Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

టీఆర్ యస్ లో అలక -మేయర్ ఎన్నికను బాయ్ కట్ చేసిన విజయారెడ్డి

టీఆర్ యస్ లో అలక -మేయర్ ఎన్నికను బాయ్ కట్ చేసిన విజయారెడ్డి
-టీఆర్ యస్ ఎం ఐ ఎం బాయ్ బాయ్
-వారిమధ్య ఒప్పందాన్ని బట్టబయలు చేసినమన్న బీజేపీ
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నికలో టీఆర్ యస్ కార్పొరేటర్ అలక బూనారు . ఖైరతాబాద్ కు చెందిన దిగవంత పి జే ఆర్ కుమార్తె విజయారెడ్డి అలక బూనారు . ఆమె గ్రేటర్ మేయర్ ఫీఠాన్ని గట్టిగ ఆశించారు. మొదటి సారి ఎన్నిక అయినప్పుడే ఆమె మేయర్ కావాలని కలలు కన్నారు. రెండవసారి కార్పొరేటర్ గా తిరిగి ఎన్నికైయ్యారు. పైగా మేయర్ పదవి మహిళలకు కేటాయించబడింది. ఇంకేముంది తనకు ఆవకాశం వస్తుందని అనుకున్నారు విజయారెడ్డి . కానీ ఆమెపేరును కనీసం పరిసనలోకి కిడా రేకపోవటం ఆమె నిరాశకు కారణమైంది. దీంతో మేయర్ ఎన్నిక సందర్భంగా ఆమె ప్రమాణస్వీకారం చేసిన వెంటనే మేయర్ , డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగక ముందే సమావేశ మందిరం నుంచి వెళ్లిపోయారు. అక్కడ ఉన్న మంత్రులు , ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు కంగుతిన్నారు. తాము చెప్పిన మాటకు తిరుగుండదని తాము ఎవరి పేరు చెపితే వారిని అందరు బలపరుస్తారని భావించిన అది నాయకత్వానికి షాక్ తగిలినంత పనైంది.
టీఆర్ యస్ , ఎం ఐ ఎం ఒప్పందం
కార్పొరేషన్ ఎన్నికలలో ఒకరిపై ఒకరు దుమ్ములేత్తి పోసుకున్న టీఆర్ యస్ ,ఎం ఐ ఎం లు బాయ్ బాయ్ అయ్యారు . ఎన్నికలలో ఇద్దరి మధ్య రహస్య ఒప్పందం ఉన్నదని తాము ముందే చెప్పమని బీజేపీ నేతలు పేర్కొన్నారు. మేయర్ ఎన్నిక అనంతరం బయటకు వచ్చిన బీజేపీ కార్పొరేటర్లు ,లోయర్ ట్యాంక్ బండ్ అంబేత్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. టీఆర్ యస్ ఎం ఐ ఎం లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
మేయర్ గా కేకే కుమార్తె గద్వాల విజయలక్ష్ష్మి మేయర్ గా, డిప్యూటీ మేయర్ గా మోతే శ్రీలత ను టీఆర్ యస్ ఎంపిక చేయటం, ఎం ఐ ఎం బలపరచడం తో వారి ఎన్నిక జరిగింది. బీజేపీ తరుపున పోటీచేసిన మేయర్ అభ్యర్థి ఓడిపోయారు. టీఆర్ యస్ , ఎం ఐ ఎం చీకటి ఒప్పందాన్ని బట్టబయలు చేసేందుకే తాము పోటీచేశామని బీజేపీ వెల్లడించింది.

Related posts

మరో పాదయాత్ర చేపట్టనున్న రాహుల్ గాంధీ!

Drukpadam

చంద్రబాబు దీక్షలో జగన్ పై అగ్గిమీద గుగ్గిలం …

Drukpadam

భారత్ ,చైనా సంబంధాలపై రష్యా అధ్యక్షుడు పుతిన్ వ్యాఖ్య ……

Drukpadam

Leave a Comment