Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలురాజకీయ వార్తలు

సోను సూద్ పై ఐటీ దాడులు….

సోను సూద్ పై ఐటీ దాడులు….
ఆదాయపు పన్ను ఎగ్గొట్టారనే ఆరోపణలు
ముంబై, లక్నోలలో ఆరు చోట్ల సోదాలు
ఇటీవలే కేజ్రీవాల్ ను కలిసిన సోను

సోను సూద్ తప్పుడు దేశవ్యాపితంగా మారుమోగుతున్న పేరు…. పేదలకు ,ఆపన్నులకు ఆపద్బాంధవుడిలా పేరు తెచ్చుకున్న సోను సూద్ ఇటీవల ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో సమావేశం అయ్యారు. ఢిల్లీ ప్రభుత్వం విద్యార్థుల కోసం ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న ‘దేశ్ కా మెంటార్’ పథకానికి బ్రాండ్ అంబాసడర్ గా సోను సూద్ ను ఆ సమావేశంలో కేజ్రీవాల్ ప్రకటించారు. దీంతో ఆయనపై దాడులు జరుగుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ప్రముఖ సినీ నటుడు సోను సూద్ పై ఐటీ శాఖ దృష్టి సారించింది. ఆదాయపు పన్నును ఎగ్గొట్టారనే కారణాలతో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ముంబై, లక్నోల్లోని దాదాపు ఆరు ప్రాంతాల్లో ఈ సోదాలు జరిగాయి. ముంబైలోని ఆయన నివాసంలో కూడా సోదాలు జరిగినట్టు సమాచారం. సోను సూద్ కంపెనీకి, లక్నోలోని ఓ రియలెస్టేట్ సంస్థకు మధ్య ఇటీవల ఒక డీల్ జరిగింది. ఈ డీల్ అంశంలో ఆదాయపు పన్నును ఎగ్గొట్టారని ఐటీ శాఖ చెపుతోంది.

మరోవైపు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో సోను సూద్ హైప్రొఫైల్ మీటింగ్ జరిగిన రోజుల వ్యవధిలోనే ఐటీ సోదాలు జరగడం గమనార్హం. ఢిల్లీ ప్రభుత్వం విద్యార్థుల కోసం ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న ‘దేశ్ కా మెంటార్’ పథకానికి బ్రాండ్ అంబాసడర్ గా సోను సూద్ ను ఆ సమావేశంలో కేజ్రీవాల్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీలోకి సోను చేరుతున్నారనే ప్రచారం జరిగింది. అయితే, తనకు అలాంటి ఆలోచన లేదని ఆ తర్వాత సోను వివరణ ఇచ్చారు. 48 ఏళ్ల సోను సూద్ కరోనా కష్ట సమయంలో ఎంతో మంది పాలిట ఆపద్బాంధవుడిగా నిలిచారు. ఎంతో మందికి ఎన్నో విధాలుగా సాయాన్ని అందస్తూ రియల్ హీరో అనిపించుకున్నారు. సోనుకు చెందిన ప్రాంతాలపై ఐటీ దాడులు జరిగాయనే వార్తలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

Related posts

ఎవడ్రా రాయలసీమ ద్రోహి…?: కర్నూలులో చంద్రబాబు ఉగ్రరూపం!

Drukpadam

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు …ఓటు వేయని నల్లారి , చిరంజీవి !

Drukpadam

సీఎంఆర్ఎఫ్ చెక్కుల దుర్వినియోగం కేసులో ఓ వ్యక్తి అరెస్ట్

Ram Narayana

Leave a Comment