Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

తమిళ్ హీరో విజయ్ కారుకు పన్ను అక్షరాల రూ 40 లక్షలు ….

తమిళ్ హీరో విజయ్ కారుకు పన్ను అక్షరాల రూ 40 లక్షలు …..
-ఎట్టకేలకు తన కారుకు రూ.40 లక్షల పన్ను చెల్లించిన విజయ్
-విదేశాల నుంచి రోల్స్ రాయిస్ కారు దిగుమతి
-2012లో పన్నుమినహాయింపు కోరిన విజయ్
-విజయ్ కి అక్షింతలు వేసిన మద్రాస్ హైకోర్టు
-లక్ష జరిమానా కట్టాలంటూ ఆదేశాలు

విజయ్ సుపరిచితమైన తమిళ్ టాప్ హీరోలలో ఒకరు …. ఆయన ముచ్చటపడి ఒక కారును విదేశాలనుంచి తెప్పించాడు ….దానికి పన్ను మినాయింపు ఇవ్వాలని కోర్ట్ ను ఆశ్రయించాడు ….. అందుకు కోర్ట్ ఒప్పుకోలేదు సరికదా …పన్నును వడ్డీ,అపరాధ రుసుముతో కలిపి కట్టమని తీర్పు చెప్పింది.దాని ఖరీదు ఎంతో తెలియదు కానీ దానికి కోర్టు వారు జరిమానాతోసహా విధించిన 40 పన్నును కరోనా ముఖ్యమంత్రి సహాయనిధికి విజయ్ అందించాడు

విదేశీ కారు కొనుగోలు చేసి పన్ను చెల్లించకపోవడం పట్ల కోర్టుతో అక్షింతలు వేయించుకున్న తమిళ హీరో విజయ్ ఎట్టకేలకు పన్ను చెల్లించాడు. తన రోల్స్ రాయిస్ ఘోస్ట్ కారుకు సంబంధించి రూ.40 లక్షల పన్ను చెల్లించాడు. విజయ్ ప్రభుత్వానికి పన్ను చెల్లించిన విషయాన్ని రాష్ట్ర అధికారులు మద్రాస్ హైకోర్టుకు తెలియజేశారు.

విజయ్ విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న కారుకు పన్ను మినహాయింపు కోరుతూ 2012లో కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణలో ఇటీవల మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. లక్ష రూపాయల జరిమానా కట్టాలని, ఆ మొత్తాన్ని తమిళనాడు సీఎం కొవిడ్ రిలీఫ్ ఫండ్ కు అందజేయాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో జరిమానాతో పాటు, కారుకు చెల్లించాల్సిన మొత్తం పన్ను రూ.40 లక్షలను కూడా విజయ్ చెల్లించినట్టు ప్రభుత్వ వర్గాలు కోర్టుకు నివేదించాయి.

Related posts

ఖమ్మం రహదారుల గుమ్మం…రింగ్ రోడ్ తో తప్పనున్నట్రాఫిక్ కష్టాలు..మంత్రి తుమ్మల

Ram Narayana

హర్యానా లో జర్నలిస్ట్ పై సైబర్ టెర్రరిజం కింద కేసు నమోదు

Drukpadam

ఫేక్ నోటుతో డాక్టర్ ను బురిడీ కొట్టించిన రోగి…

Drukpadam

Leave a Comment