Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

మావోల కోసం ఎ ఓ బి లో కొనసాగుతున్న వేట …

మావోల కోసం ఎ ఓ బి లో కొనసాగుతున్న వేట…
ఎఓబి లో ఎదురు కాల్పులు …మావోల శిభిరాన్ని ధ్వంసం చేసిన భద్రతా దళాలు
పెద్ద ఎత్తున మందుగుండు సామాగ్రి స్వాధీనం
తప్పించుకున్న మావోలు …గాలిస్తున్న పోలీసులు
తప్పించుకున్న వారిలో ఏవోబీ ప్ర‌త్యేక జోన‌ల్ క‌మిటీ స‌బ్యుడు జాంబ్రి
మీడియా తో.మల్కన్ గిరి ఎస్పీ ప్రహల్లాద్ మీనా

చింతూరు …

ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో మావులకోసమే పోలిసుల వేట కొసాగుతుంది. మావోల కదలికలు పెరిగిన నేపథ్యంలో ఎప్పుడు ఎలాంటి యాక్షన్ జరుపుతారోనని భద్రతాదళాలు కూడా కూంబింగ్ ప్రారంభించాయి., గతంలో తగిలిన ఎదురు దెబ్బలను దృష్టిలో పెట్టుకొని అంత్యంత పకడ్బందీ వ్యూహంలో వేట కొనసాగిస్తున్నారు. ఈ నెల 21 నుంచి మావో ల 17 వార్షికోత్సవాలు పెద్ద ఎత్తున జరిపేందుకు పిలుపునివ్వడంతో పోలీసులు కూడా తగని ఏర్పాట్లతో అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు.

ఆంద్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్ప‌లులో భద్రతా దళాలు మావోయిస్టుల శిబిరాన్ని ద్వంసం చేసి, పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

మల్కన్ గిరి ఎస్పీ ప్రహల్లాద్ మీనా తెలిపిన వివ‌రాలు ప్ర‌కారం

మల్కన్ గిరి మరియు కోరాపుట్ జిల్లాల సరిహద్దులోని బడిలి కొండపై ఒక పెద్ద మావోయిస్టు శిబిరం ఉన్నట్లు నిఘా వర్గాలు తెలిపిన తరువాత, ఎస్‌వోజీ, డీవీఎఫ్‌ మరియు సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది ఆ ప్రాంతంలో గాలింపు నిర్వ‌హించామ‌ని బుధ‌వారం బాగా పొద్దుపోయాక గాలింపు బ‌ల‌గాలు మావోయిస్టులు నిర్వ‌హిస్తున్న శిభిరానికి చేరుకోగానే
మావోయిస్టులు వారిపై కాల్పులు జరిపారు.

దీంతో పోలీసులు ప్ర‌తిగా కాల్పులు జ‌రిపారు. సుమారు రెండు గంటల పాటు మావోయిస్టుల‌కు పోలీసుల‌కు మ‌ద్య ఎదురుకాల్పులు జరిగాయని ఎస్పీ తెలిపారు. మావోయిస్టులు కాల్పులు జ‌రుపుకుంటూ శిభిరం నుంచి త‌ప్పించుకున్నారు.

ఈ ఎదురుకాల్పులు నుంచి ఏవోబీ ప్ర‌త్యేక జోన‌ల్ క‌మిటీ స‌బ్యుడు జాంబ్రి పోలీసులు తెలిపారు. ఆంద్రా-ఒడిశా స‌రిహ‌ద్దుల్లో త‌ప్పించుకున్న మావోయిస్టులు కోసం ఉమ్మ‌డి గాలింపు నిర్వ‌హిస్తున్న‌ట్లు మ‌ల్క‌న్‌గిరి జిల్లా ఎస్పీ తెలిపారు.

మావోయిస్టులు శిబిరం నుంచి ఒక తుపాకీ, 6 లైవ్ కాట్రిడ్జ్‌లు, 4 డిటోనేటర్లు, 2 వాకీ-టాకీ, 11 నక్సల్ కిట్లు, యూనిఫామ్‌లు మరియు పోస్టర్‌లను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి

Related posts

క‌డ‌ప ఎంపీ టికెట్ ష‌ర్మిల లేక విజ‌య‌మ్మ‌కు ఇవ్వాల‌ని వివేకా కోరారు:ప్ర‌తాప్ రెడ్డి

Drukpadam

సుక్మా-బిజాపూర్ అటవీప్రాంతంలో రక్తసిక్తం

Drukpadam

వివేకా హత్యలో సంచలన విషయాలు … 40 కోట్ల డీల్ …ప్రధాన నిందితుడు ఎర్రం గంగి రెడ్డి!

Drukpadam

Leave a Comment