Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

బోడుప్పల్ లో షర్మిల నిరుద్యోగ దీక్ష …. అరెస్ట్…

బోడుప్పల్ లో షర్మిల నిరుద్యోగ దీక్ష ….షర్మిల అరెస్ట్…
-పోలీసులు కేసీఆర్ తొత్తులుగా మారారు: ధ్వజమెత్తిన వైయస్ షర్మిల
-ప్రతి మంగళవారం నిరుద్యోగులకు మద్దతుగా దీక్ష
-బోడుప్పల్ దీక్షకు అనుమతి లేదన్న పోలీసులు
-అయినా దీక్ష చేపట్టడంతో షర్మిల అరెస్టు

ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష చేపడుతున్న వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల హైద్రాబాద్ లోని బోడుప్పల్ లో చేప్పట్టిన దీక్ష అరెస్ట్ లకు దారితీసింది. దీక్షకు అనుమతి లేదని షర్మిల ను పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలనీ , నిరుద్యోగ ఆత్మహత్యలను నివారించాలని డిమాండ్ చేస్తూ బోడుప్పల్ లో షర్మిల దీక్ష చేపట్టారు. దీనికి పెద్ద ఎత్తున నిరుద్యోగులు హాజరైయ్యారు. తమ దీక్షకు ముందు అనుమతి ఇచ్చిన పోలీసులు , అనుమతి లేదని చెప్పటం దారుణమని అన్నారు. పోలీస్ లు కేసీఆర్ తొత్తులుగా మారారని ధ్వజమెత్తారు.

వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల ప్రతి మంగళవారం నాడు నిరుద్యోగులకు మద్దతుగా దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె ఇవాళ బోడుప్పల్‌ ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో దీక్ష చేయాలని నిర్ణయించారు. అయితే దీనికి అనుమతి లేదని పోలీసులు తెలిపారు. అయినా షర్మిల దీక్షకు దిగడంతో గ్రౌండ్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే షర్మిలను మేడిపల్లి పోలీసులు అరెస్టు చేశారు.

తొలుత ఉద్యోగం లేకపోవడంతో ఆత్మహత్య చేసుకున్న రవీంద్ర కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. అనంతరం అనుమతి లేకపోయినా దీక్షకు కూర్చున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై ట్విట్టర్ వేదికగా షర్మిల మండిపడ్డారు. ‘‘పోలీసులు కేసీఆర్ తొత్తులుగా మారి శాంతియుతంగా దీక్షలు చేస్తున్న మాకు, అనుమతి ఇచ్చి, చివరి నిమిషంలో మాట మార్చి, మా దీక్షను భగ్నం చేసి, మా కార్యకర్తలని లాఠీలతో కొట్టి, మద్దతిస్తున్న యువతను అరెస్ట్ చేసి, నన్ను హౌస్ అరెస్ట్ చేసినంత మాత్రాన మా నిరుద్యోగ దీక్షలు నోటిఫికేషన్లిచ్చే దాకా ఆగవు’’ అని స్పష్టం చేశారు.

Related posts

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు: అలంపూర్ ఎమ్మెల్యే…

Drukpadam

ముమ్మరంగా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం …మండలంలో 10 వేల చేర్పిస్తే రాహుల్ తో సన్మానం!

Drukpadam

టీమిండియా చీఫ్ కోచ్ పదవికి గుడ్ బై చెప్పిన రవిశాస్త్రి..

Drukpadam

Leave a Comment