Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

వికీపీడియాకు కేంద్రం నోటీసులు… ఎందుకంటే?

  • సమాచారంలో పక్షపాత ధోరణి, తప్పుడు సమాచారం ఉంటోందన్న కేంద్రం
  • కచ్చితత్వంలేని సమాచారం ఉంటోందని పలువురి నుంచి ఫిర్యాదులు
  • మధ్యవర్తిగా కాకుండా పబ్లిషర్‌గా ఎందుకు పరిగణించకూడదని కేంద్రం ప్రశ్న

వికీపీడియాలో లభించే సమాచారంలో పక్షపాత ధోరణి, తప్పుడు సమాచారం ఉంటోందన్న ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. వికిపీడియాలో వివిధ అంశాలకు సంబంధించి పక్షపాత ధోరణి కనిపిస్తోందని, కచ్చితత్వంలేని సమాచారం ఉంటోందని పలువురి నుంచి ఫిర్యాదులు అందాయి. దీంతో వికీపీడియాకు కేంద్రం నోటీసులు పంపించింది.

చిన్న సంపాదకులకు, సంస్థలకు కూడా కంటెంట్‌పై ఎడిటోరియల్ నియంత్రణ ఉంటుందని… కానీ వికీపీడియాకు ఆ వ్యవస్థ ఎందుకు లేదని కేంద్రం ప్రశ్నించింది. వికీపీడియాను మధ్యవర్తిగా కాకుండా… పబ్లిషర్‌గా ఎందుకు పరిగణించకూడదని ప్రశ్నించింది. కొంతమంది వ్యక్తులతో కూడిన బృందానికి మాత్రమే ఈ పేజీల్లోని సమాచారంపై నియంత్రణ ఉందనే అభిప్రాయం ప్రజల్లో ఉందని పేర్కొంది.

ప్రజలకు అందించే సమాచారంలో తమను ప్రచురణకర్తలుగా కాకుండా మధ్యవర్తులుగా చూడాలని వికీపీడియా చెబుతుండగా… కేంద్రం మాత్రం ప్రచురణకర్తగా ఎందుకు చూడవద్దని ప్రశ్నించింది. ఈ నోటీసులకు వికిపీడియా స్పందించిన తర్వాత కేంద్రం తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

Related posts

2 వేల నోటు మార్పిడికి గడువు మరో 5 రోజులే..!

Ram Narayana

చిన్ననాటి రోజులను గుర్తు చేసుకుని కన్నీటిపర్యంతమైన ప్రధాని మోదీ

Ram Narayana

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల దుశ్చర్య.. ఆర్మీ వాహనంపై దాడి!

Ram Narayana

Leave a Comment