Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

వామ్మో టిఫిన్ హోటల్ కు రూ.21 కోట్ల కరెంటు

వామ్మో టిఫిన్ హోటల్ కు రూ.21 కోట్ల కరెంటు… బిల్లు…లబోదిబోమన్న యజమాని
-అధికారులకు ఫిర్యాదు చేసిన మహిళ
-రీడింగ్ తీయటంలో పొరపాటు జరిగిందన్న అధికారులు
-బిల్లు సరిచేసి సిబ్బంది
-ఏపీ లోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఘటన
-మీటర్ రీడింగ్ ఉద్యోగిని, ఏఈని సస్పెండ్ చేసిన వైనం

వామ్మో ఒక చిన్న టిఫిన్ హోటల్ కు వచ్చిన కరెంటు బిల్ అక్షరాల 21 కోట్లు … ఇది నమ్మ శక్యం కాకపోయినా నిజం …. ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లాలోని చింతలపూడి లో తన చిన్న టిఫిన్ హోటల్ కు వచ్చిన కరెంటు బిల్లు ను చూసి హోటల్ యజమానురాలైన మహిళ షాక్ కు గురైంది. లబోదిబో మంటు కరెంటు ఆఫీస్ కు పరుగులు తీసింది. ఆమె కు వచ్చిన 21 కోట్ల బిల్లును చూసి అధికారులు సైతం ఆశ్చర్యానికి గురిఅయ్యారు . బిల్లు సాంకేతిక సమస్యవల్ల పొరపాటుగా వచ్చిందని దాన్ని సరిచేస్తామని హామీ ఇచ్చారు . దీంతోఆమె ఊపిరి పీల్చుకుంది.

సాధారణంగా చిన్నా చితకా హోటళ్లకు, నివాస గృహాలకు ఓ వెయ్యిలోపు కరెంటు బిల్లులు వస్తుంటాయి. మహా అయితే ఇంకో ఐదు వందలు ఎక్కువ వస్తుందేమో! కానీ పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో ఓ టిఫిన్ హోటల్ కు వచ్చిన కరెంటు బిల్లు ఎంతో తెలిస్తే దిగ్భ్రాంతికి గురవుతారు. ఆ కరెంటు బిల్లు చూసిన టిఫిన్ హోటల్ నిర్వాహకురాలి పరిస్థితి కూడా అదే. సెప్టెంబరు మాసానికి రూ.21 కోట్ల మేర బిల్లు వేశారు. దాంతో ఆమె లబోదిబోమన్నారు.

వెంటనే ఈ సంగతి విద్యుత్ శాఖ అధికారులకు నివేదించడంతో వారు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఆమె బిల్లును సరిచేసి కొత్త బిల్లు అందించేందుకు చర్యలు చేపట్టారు. అధికారులు భరోసా ఇచ్చిన తర్వాత గానీ ఆమె కుదుటపడలేదు.

ఈ బిల్లు తీయడంలో నిర్లక్ష్యం వహించాడంటూ చింతలపూడి మీటర్ రీడింగ్ ఉద్యోగి ప్రభాకర్ తో పాటు ఆ ప్రాంత ఏఈపైనా విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. సాంకేతికలోపం కారణంగానే ఇలాంటి బిల్లులు వస్తుంటాయని అధికారులు వివరించారు.

Related posts

తన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడం పట్ల సాయిపల్లవి స్పందన!

Drukpadam

నైజీరియాలో ఘోర పడవ ప్రమాదం.. 60 మంది జలసమాధి…

Drukpadam

జర్నలిస్టు కుటుంబాలకు అండగా ఉంటాం..బుర్ర సంపత్ కుమార్

Drukpadam

Leave a Comment