Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

గుజరాత్ లో కొలువుదీరిన కొత్త కేబినెట్.. ప్రమాణస్వీకారం చేసిన 24 మంది మంత్రులు!

గుజరాత్ లో కొలువుదీరిన కొత్త కేబినెట్.. ప్రమాణస్వీకారం చేసిన 24 మంది మంత్రులు!
ఈరోజు రాజీనామా చేసిన స్పీకర్ రాజేంద్ర త్రివేదికి మంత్రి పదవి
కేబినెట్ మంత్రులుగా 10 మంది, సహాయ మంత్రులుగా 14 మంది ప్రమాణం
ప్రమాణస్వీకారానికి హాజరైన మాజీ సీఎం విజయ్ రూపానీ

గుజరాత్ కొత్త మంత్రివర్గం కొలువు దీరింది. ఇటీవలే రాజీనామా చేసిన విజయ్ రూపాని స్థానంలో ముఖ్యమంత్రి గా భాద్యతలు చేపట్టిన భూపేంద్ర పటేల్ తన మంత్రి వర్గాన్ని విస్తరించారు. మొత్తం 24 మంత్రులు ప్రమాణ స్వీకారం చేయగా వారిలో 21 కొత్త వారు కావడం విశేషం … అందులో అత్యధికులు యువకులు ఉన్నారు. మరో ఏడాదిలో జరగనున్న ఎన్నికలకు సిద్దమౌతున్న బీజేపీ యువతకు ప్రాధాన్యం ఇచ్చినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.

గుజరాత్ లో ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ నేతృత్వంలో కొత్త మంత్రి వర్గం ఏర్పడింది. 24 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. మాజీ సీఎం విజయ్ రూపానీ మంత్రివర్గంలోని మంత్రులకు ఈసారి చోటు దక్కకపోవడం విశేషం.

ఇక ఈరోజు అసెంబ్లీ స్పీకర్ పదవికి రాజీనామా చేసిన రాజేంద్ర త్రివేదికి మంత్రివర్గంలో చోటు దక్కింది. ప్రమాణస్వీకారం చేసిన ఇతర నేతల్లో హృషికేశ్ పటేల్, జీతూ వఘానీ, రాఘవ్ జీ పటేల్, కానూభాయ్ దేశాయ్, కిరీట్ సింహ్ రాణా, నరేశ్ పటేల్, ప్రదీప్ పర్మార్, అర్జున్ సింహ్ చౌహాన్ ఉన్నారు.

24 మందిలో 10 మంది కేబినెట్ మంత్రులుగా, 14 మంది సహాయ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. సహాయమంత్రుల్లో ఐదుగురికి స్వతంత్ర హోదా ఉండటం గమనార్హం. వీరందరి చేత రాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా హాజరయ్యారు.

ఈ మొత్తం మంత్రుల జాభితా బీజేపీ అధిష్టానం ఆమోదం తరువాతనే ఫైనల్ చేసినట్లు సమాచారం. రానున్న కాలంలో దూకుడుగా వ్యవహరించాలనే ఉద్దేశంతోనే యువకులను కాబినెట్ లోకి తీసుకున్నారని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అమిత్ షా తో సమావేశం అయినా తరువాత మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు.

Related posts

సిపిఎం నాయకులపై తప్పుడు కేసులు పెట్టటం మానుకోవాలి…

Drukpadam

కేసీఆర్ దిష్టిబొమ్మలను దగ్ధం చేయండి: రేవంత్ రెడ్డి పిలుపు!

Drukpadam

షర్మిల పై మంత్రి నిరంజన్ రెడ్డి వివిదాస్పద వ్యాఖ్యలు !

Drukpadam

Leave a Comment