17 వార్షికోత్సవాలను పెద్ద ఎత్తున జయప్రదం చేయండి. మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్!
`విప్తవోత్సహంతో వార్షికోత్సవాలు నిర్వహించాలని
విప్లవ ప్రతిఘాతుక దాడుల నుండి పార్టీని రక్షించుకోవడం
దోపిడి వర్గాల నుండి విముక్తికై ప్రజా యుద్ధంలో ప్రజలు భాగస్వాములు కావాలి
జల్, జంగల్, జమీన్ ఆత్మగౌరవం కోసం ప్రజలను సమీకరిస్తున్నాం
జనతన సర్కార్ల నాయకత్వంలో విప్లవ సంస్కరణలు చేపట్టి నిజమైన అభివృద్ధిని సాధించుకుంటున్నారు
చింతూరు…
ఈ నెల 21వ తేదీ నుంచి మావోయిస్టు పార్టీ 17వ వార్షిక వారోత్సవాలను విప్తవోత్సహంతో నిర్వహించాలని మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పిలుపునిచ్చారు. ఈమేరకు ఆయన గురువారం ఓ ప్రకటనను మీడియాకు విడుదల చేశారు. విప్లవోద్యమాన్ని నిర్మూలించే లక్ష్యంతో శతృవు కొనసాగిస్తున్న ప్రహార్ దాడులను ఓడిరచాలని, విప్లవ ప్రతిఘాతుక దాడుల నుండి పార్టీని రక్షించుకోవడం ద్వారా దోపిడి వర్గాల నుండి విముక్తికై ప్రజా యుద్ధంలో ప్రజలు భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
భారత దేశంలో విప్లవోద్యమానికి నాయకత్వం వహిస్తున్న భారత కమ్యూనిస్టుపార్టీ (మావోయిస్టు) సెప్టెంబర్ 21 నాటికి 17 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందన్నారు. ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లోని విప్లవ ప్రజలందరు ఉత్తేజంతో వేడుకను జరుపుకుంటూ నూతన ప్రజా స్వామిక విప్లవం జయప్రదం చేసే లక్ష్యంతో ప్రజా యుద్ధం కొనసాగుతుందన్నారు. ప్రజాయుద్ధంలో అనేక మంది విప్లవ ప్రజానీకం విప్లవ కార్యక్రమాలలో పాల్గొని ప్రజాయుద్దాన్ని విస్తృతం చేస్తున్నారని, జనతన సర్కార్ల నాయకత్వంలో విప్లవ సంస్కరణలు చేపట్టి నిజమైన అభివృద్ధిని సాధించుకుంటున్నారని తెలిపారు.
భూమి లేని నిరు పేదలకు భూపంపిణీ కార్యక్రమాలు చేపడుతున్నారని, ప్రజలంతా సమిష్టిగా భూసమతళీకరణ, కుంటల నిర్మాణం, చేపలు పెంపకం, తోటలు పండిరచడం, సమిష్టి వ్యవసాయ క్షేత్రాలు నిర్మించడం, ప్రజా పంచాయితీలు, విద్య, వైద్యం వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ప్రజాసామ్య బద్ధంగా ప్రజల పరిపాలన నడుపుకుంటుందన్నారు. జనతన సర్కార్ల ద్వారా స్వలంభన నెల కొల్పుకుంటుందన్నారు. జల్, జంగల్, జమీన్ ఆత్మగౌరవం కోసం భూస్వామ్య సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాలలో ప్రజలు సమీకరించబడుతున్నారని తెలిపారు.
టీఆర్‌ఎస్ ప్రభుత్వం దోపిడి వర్గాల లాభాల కోసమే సామాన్య ప్రజలను తమ స్వంత భూముల నుండి గెంటేస్తుంటే వీటికి నిరసనగా ప్రజాందోళనలు చెలరేగుతున్నాయని అన్నారు. హరిత హారం పేరుతో రైతాంగాన్ని తరిమినేస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలు మిలిటెంటుగా జరుగుతున్నాయని తెలిపారు. అసిఫాబాద్ జిల్లాలో కవ్వాల్ టైగర్ జోన్‌కు వ్యతిరేకంగా ఇప్పటికీ ప్రజలు కొట్లాడుతున్నారని తెలిపారు.
మహబూబ్ నగర్ జిల్లాలో యురేనియం తవ్వకాలను నిరసిస్తూ చాలా కాలంగా పోరాటాలు చేపట్టడంతో ప్రస్తుతం నిలిచిపోయాయని అన్నారు. ఈ దోపిడి సమాజం నుండి విముక్తి చేసుకునే లక్ష్యంతో కొనసాగుతున్న ప్రజా నిర్మాణాలు, ప్రజా ఉద్యమాలను రక్షించు కోవడానికి ప్రజా యుద్ధంలో పాల్గొని అనేక ప్రతి ఘటన చర్యలతో చిన్నచిన్నవిజయాలు సాధించుకుంటున్నారని తెలిపారు. శతృవు తల పెట్టిన సమాధాన్ దాడిని ఓడిరచడానికి ప్రజల మద్దతుతో పిఎల్టీఏ అత్యంత థైర్య సాహసాలతో విరోచిత ప్రతిఘటనలు చేపట్టి విప్లవోద్యమాన్ని నిలబెడుతుందన్నారు.
అక్రమంగా జైళ్ళలో మగ్గుతున్న రాజకీయ ఖైదీల విడుదల కోసం, వారి మౌలిక వసతుల పరష్కారానికి పోరాడండి, రాజకీయ ఖైదీల పూర్తి మద్దతును అందించి వారి మనోసైర్యాన్ని పెంచాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్రంలో బీజేపి, రాష్ట్రం లో టీఆర్‌ఎస్ బ్రాహ్మణీయ హిందుత్వ పాసిస్టులు అధికారాన్ని చెప్పు చేతుల్లో పెట్టుకుని సామ్రాజ్యవాదులకు, దళారీ నిరంకుశ పెట్టబడి దారులకు, భూస్వాములకు ఊడిగం చేస్తున్నారు.
బూటక దేశ భక్తిని, జాతియోన్మాదాన్ని రెచ్చగోడుతూ హిందుత్వ పాసిస్టు నవ భారత్ నిర్మాణ్ ఏ జెండా పెట్టుకుని ముందుకు సాగుతున్నారని ఆయన పేర్కొన్నారు.
దీనిలో భాగంగానే నూతన విద్య విధానం అమలు చేయడం, ఆత్మ నిర్బర్ పేరుతో ప్రజల జీవితాలను దుర్భరం చేయడం, హిందుత్వ ఏజెండాను, వ్యతిరేకించిన వాళ్ళను హత్యలు చేయడం, అరెస్టులు చేసి జైళ్ళా పెట్టడం, దేశంలోని భిన్నత్వాన్ని రద్దు చేయడం, జాతుల అస్తిత్యాన్ని నాశనం చేయడం, విప్లవోద్యమాలను నిర్మూలించడం తద్వారా నవ భారత్ నిర్మాణ్ పేరుతో తమ హిందుత్వ సామ్రాజ్యాన్ని గట్టిగా నెలకొల్పుకోవడమే వారి ఏకైక లక్ష్యం. కనుక నవభారత్ నిరాణాన్ని వ్యతిరేకంగా పోరాడుతూ నూతన సమాజ స్థాపనకై సంకల్పించాలని ఆయన పిలుపునిచ్చారు.