Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రీడా వార్తలు

టీం ఇండియా కు ఇద్దరు కెప్టెన్లు కోహ్లీ, రోహిత్ శర్మ?

టీం ఇండియా కు ఇద్దరు కెప్టెన్లు కోహ్లీ, రోహిత్ శర్మ?
టీ20 ప్రపంచ కప్ తర్వాత కెప్టెన్ గా రోహిత్ శర్మ కు బాధ్యతలు
కోహ్లీపై ఒత్తిడి తగ్గించేందుకు బీసీసీఐ నిర్ణయం
టెస్టు జట్టులో చోటుచేసుకోనున్న భారీ మార్పులు

టీమిండియాలో కీలక మార్పులు జరగనున్నట్టు తెలుస్తోంది. టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీ తప్పుకోనున్నట్టు సమాచారం. ఆయన స్థానంలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ నాయకత్వ పగ్గాలు చేపట్టబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు యూఏఈ వేదికగా ఐపీఎల్ జరగబోతోంది. దీని తర్వాత టీ20 ప్రపంచకప్ జరగనుంది.

ఇక టీ20 వరల్డ్ కప్ తర్వాత టెస్ట్ ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి కోహ్లీ తప్పుకోనున్నట్టు సమాచారం. ప్రస్తుతం మూడు ఫార్మాట్లకు కోహ్లీనే కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ భారం కోహ్లీ ఆటతీరుపై పడుతోంది. దీంతో, ఒక ఫార్మాట్ నుంచి కోహ్లీకి ఒత్తిడి తగ్గించేందుకు బీసీసీఐ రెడీ అవుతోంది. కోహ్లీని మళ్లీ మునుపటి ఫామ్ లోకి తీసుకొచ్చేందుకు బీసీసీఐ అడుగులు వేస్తోంది. రానున్న రోజుల్లో టెస్ట్ జట్టులో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి.

అయితే రోహిత్ శర్మ ను టెస్ట్ కెప్టెన్ గా నా లేక టి 20 ,వన్డే జట్టుకు ఎంపిక చేస్తారా ? అనే సందేహాలు ఉన్నాయి. కోహ్లీ బ్యాటింగ్ పై ద్రుష్టి సారించడం కోసమే ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి కోహ్లీ కూడా ఆమోదం తెలిపారని సమాచారం . రోహిత్ కు పొట్టి పార్మెట్లలో మంచి అనుభవం ఉంది. ఐ పి ఎల్ లో 5 సార్లు ముంబాయ్ ఇండియన్స్ కప్ గెలవడంతో రోహిత్ ఏంటో మ్యాచుర్డ్ గా వ్యవహరించారని అందువల్ల ఆయనకు ఆవకాశం ఇవ్వాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఇప్పటికే టీం మెంటర్ గా మంచి అనుభవం ఉన్న మాజీ కెప్టెన్ దోనికి అవకాశం ఇచ్చారు. బీసీసీఐ నిర్ణయాన్ని కొంతమందిని తప్పు పట్టినప్పటికీ అది ఎంతో ఆలోచన చేసి తీసుకున్న నిర్ణయమని బీసీసీఐ చైర్మన్ గంగూలీ పేర్కొన్నారు.

Related posts

కోహ్లీ సెంచరీ మిస్సయినా… టోర్నీలో కివీస్ కు తొలి ఓటమి రుచిచూపిన టీమిండియా

Ram Narayana

దంచి కొట్టిన యువజట్టు… తొలి వన్డేలో శ్రీలంకపై టీమిండియా గెలుపు…

Drukpadam

ఐపీఎల్ నిలిచిపోవడంతో ఎటూ పాలుపోని స్థితిలో ఆస్ట్రేలియన్లు!

Drukpadam

Leave a Comment