Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

డీఎంకే అధినేత స్టాలిన్ కు ఫోన్ చేసిన సీఎం జగన్…

డీఎంకే అధినేత స్టాలిన్ కు ఫోన్ చేసిన సీఎం జగన్…
  • తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దిశగా డీఎంకే
  • స్పష్టమైన ఆధిక్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న డీఎంకే
  • సీఎం పీఠం ఎక్కబోతున్న స్టాలిన్
  • అభినందనలు తెలిపిన ఏపీ సీఎం
  • స్టాలిన్ తనయుడు ఉదయనిధి విజయం
 CM Jagan appreciates DMK chief MK Stalin

తమిళనాడులో డీఎంకే విజయం దాదాపు నిశ్చయమైంది. కౌంటింగ్ ప్రారంభమైన కొన్ని గంటల్లోనే గెలుపు ఎవరిదో స్పష్టత వచ్చింది. తమిళనాడు అసెంబ్లీకి 234 స్థానాలు ఉండగా, ప్రస్తుతం డీఎంకే 40 స్థానాల్లో నెగ్గి, మరో 117 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ డీఎంకే అధినేత స్టాలిన్ కు ఫోన్ చేశారు. ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నందుకు అభినందలు తెలిపారు.

ఈ అసెంబ్లీ ఎన్నికల్లో స్టాలిన్ కొళత్తూరు నియోజకవర్గం నుంచి బరిలో దిగారు. ప్రస్తుతం ఆయన మెరుగైన ఆధిక్యంలో ఉన్నారు. అటు, చేపాక్ నియోజకవర్గం నుంచి పోటీచేసిన స్టాలిన్ తనయుడు, సినీ నటుడు ఉదయనిధి స్టాలిన్ విజయం సాధించారు.

కాగా, తమ పార్టీ అధికారంలోకి రాబోతుండడంపై ఎంకే స్టాలిన్ స్పందించారు. డీఎంకే చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతుందని అన్నారు. ఈ విజయం తాము ఊహించినదేనని స్పష్టం చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో వేడుకలకు దూరంగా ఉండాలని పార్టీ శ్రేణులను ఆదేశించారు.

Related posts

అభ్యర్థుల జాబితాను రెడీ చేసిన పంజాబ్ కాంగ్రెస్.. రెండు స్థానాల నుంచి సీఎం చన్నీ పోటీ!

Drukpadam

భట్టి పాదయాత్రలో పాల్గొంటా ….. కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Drukpadam

బీజేపీ పాలిట రాష్ట్రాలు వ్యాటు తగ్గించాయి మరి తెలంగాణ సంగతేమిటి ? : బండి సంజ‌య్

Drukpadam

Leave a Comment