Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

టీటీడీ బోర్డు నుంచి ఆ 52 మందిని తొలగించండి: గవర్నర్ ను కోరిన సోము వీర్రాజు!

టీటీడీ బోర్డు నుంచి ఆ 52 మందిని తొలగించండి: గవర్నర్ ను కోరిన సోము వీర్రాజు!
-గవర్నర్ ను కలిసి వినతిపత్రం సమర్పణ: తమ వినతికి గవర్నర్ సానుకూలంగా స్పందించారన్న సోము
-టీటీడీకి జంబో బోర్డు వెల్లు ఎత్తుతున్న విమర్శలు
-52 మంది ప్రత్యేక ఆహ్వానితులకు చోటు
-పాలక మందలికన్నా ప్రత్యేక ఆహ్వానితులే ఎక్కువగా ఉన్నారని విమర్శ
-కొత్త సంస్కృతికి తెరలేపారంటూ సోము వీర్రాజు వ్యాఖ్యలు
-టీటీడీ రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందని విమర్శ

ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం కు కొత్త పాలకమండలిని నియమించారు. 28 మంది పాలక మండలి సభ్యులను నియమించగా మరో 52 మంది ప్రత్యేక ఆహ్వానితునాల్ని నియమించడం పై విమర్శలు వెల్లు ఎత్తుతున్నాయి. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు దీనిపై రాష్ట్ర గవర్నర్ విశ్వ చందన్ హరిభూషణ్ ను కలసి టీటీడీ పాలకమండలి లో ప్రత్యేక ఆహ్వానితులే పేరుతొ నియమించని జంబో పాలకమండలి పై ఫిర్యాదు చేసింది. ప్రత్యేక ఆహ్వానితులే వల్ల సామాన్య భక్తులకు ఇబ్బందులు కలుగుతాయని అందువల్ల వారినందరిని తొలగించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది దీనిపై గవర్నర్ హరిభూషణ్ సానుకూలంగా స్పందించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు .గవర్నర్ ను కలిసిన అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ తిరుపతి స్వామి వారిని దర్శించుకోవాలనుంటే ఇక సామాన్యభక్తులకు ఇబ్బందులేనని అన్నారు.

ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డులో భారీ ఎత్తున ప్రత్యేక ఆహ్వానితులకు చోటు కల్పించారంటూ ధ్వజమెత్తారు. జగన్ ఆధ్వర్యంలో వైసీపీ సర్కారు టీటీడీ బోర్డు విషయంలో గతంలో ఎన్నడూలేని కొత్త సంస్కృతికి తెరదీసిందని ఆరోపించారు. సాధారణ బోర్డుకు అదనంగా 52 మంది ప్రత్యేక ఆహ్వానితుల పేరుతో టీటీడీ బోర్డును ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని విమర్శించారు.

ఎంతో ప్రాశస్త్యం కలిగిన హిందూ దేవాలయాల విషయంలో, ధార్మిక చింతనకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఇలాంటి రాజకీయ చర్యలను తాము నిరసిస్తున్నామని సోము వీర్రాజు స్పష్టం చేశారు.

ప్రభుత్వం నియమించిన 52 మంది ప్రత్యేక ఆహ్వానితులను వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కోరామని వెల్లడించారు. ఈ మేరకు వినతిపత్రం అందించామని తెలిపారు. టీటీడీ అంశంపై గవర్నర్ సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు.

 

Related posts

నేడు కేంద్ర కేబినెట్ విస్తరణ.. ఆశల పల్లకిలో తెలుగు ఎంపీలు…

Drukpadam

20 రేట్ల ప్రతీకారం తీర్చుకుంటా …చంద్రబాబు

Drukpadam

జనరల్ రావత్ హెలికాప్టర్ కూలిపోవడంపై అనుమానాలున్నాయి: సుబ్రహ్మణ్య స్వామి!

Drukpadam

Leave a Comment