Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

కొత్తగూడెంలో దారుణం: తనను తిట్టాడని చెవి, మర్మాంగాన్ని కోసేసిన వ్యక్తి!

కొత్తగూడెంలో దారుణం: తనను తిట్టాడని చెవి, మర్మాంగాన్ని కోసేసిన వ్యక్తి!
-మద్యం మత్తులో బాధితుడు తిట్టడంతో ఘర్షణ
-డయల్ 100కు ఫోన్ చేసి విషయం చెప్పిన నిందితుడు
-చావుబతుకుల్లో బాధితుడు
-కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్న పోలీసులు

చిన్న తగాదా ప్రాణాల ఒక వ్యక్తి మీదకు తెచ్చింది…. ఇద్దరి మధ్య చోటు చేసుకున్న ఘర్షణ చివరికి చెవి మర్మంగాన్ని కోసిన అత్యంత పాశవికమైన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకున్నది .మద్యం మత్తులో జరిగిన ఈ సంఘటన మానవ మృగం మాదిరిగా వ్యవహరించిన తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధితున్ని చికిత్స నిమితం ఖమ్మం ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇది కొత్తగూడం పట్టణంలో సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే ……

తనను తిట్టడంతో తట్టుకోలేకపోయిన ఓ వ్యక్తి ప్రత్యర్థి చెవి, మర్మాంగాన్ని కోసేశాడు. ఆపై పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉంది. భద్రాద్రి కొత్తగూడెంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. పొలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన రుద్రారపు కార్తీక్ తోపుడు బండిపై చిల్లర సామాన్లు విక్రయిస్తుంటాడు. ఐదు రోజుల క్రితం కొత్తగూడెం రుద్రంపూర్ ప్రాంతానికి వలస వచ్చి స్థానికంగా శిథిలమైన ఓ భవనంలో ఉంటున్నాడు. ఈ నేపథ్యంలోనే బాగా తాగివచ్చిన హుస్సేన్ పాషా మధ్య గొడవ దారుణానికి దారితీసింది .

అదే ప్రాంతంలో నివసిస్తున్న కూలీ హుస్సేన్ పాషా మంగళవారం మద్యం మత్తులో కార్తీక్‌ను దూషించాడు. ఇది ఇద్దరి మధ్య గొడవకు కారణమైంది. ఘర్షణ మరింత పెరగడంతో కోపంతో ఊగిపోయిన కార్తీక్.. పాషా చెవి, మర్మాంగాన్ని కత్తితో కోసేశాడు. ఆ తర్వాత ‘డయల్ 100’కు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పాడు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితుడిని ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నిందితుడిని అరెస్ట్ చేశారు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Related posts

కేటీఆర్ కారుపై చెప్పు విసిరే య‌త్నం… రైతు సంఘం నేత అరెస్ట్‌!

Drukpadam

సలామ్ చేయలేదంటూ నన్ను కొట్టారు… చార్మినార్ ఎమ్మెల్యేపై ఓ వ్యక్తి ఫిర్యాదు!

Drukpadam

చిట్ ఫండ్స్ పేరుతో మోసం.. 250 ఏళ్ల జైలు శిక్ష!

Drukpadam

Leave a Comment