Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పార్లమెంట్ లో తెలంగాణ సంక్షేమాన్ని ఆవిష్కరించిన నామ

పార్లమెంట్ లో తెలంగాణ సంక్షేమాన్ని ఆవిష్కరించిన నామ
-తెలంగాణ గ్రామాలూ దేశానికే రోల్ మోడల్
-సభ్యులంతా నోరెళ్ళబెట్టి ఆశక్తిగా విన్న దృశ్యం
-ఒకరి ముఖాలు ఒకరి చూసుకున్న బండి, ధర్మపురి
-నామ ను అభినందించిన పలువురు ఎంపీలు
నామ నాగేశ్వరరావు పార్లమెంట్ సభ్యులు …. టీఆర్ యస్ లోకసభ పక్షనేత … రెండవసారి పార్లమెంటుకు ఎన్నికైన నాయకుడు … కాకపోతే పార్టీ మారారు అంతే … గతంలో తెలుగుదేశం నుంచి ఖమ్మం ఎంపీగా ఎన్నికైయ్యారు. … 2009 లో గెలిచిన నామ, 2014 లో ఓడిపోయారు. తిరిగి 2019 లో టీఆర్ యస్ లో చేరి ఖమ్మం లోకసభకు ఎన్నికైయ్యారు. ఆయనకు కలిసొచ్చిన అంశం ఏమిటంటే అప్పుడు టీడీపీ లోను ఇప్పుడు టీఆర్ యస్ లోను లోకసభ పక్షనాయకుడుగా వ్యవహరించటం .వచ్చిన అవకాశాన్ని వినియోగించుకునే నాయకుడు. ఖమ్మం నుంచి లోకసభకు ఎన్నికైన సభ్యుడుగా అనేక సార్లు సభలో మాట్లాడే ఆవకాశం రావడం . గెలిచిన రెండుసార్లు తాను ఉన్న పార్టీలో లోకసభ పార్టీ పక్ష నాయకుడుగా వ్యవహరించటం . అంతే కాదు ఆయన సమస్యల పై స్పందించే తీరు ఆకట్టుకునేలా ఉంటుంది.
హిందీ , ఇంగ్లీష్ లలో తేలికైన భాషలో ఆయన చేస్తున్న ప్రసంగాలు అందరికి అర్థం అయ్యేలా ఉంటాయి. ఆయన విషయాలను సభదృష్టికి తెచ్చే తీరు చక్కగా ఉంటుందనే అభిప్రాయం ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఆయన పార్లమెంట్ లో చేస్తున్న ఉపన్యాసాలు దురంతో ,రాజధాని ఎక్సుప్రెస్ పరిగెత్తినట్లు ఉంటాయి. పెద్దగా తడుముకోరు, పదాలు ఏవైనా పరుగెత్తటమే . రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సందర్భంగా రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించిన తీరు సభను ఆకట్టుకున్నది. ఆయన ప్రసగిస్తున్నంతసేపు బీజేపీ తెలంగాణ ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్ లు ఒకరిముఖం ఒకరు చూసుకున్నారు. మిగితా సభ్యులు ఆశక్తిగా విన్నారు. ఒకరకంగా చెప్పాలంటే పార్లమెంట్ లో తెలంగాణ సంక్షేమాన్ని ఆవిష్కరించారు . కేసీఆర్ పథకాలు దేశానికే రోల్ మోడల్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అములు జరుపుతున్న పథకాలు అనేకం మన్నారు. గాంధీజీ కలలు కన్న గ్రామస్వరాజ్యం మరెక్కడోలేదు తెలంగాణాలో ఉందని అన్నారు. రైతు బందు పధకం తెలంగాణ తప్ప మారే రాష్ట్రంలో అమలు జరపటంలేదన్నారు. రైతు బంద్ పథకం ద్వారా ఒక ఎకరాకు 10 వేల రూపాయలు రైతులకు అందజేసుతున్న ప్రభుత్వం కేసీఆర్ దేనన్నారు . 2017 ,2018 లనుంచి ఈ పధకం అమలవుతుందన్నారు. ఇప్పటి వరకు 39 వేల కోట్లు నేరుగా రైతుల ఖాతాలలో జమ చేసిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది ఒక్క కేసీఆర్ ప్రభుత్వమేనన్నారు. 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్న ప్రభుత్వం కూడా తమదే అన్నారు. రైతుల క్షేమం కోసం 5 వేల ఎకరాలకు ఒక రైతు వేదిక వేర్పాటు చేసిన ఘనత కూడా కేసీఆర్ దేనన్నారు. ప్రకృతి వైఫరీత్యాలు వచ్చినప్పుడు ,సన్న, చిన్నకారు రైతులను ఆదుకునేందుకు ప్రత్యేక నిధిని వేర్పాటు చేసిన ప్రభుత్వం తమదే అన్నారు. గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేసేందుకు తమ ముఖ్యమంత్రి కేసీఆర్ నిధులు , విధులతో పాటు , వారికి కావలిసిన మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం చేపట్టిన చర్యలను వివరించారు. పల్లెలు ప్రగతికి మెట్లు గ్రామాలు అవి బాగుంటేనే అందరం బాగుంటామని , గ్రామాభివృద్దే దేశాభివృద్ధి అని నమ్మిన కేసీఆర్ ఆదర్శ గ్రామాలుగా తీర్చి దిద్దుతున్నారని పేర్కొన్నారు.చనిపోయిన వ్యక్తులను ఖననం చేసేందుకు స్థలాలు దొరకటం కష్టంగా ఉందని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని స్మశాన వాటికలు కోసం ప్రతి గ్రామంలో అన్ని సౌకర్యాలతో వైకుంఠ ధామాలను వేర్పాటు చేయటం జరిగిందన్నారు. అదేవిధంగా ప్రతి గ్రామపంచాయతి ట్రాక్టర్ , ట్రాలీ , ట్యాంకర్ , ఇచ్చి వాటి మాయింటినెన్స్ కూడా చూస్తున్నదని అన్నారు. గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చి దిద్దటంలో తెలంగాణ దేశానికే రోల్ మోడల్ గా ఉందన్నారు. అన్ని గ్రామాలకు ,అన్ని ఇండ్లకు 98 .64 శాతం ప్రజలకు తాగు నీరు అందిస్తున్నది తెలంగాణనే అన్నారు. ఇక కల్యాణలక్ష్మి , షాదీ ముబారక్ , అమలు చేస్తున్నామన్నారు. దేశంలో తలసరి ఆదాయం లక్ష 26 వేలు ఉండగా తెలంగాణాలో తలసరి ఆదాయం రెండు లక్షల 5 వేలు గా ఉందని చెప్పారు నామ . బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ తో పాటు , రాష్ట్రములో ట్రైబల్ యూనివర్సిటీ , ఐ ఐ ఎం , హైదరాబాద్కు మరో రింగ్ రోడ్, రైల్వే ప్రాజక్టు లు , ఎయిర్ పోర్ట్ ,నవోదయ విద్యాలయాలు మంజూరిలాంటి సమస్యలను ఆయన సభదృష్టికి తెచ్చారు.

Related posts

సిద్ధరామయ్య మామూలుగానే ఉగ్రవాదిలా కనిపిస్తారు: బీజేపీ కర్ణాటక చీఫ్…

Drukpadam

ఉత్తరప్రదేశ్ బీజేపీ లో లుకలుకలు …..

Drukpadam

డీఎంకే అధినేత స్టాలిన్ కు ఫోన్ చేసిన సీఎం జగన్…

Drukpadam

Leave a Comment