తెలుగు రాష్ట్రాలు

రేవంత్ రెడ్డిని పవన్ కల్యాణ్ ప్రశంసించడంపై బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు!

  • రేవంత్ రెడ్డిని పవన్ కల్యాణ్ ప్రశంసించడాన్ని తప్పుబట్టిన సంజయ్
  • ఎందులో గొప్పనో నాకైతే తెలియదని ఎద్దేవా
  • హామీలు అమలు చేయనందుకు గొప్పగా కనిపించాడేమోనని పవన్‌కు చురక

సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశంసించడాన్ని కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ తప్పుబట్టారు. పవన్ కల్యాణ్‌కు రేవంత్ రెడ్డిలో ఏం మంచి కనిపించిందోనని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీని అమలు చేయనందుకు ఆయనకు నచ్చారేమోనని విమర్శలు గుప్పించారు. 

రేవంత్ రెడ్డి గొప్ప నాయకుడని పవన్ కల్యాణ్ అన్నారని, దీనిపై మీరేం చెబుతారని ఓ మీడియా ప్రతినిధి… బండి సంజయ్‌ని ప్రశ్నించారు. మీడియా ప్రతినిధి ప్రశ్నపై బండి సంజయ్ స్పందించారు.

రేవంత్ రెడ్డి ఎందుకు గొప్ప నాయకుడిగా కనిపించాడో పవన్ కల్యాణ్‌కు తెలియాలన్నారు. ఎందులో గొప్పనో, ఏ యాంగిల్ లో గొప్పనో తనకైతే తెలియదన్నారు. రైతు భరోసా, తులం బంగారం, 2 లక్షల ఉద్యోగాలు, రూ.4 వేల నిరుద్యోగ భృతి, రూ.4 వేల ఆసరా పెన్షన్ ఇస్తున్నామని చెవిలో చెబితే గొప్పవాడిగా కనిపించాడేమోనని ఎద్దేవా చేశారు.

రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్‌కు ఎక్కడో చెడినట్లుగా ఉంది… ఎవరూ చెప్పడం లేదు: బండి సంజయ్

Bandi Sanjay says differences erupted between Revanth and Allu Arjun

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి, సినీ నటుడు అల్లు అర్జున్‌కు ఎక్కడో చెడినట్లుగా తనకు అనుమానం కలుగుతోందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కానీ ఎక్కడ చెడిందో ఇద్దరిలో ఎవరూ చెప్పడం లేదన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ… సంధ్య థియేటర్ ఘటన, నటుడు అల్లు అర్జున్ వ్యవహారంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని, అలాంటప్పుడు అసెంబ్లీలో చర్చ ఎందుకని ప్రశ్నించారు.

పుష్ప-3 సినిమా రాకముందే సీఎం రేవంత్ రెడ్డి పుష్ప-3ని చూపించారని చురక అంటించారు. ఈ సినిమాకు 1,700 కోట్ల కలెక్షన్లు వచ్చాయని, జాతీయస్థాయిలోనూ ఈ సినిమాకు పేరు వచ్చిందన్నారు. తెలంగాణలో చాలామంది హీరోలు ఉన్నారని… కానీ అల్లు అర్జున్ పట్ల ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నారని అభిప్రాయపడ్డారు. వారి మధ్య ఎక్కడో చెడిందన్నారు. ఆరు గ్యారెంటీల అమలును పక్కదారి పట్టించేందుకే అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేశారని విమర్శించారు.

Related posts

ఐబొమ్మ రవిని వారం రోజుల్లో బెయిల్‌పై తీసుకొస్తా: వైజాగ్ న్యాయవాది సలీం!

Ram Narayana

ఆయన బండి సంజయ్ కాదు… తొండి సంజయ్: సీపీఐ రామకృష్ణ!

Ram Narayana

టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకర్ రెడ్డి రాజీనామాకు ఆమోదం…

Ram Narayana