Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

ఫుజియాన్ ప్రావిన్స్‌లో కొత్తగా 19 కరోనా కేసులు.. నగరం మొత్తాన్ని మూసేసిన చైనా!

ఫుజియాన్ ప్రావిన్స్‌లో కొత్తగా 19 కరోనా కేసులు.. నగరం మొత్తాన్ని మూసేసిన చైనా!
-కేసులు వెలుగుచూడగానే కట్టుదిట్టమైన చర్యలు
-రైళ్లు, బస్సులు సహా సమస్తం మూసివేత
-బయటి వారు లోపలికి, నగరంలోని వారు బయటకు వెళ్లకుండా చర్యలు

కరోనా మహమ్మారి ఇంకా ప్రజలను భయపెడుతూనే ఉంది. వ్యాక్సిన్ వేయించుకున్న దాని భారిన పడేవారిసంఖ్య అధికంగానే ఉంటుంది. కొంతకాలం క్రితం మాస్క్ లు సైతం వద్దని చెప్పిన అగ్రరాజ్యం అమెరికా సైతం తిరిగి మాస్క్ లను తప్పనిసరి చేసింది. చైనాలో కరోనా వైరస్ పుట్టిందని అదికూడా వుహాన్ నగరంలో పుట్టిందని చెపుతున్న సందర్భంలో అక్కడ కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. వుహాన్ నగరం కుదట పడ్డతరువాత అక్కడక్కడా కేసులు బయటపడటంతో దాదాపు చైనాను దిగ్బంధనం చేశారు. ఇప్పుడు ఫుజియాన్ ప్రావిన్స్‌లో కేసులు బయట పడ్డాయని తేలడంతో అక్కడ కూడా చైనా హెల్త్ మిషన్ అప్రమత్తమైంది. వైద్యపరంగా తీసుకోవాల్సిన చర్యలను తీసుకుంటూనే నగరాన్ని అష్టదిగ్బంధనం చేసింది. …

కరోనా వైరస్ విషయంలో చైనా ఎంత అప్రమత్తంగా ఉంటుందో చెప్పేందుకు ఇది ఉదాహరణ. ఫుజియాన్ ప్రావిన్స్‌లో తాజాగా 19 కరోనా కేసులు బయటపడడంతో ఏకంగా నగరం మొత్తాన్ని మూసేసింది. బస్సులు, రైళ్లు, సినిమా హాళ్లు, పర్యాటక ప్రదేశాలు, బార్లు, జిమ్‌లు ఇలా ప్రతి ఒక్కదానిని మూసేశారు. స్థానికులు ఎవరూ బయటకు వెళ్లకుండా, బయటి వారు ఎవరూ నగరంలోకి రాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఇక, తప్పనిసరి పరిస్థితుల్లో ఎవరైనా బయటకు వెళ్లాల్సి వస్తే గత 48 గంటల్లో చేయించుకున్న కరోనా నెగటివ్ రిపోర్టును చూపించాల్సి ఉంటుంది.

నిజానికి చైనా గతేడాదే కరోనా వైరస్‌ను కట్టడి చేసింది. అయితే, డెల్టా వేరియంట్ కారణంగా అక్కడక్కడ కొత్త కేసులు వెలుగుచూస్తూనే ఉన్నాయి. రష్యా, మయన్మార్ నుంచి వస్తున్న వారిలోనే కొత్త కేసులు వెలుగుచూస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఫుజియాన్‌లో కొత్త కేసులు వెలుగుచూసిన వెంటనే అప్రమత్తమైన చైనా నేషనల్ హెల్త్ కమిషన్ ఓ బృందాన్ని ఫుజియాన్‌కు పంపింది.

Related posts

దేశంలో కరోనా ఫోర్త్ వేవ్ భయాలు ….

Drukpadam

చైనాలో కరోనా ప్రళయం.. ఒకే రోజు 3.7 కోట్ల మందికి వైరస్!

Drukpadam

కొవిడ్ సోకినవారికే ఆనందయ్య మందు… ఎమ్మెల్యే కాకాని వివరణ…

Drukpadam

Leave a Comment