Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఈ నెల 21 న ఖమ్మం నేతలతో షర్మిల సమావేశం

ముందుగా అనుకున్నట్లు ఈనెల 20 న జరగాల్సిన ఖమ్మంజిల్లా. సమావేశాన్ని ఈ నెల 21 కి మార్చారు ఆరోజు ఖమ్మం నేతలతో షర్మిల సమావేశం అవుతారని తెలుస్తుంది.
-వైసిపి నేతలు హాజరు అవుతారా ?
-ఎవరెవరు హాజరవుతారని ఇంటలిజన్స్ ఆరా !
తెలంగాణాలో హాట్ టాపిక్ గా ఉన్న వైయస్ షర్మిల పార్టీ ఏర్పాట్ల ప్రక్రియ లో జిల్లాల నేతలతో సమావేశాలు కొనసాగింపులో భాగంగా ఈ నెల 21 ఖమ్మం నేతలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి ఎవరెవరు హాజరవుతారు అనేది చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఇంటలిజెన్స్ వర్గాలు ఆరాతీస్తున్నాయి . వైకాపా ఖమ్మం జిల్లా అధ్యక్షుడుగా ఉన్న లక్కినేని నరేందర్ వెళతారా లేదా అనేది చూడాల్సిఉంది . ప్రత్యేకంగా కాస్త జనబలం ఉన్న నాయకులూ ఎవరు లేకపోవటం తో షర్మిల పార్టీని జిల్లా నుంచి ఎవరు ఒన్ చేసుకుంటారు . అనేది ఆశక్తిగా మారింది. షర్మిల మాత్రం పొంగులేటి పై ఆశలు పెట్టుకొని ఆయన కోసం ప్రయత్నాలు చేశారు. ఆయన ప్రస్తుతం అధికార టీఆర్ యస్ లో ఉన్నారు. అందువలన ఆయనకు షర్మిల ఫోన్ చేసిన ఆయన నుంచి సమాధానం లేకపోవటం తో ప్రత్యాన్మాయం కోసం సూస్తున్నట్లు తెలుస్తుంది . తెలంగాణ ఏర్పడిన తరువాత ఖమ్మం జిల్లానే వైకాపాకు బలమైన పార్టీగా ఉంది .అప్పట్లో ఖమ్మం ఎంపీ తో పాటు ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో వైరా నుంచి మదన్ లాల్ , అశ్వారావు పేట నుంచి తాటి వెంకటేశ్వర్లు , పినపాక నుంచి పాయం వేంకటేశ్వర్లు , ఉన్నారు . ఆతరువాత రాష్ట్ర విడిపోవటం ఎమ్మెల్యేలు ఎంపీ అందరు ఒకరి తరువాత ఒకరు అధికార టీఆర్ యస్ లో చేరారు. వారిలో మదన్ లాల్ కు తిరిగి కేసీఆర్ అసెంబ్లీ టికెట్ ఇవ్వలేదు. పాయం, తాటి లకు ఇచ్చిన వారు ఓడిపోయారు. వైసిపి నుంచి గెలిచినా ముగ్గురు ఎమ్మెల్యేలు ప్రస్తుతం మాజీలుగానే ఉన్నారు. కానీ వారు ఇప్పటికిప్పుడు షర్మిల పార్టీలో చేరినందుకు ఆశక్తి చూపటం లేదు . ఎంపీ పొంగులేటి తిరిగి టికెట్ ఇవ్వకపోవటం తో ఆయన అనుయాయులు తీవ్ర అసహనం తో ఉన్నారు. అయనప్పటికీ ఆయన కేటీఆర్ ను నమ్ముకొని పార్టీలో కొనసాగుతున్నారు. అందువల్ల ఇప్పుడు షర్మిల నావను జిల్లాలో మోసేదెవరు అనేది చూడాల్సిందే !

Related posts

న్యాయ విచార‌ణ జ‌రిపించాలి: ఏపీ సీఎస్‌కు చంద్ర‌బాబు లేఖ‌

Drukpadam

మూడు రాజధానుల ఏర్పాటు ఖాయం: తేల్చిచెప్పిన సజ్జల

Drukpadam

తమను ఆదరించిన ప్రజలకు కృతజ్ఞతలు ….బెంగాల్ సీఎం మమతాబెనర్జీ …

Drukpadam

Leave a Comment