిమంది శరణార్థులను తరలించేందుకు సిద్ధం చేసిన ఆరు విమానాలను ఇటీవల తాలిబన్లు అడ్డుకున్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. కాబూల్‌లో చిక్కుకుపోయిన అమెరికా సహా ఇతర దేశాల పౌరులు, బలగాలు, ఆఫ్ఘన్ శరణార్థులను తరలించేందుకు గత నెలలో చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా బల్ఖ్ ప్రావిన్సులోని మజార్-ఎ-షరీఫ్ నుంచి వందలాదిమంది శరణార్థులను విదేశాలకు తరలించేందుకు ఆరు విమానాలను సిద్ధం చేశారు.

అయితే, ఆ విమానాలు వెళ్లకుండా తాలిబన్లు అడ్డుకున్నారని అధికారి ఒకరు తెలిపారు. దీంతో దాదాపు 1000 మంది కొన్ని రోజులు విమానాశ్రయంలోనే గడిపిన అనంతరం మరో మార్గం లేక వారంతా వెనక్కి వెళ్లిపోయారని పేర్కొన్నారు. శరణార్థుల విమానాలకు ఇంకా అనుమతి రాలేదని కూడా ఆయన వివరించారు.

ఇదిలావుంచితే, నూతన ప్రభుత్వ ఏర్పాటుకు హాజరు కావాల్సిందిగా తాలిబన్ల నుంచి వచ్చిన ఆహ్వానంపై చైనా ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. ఈ విషయమై అడిగిన ప్రశ్నకు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్‌ స్పందిస్తూ.. ఈ విషయంపై తన వద్ద ప్రస్తుతం ఎలాంటి సమాచారం లేదని బదులిచ్చారు.

Related posts

సాయుధ పోరాటం చేసింది కమ్యూనిస్టులే: బీజేపీ కి తెలంగాణ విమోచన గురించి మాట్లాడే హక్కులేదు …కేటీఆర్!

Drukpadam

పెగాసస్ ఫోన్ హ్యాకింగ్ కుంభకోణంపై విచారణ కమిటీ వేసిన మమతా బెనర్జీ!

Drukpadam

న్యూయార్క్ లో దిగిన తైవాన్ అధ్యక్షురాలు.. చైనా హెచ్చరికలు!

Drukpadam

Leave a Comment