Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

హాలియా సభలో కాంగ్రెస్ , బీజేపీలపై మండిపడ్డ కేసీఆర్

హాలియా సభలో కాంగ్రెస్ , బీజేపీలపై మండిపడ్డ కేసీఆర్.
-తొక్కి పడేస్తా ,తాటతీస్తా , నసి అయిపోతారు
-రాష్ట్రాన్ని నాశనం చేసింది కాంగ్రెస్ కాదా ?
-కొత్త బిచ్చగాడు వచ్చాడు ఏదోదో మాట్లాడుతున్నారు.
-రైతు బందు తీసుకుంటూ మాట్లాడుతున్న కాంగ్రెస్ వాళ్లకు సిగ్గు ఉండాలి
-నల్లగొండ జిల్లాలో స్థానిక సంస్థలకు 186 కోట్లు
నాగార్జున సాగర్ ఉపఎన్నికల వేడి రాజుకుంది. ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ హాలియా లో సభ పెట్టారు . ఈ సభకు జిల్లాలోని నలుమూలలనుంచి భారీజన సమీకరణ చేశారు. ఈసందర్బంగా జిల్లాకు ప్రత్యేకించి సాగర్ నియోజకవర్గానికి కేసీఆర్ వరాల జల్లులు కురిపించారు. సభలో కొందరు నినాదాలు చేయటంతో వారిపై కస్సుబుస్సు లాడిన కేసీఆర్ ఉన్నట్టుఉండి కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై విరుచుకు పడ్డారు. ఎవరు వాళ్ళు, వాళ్ళ దగ్గర కాగితాలు తీసుకొని బయటకు పంపించండి . కాగితాలు ఇచ్చి ఇష్టం లేక పొతే బయటకు వెళ్ళండి … ఎవరయ్యా అక్కడ, పోలీసులు వారిని బయటకు పంపండి. అంటూ హూంకరించారు. పిచ్చి, పిచ్చి వేషాలు వేస్తె తాటతీస్తా …. మేము తలుచుకుంటే నశం మిగలదు …. దుమ్ము దుమ్ము అయిపోతారు…. లఫంగి మాటలు మాట్లాడవద్దు …. మీలాంటి కుక్కలు చాల ఉన్నాయి…. డ్రామాలు పనిచేయవు…. కాంగ్రెస్ నాయకులు అవాకులు చవాకులు పేలుతున్నారు…. సీఎల్పీ నేత ఆదిలాబాద్ పర్యటనలో పొలంబాట …పోరుబాట అంటున్నాడు … ఏమైంది పొలానికి …. నీ బొంద బాట అంటూ నిప్పులు చెరిగారు…. కమిషన్లకోసం ప్రాజెక్టులు కట్టినమంటూ విమర్శలు చేస్తున్నారు. నాగార్జున సాగర్ కమిషన్ల కోసమే కట్టారా ? కళ్ళు మండి ఈర్ష తో విమర్శలు చేస్తున్నారు. నల్లగొండ లో మీవల్ల ఫ్లోరైడ్ భూతంతో లక్ష 50 జీవితాలు నాశనం కాలేదా ? అని ప్రశ్నించారు. కొత్త బిక్షగాడు వచ్చాడు . ఏదేదో మాట్లుడు తున్నాడు . ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి అని బీజేపీ వాళ్ళను సైతం ఆయన వదల్లేదు … రకాసులతో కొట్లాడినం గోకాసులు ఒక లెక్కకాదన్నారు. మాకు మాట్లాడటం వస్తది మేము మాట్లాడితే మీరు తట్టుకోలేరు. అని హెచ్చరించారు. నల్లగొండ జిల్లా ప్రజలు చాల చైతన్యవంతులు రానున్న ఎన్నికల్లో న్యాయమైన తీర్పు ఇవ్వండి. తెలంగాణ దుస్థితికి కాంగ్రెస్ కారణం కాదా ? హైద్రాబాద్ ను మూడు ముక్కలు చేసింది కాంగ్రెస్ కాదా ? నల్లగొండ జిల్లా వెనక బడటానికి కాంగ్రెస్ కాదా అని కాంగ్రెస్ విధానాలను తూర్పారబట్టారు. టీఆర్ యస్ పార్టీ వీరుల పార్టీ …. వీపు చూపించే పార్టీ కాదని అన్నారు. మేము చెప్పినవి చేసినం అనుకుంటే ఓట్లు వేసి గెలిపించండి . లేక పొతే ఓడించండి అని కేసీఆర్ ప్రజలకు పిలుపు నిచ్చారు .

నల్లగొండ కు సీఎం వరాలు
సభలో సీఎం కేసీఆర్ నల్లగొండ జిల్లాకు వరాలు ప్రకటించారు. మొత్తం జిల్లాలో 844 గ్రామపంచాయతీలు ఉండగా ఒక్కొక్క పంచాయతీకి 20 లక్షల చొప్పున నిధులు ఇస్తున్నట్లు ప్రకటించారు. అదే విధంగా ఒక్కొక్క మండలానికి 30 లక్షలు , నల్లగొండ మున్సిపాలిటీకి 10 కోట్లు , మిర్యాలగూడ మున్సిపాలిటీ కి 5 కోట్లు , జిల్లాలోని మిగితా మున్సిపాల్టీ లకు కోటి రూపాయల చొప్పున కేటాయిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. రేపే దీనిపై జి .ఓ విడుదల చేయనున్నట్లు తెలిపారు. కొత్తగా పెన్షన్లు , రేషన్ కార్డులు మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రానికి కే ఎల్ రావు అనే ఇంజనీర్ అన్యాయం చేశారని ఇంకో 19 కిలోమీటర్ల అవతల నిర్మించాల్సిన నాగార్జున సాగర్ ప్రాజక్టును ఇప్పుడు ఉన్న దగ్గర నిర్మించినట్లు చెప్పారు . అందువల్ల తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందన్నారు. సభకు జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి అధ్యక్షత వహించారు. సభలో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు , ఎంపీ లు , ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Related posts

ఒక్కొక్కరు మూడు పెళ్లిళ్లు చేసుకోవాలా?: సీఎం జగన్

Drukpadam

నాదే సీటు …కందాల……పోటీ ఖాయం తుమ్మల …పొత్తులో మాదే…తమ్మినేని …

Ram Narayana

పొంగులేటి …జూపల్లి కాంగ్రెస్ కు జై !…15 సీట్లు ఇచ్చే అవకాశం …?

Drukpadam

Leave a Comment