ఇండ్ల స్థలాల కోసం పోరాటాలు తప్పవు..
జిల్లా మహాసభలు గొప్పగా నిర్వహించాలి
జర్నలిస్టుల గుర్తింపు పై సీఎం వ్యాఖ్యలను బలపరుస్తున్నాం
టి యు డబ్ల్యు జే (ఐ జేయు )రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె రామ్ నారాయణ

జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, అక్రిటిషన్ కార్డులు, హెల్త్ కార్డుల సమస్యలపై పోరాటాలు చేయక తప్పదని టీయూడబ్ల్యూజేఐజేయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోల రామనారాయణ అన్నారు. మంగళవారం వైరాలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు వనం వెంకటేశ్వర్లు అధ్యక్షతన
మ్మం జిల్లా టియుడబ్ల్యూజేఐజేయు మహాసభల సన్నాహక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు…ఆ సంఘం ఖమ్మం జిల్లా మహాసభలు వైరాలో నిర్వహించేందుకు నాయకత్వం నిర్ణయించింది. ఈ సందర్భంగా రామ్ నారాయణ మాట్లాడుతూ జర్నలిస్టుల హక్కుల సాధన కోసం ఐ జె యు ఆధ్వర్యంలో గొప్ప గొప్ప పోరాటాలు జరిగాయని ఆయన పేర్కొన్నారు. జిల్లా స్థాయి నుంచి జాతీయస్థాయి వరకు జర్నలిస్టుల సమస్యలపై ఐజేయు నాయకత్వంలో పోరాటాలు జరుగుతున్నాయని టియుడబ్ల్యూజే ఐజేయు అనుబంధంగా రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యలపై పోరాటాలు చేస్తుందన్నారు. ఒక గొప్ప సంఘంలో పనిచేస్తున్న మనం క్రమశిక్షణతో ఉండాలని విలువలతో కూడిన జర్నలిజాన్ని అలవర్చుకొని మంచి పేరు తెచ్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా మహాసభలు రాజకీయ చైతన్యం మంచి నేతలను అందించిన వైరాలో నిర్వహించాలని సంఘం నిర్ణయించిందన్నారు. రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ సొంత పట్టణమైన వైరాలో జరగబోతున్న మహాసభలు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ఆయన సంఘ నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
…. నిజమైన జర్నలిస్టుపై సీఎం వ్యాఖ్యలను బలపరుస్తున్నాం…












ప్రస్తుత పరిస్థితుల్లో కొంతమంది జర్నలిస్టుల పేరుతో అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని నిజమైన జర్నలిస్టులను జర్నలిస్టు సంఘాలు గుర్తించి వారికి గుర్తింపు కార్డులు ఇవ్వడం ద్వారా నిర్ధారించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తమ సంఘం బలపరుస్తుందని రామనారాయణ పేర్కొన్నారు. విలువలతో కూడిన జర్నలిజం బలపడాలని జర్నలిస్టులు క్రమశిక్షణ కలిగిన వ్యక్తులుగా బాధ్యతాయుతమైన వృత్తిలో ఉన్నందున తమ గౌరవాన్ని తాము నిలబెట్టుకోవాలని ఆయన సూచించారు. అందుకే సంఘ సభ్యత్వం ఇచ్చే సందర్భంలో ఆ జర్నలిస్టు యొక్క గుణగణాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. పెద్ద ఎత్తున సభ్యత్వం సంఖ్యను చూపించుకోవడం ముఖ్యం కాదని విలువలు ఉన్న జర్నలిస్టులను చేర్చుకోవడం ద్వారా మంచి విలువలు ఉన్న సంఘంగా మనకున్న గుర్తింపు దెబ్బతినకూడదని ఆయన అన్నారు. అవసరమైతే సీఎం సూచించినట్లు నిజమైన జర్నలిస్టులకు తమ సంఘం గుర్తింపు కార్డులను కూడా ఇస్తుందని ఆయన అన్నారు. కొంతమంది జర్నలిస్టులు సాటి జర్నలిస్టుల మీద పోరాటాలు చేస్తున్నారని ఇది మంచి సంప్రదాయం కాదన్నారు. జర్నలిస్టులు ప్రభుత్వాల మీద తమ హక్కుల కోసం పోరాటాలు చేయాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టంలో జర్నలిస్టులను ఆటో డ్రైవర్లు ట్రక్ డ్రైవర్లతో సమానం చేసిందని అటువంటి మౌలికమైన సమస్యలపై పోరాడాలని ఆయన అన్నారు. మహాసభలకు సంబంధించి కార్యాచరణ ఏ విధంగా ఉండాలి సబ్ కమిటీలు వేసుకోవడంతో సహా అనేక సూచనలు చేశారు ఈ సందర్భంగా రామ్ నారాయణ… జిల్లా అధ్యక్షుడు వనం వెంకటేశ్వరరావు ప్రధాన కార్యదర్శి ఏనుగు వెంకటేశ్వరరావు ఇంకా రాష్ట్ర కమిటీ సభ్యులు తదితరులతో కలిసి జిల్లాలోని నియోజకవర్గ ఇన్చార్జిలకు సభ్యత నమోదు పుస్తకాలను అందజేశారు. ఇళ్ల స్థలాల సమస్యను రాష్ట్ర కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా పరిష్కరించాలని కోరుతున్నామని అందరికీ ఇండ్ల స్థలాలు సాధించడమే లక్ష్యంగా పోరాటాలు చేసేందుకు సిద్ధం కావాలని కూడా ఆయన పిలుపునిచ్చారు…. హెల్త్ కార్డు విషయంలో ఇటీవలే హెల్త్ మినిస్టర్ ను కలిసి రాష్ట్ర నాయకత్వం చర్చించామని ఒక జర్నలిస్టుకు సంబంధించి వైద్యం చేయించి హెల్త్ కార్డు పై సుమారు 5 లక్షల రూపాయలు మంజూరు చేయించినట్లు తెలిపారు.


కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఏనుగు వెంకటేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు మాటేటి వేణుగోపాల్,ఎస్కె ఖాదర్ , ఖమ్మం నగర అధ్యక్షులు మైస పాపారావు, జిల్లా ఉపాధ్యక్షులు మొహిద్దిన్, తాతా శ్రీనివాసరావు, ఖమ్మం నగర కార్యదర్శి చెరుకుపల్లి శ్రీనివాసరావు, వైరా డివిజన్ నాయకులు ఏపూరి రాజారావు, ఎక్కిరాల శ్రీనివాస్ , శ్రీనివాసరావు, కొత్త వెంకటేశ్వరరావు, మధిర డివిజన్ నాయకులు యోగి, పి. బాలస్వామి, పాలేరు డివిజన్ నాయకులు నాగేశ్వరరావు, తదితరులు ప్రసంగించారు.