Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కేసీఆర్ సమీక్ష సమావేశానికి హాజరవుతున్నా: భట్టి విక్రమార్క!

కేసీఆర్ సమీక్ష సమావేశానికి హాజరవుతున్నా: భట్టి విక్రమార్క!
-దళితబంధు పథకంపై కేసీఆర్ అధ్యక్షతన సమావేశం
-మల్లు భట్టి విక్రమార్కకు అందిన ఆహ్వానం
-కాంగ్రెస్ డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచుతానన్న మల్లు

దళిత బందు పథకం అములపై ముఖ్యమంత్రి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి తాను హాజరౌతున్నట్లు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. తన సొంత నియోజకవర్గంలోని మధిరలో చింతకాని మండలంలో దీన్ని అమలు చేసేందుకు నిర్ణయించుకున్నందున తప్పకుండ హాజరు కావాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి వెళ్లాలా వద్ద అనే సందేహాల నడుమ సోమవారం భట్టి నివాసంలో జరిగిన కాంగ్రెస్ ముఖ్యనేతల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తరుపున వెళ్లకపోతే తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని సమావేశంలో పాల్గొన్న నాయకులూ అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ ,కోమటి రెడ్డి బ్రదర్స్ , ఉత్తమకుమార్ రెడ్డి , శ్రీధర్ బాబు ,పొదెం వీరయ్య , తదితరులు పాల్గొన్నారు.

దళితబంధు పైలట్ ప్రాజెక్టు అమలుపై ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న సమావేశానికి తాను హాజరవుతున్నట్టు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలోని నాలుగు మండలాల్లో ప్రాజెక్టు అమలుపై ఈ సమావేశంలో చర్చించనున్నారని… మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం కూడా ఇందులో ఉందని… ఈ నేపథ్యంలో స్థానిక శాసనసభ్యుడినైన తనకు ఆహ్వానం అందిందని.. అందుకే సమావేశానికి తాను హాజరవుతానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తరపు డిమాండ్లను ఈ సమావేశంలో ప్రభుత్వం ముందు ఉంచుతానని అన్నారు.

ఈ అంశంపై ఈ ఉదయం నుంచి తమ పార్టీ నేతలతో చర్చించానని… సీఎం సమీక్ష సమావేశంలో ఏయే అంశాలను ప్రస్తావించాలనే దానిపై తమ నేతల నుంచి సలహాలను తీసుకున్నానని భట్టి విక్రమార్క తెలిపారు. ఈరోజు ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశానికి కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మధు యాష్కీ, శ్రీధర్ బాబు, పొదెం వీరయ్య, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

Related posts

విదేశాల్లో మోదీకి ఉన్న ఇమేజ్ ను దెబ్బతీయాలని అనుకోలేదు: రాకేశ్ టికాయత్!

Drukpadam

గుడివాడలో కేసినో గొడవ …టీడీపీ వర్సెస్ వైసీపీ!

Drukpadam

బెంగాల్ సీఎస్ కు కేంద్రం షోకాజ్ నోటీసు! 

Drukpadam

Leave a Comment