Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

మంద కృష్ణ మాదిగ ఇంటికి వెళ్లి పరామర్శించిన చంద్రబాబు!

మంద కృష్ణ మాదిగ ఇంటికి వెళ్లి పరామర్శించిన చంద్రబాబు!
-ఢిల్లీలోని హోటల్లో ప్రమాదానికి గురైన మంద కృష్ణ
-హైదరాబాదులోని ఇంట్లో బెడ్ రెస్టులో ఉన్న వైనం
-ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన చంద్రబాబు

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష మాదిగ ఇటీవల ఢిల్లీ పర్యటనలో పార్లమెంట్ సభ్యుల కోసం కేటాయించే వెస్ట్రన్ కోర్ట్ లో బస చేశారు. అక్కడ ఆయన ప్రమాదవశాత్తు బాత్ రూమ్ లో కాలుజారి పడిపోయారు. విషయం తెలిసిన వెంటనే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మందకృష్ణకు సరైన వైద్యం అందేలా చర్యలు తీసుకున్నారు. అక్కడ కొన్ని రోజులు విశ్రాంతి అనంతరం కిషన్ రెడ్డి స్వయంగా ఆయన తన వెంట హైద్రాబాద్ తీసుకోని వచ్చారు. మంద కృష ను హైద్రాబాద్ లో పలువు ప్రముఖులు పరామర్శిస్తున్నారు. సోమవారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మంద కృష్ణ మాదిగ ఇంటికి వెళ్లి పరామర్శించారు.

ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగను టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. హైదరాబాదులోని మంద కృష్ణ ఇంటికి చంద్రబాబు వెళ్లారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కుటుంబసభ్యులతో మాట్లాడారు. మంద కృష్ణ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఢిల్లీలోని వెస్ట్రన్ కోర్ట్ హోటల్లో ఇటీవల మంద కృష్ణ ప్రమాదానికి గురయ్యారు. కాలు జారి పడటంతో ఆయన కుడికాలి ఎముక విరిగింది. ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందించారు. ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని ఆయనకు వైద్యులు సూచించారు. ఢిల్లీ అపోలోలో శస్త్ర చికిత్స నిర్వహించిన తర్వాత ఆయన హైదరాబాదులోని ఇంటికి వచ్చారు. హైదరాబాదుకు వచ్చినప్పటి నుంచి ఆయన బెడ్ రెస్ట్ లో ఉన్నారు. మంద కృష్ణను పరామర్శించిన వారిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, వైయస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల, బీఎస్పీ నేత ప్రవీణ్ కుమార్ ఉన్నారు. వివిధ పార్టీలకు చెందిన వారు ఉద్యోగులు, ఉద్యమకారులు ఎమ్మెల్యేలు ,ఎంపీ లు , మాజీ మంత్రులు , ఆయనను పరామర్శిస్తున్నారు.

Related posts

ట్విట్టర్ ,భారత్ ప్రభుత్వం మధ్య వార్ …….

Drukpadam

పాకిస్థాన్ లో హత్యకు గురైన కాందహార్ విమాన హైజాకర్!

Drukpadam

కాసుల వర్షం కురిపిస్తున్న టమాట సాగు …

Ram Narayana

Leave a Comment