- అమరావతి భూముల అంశంలో సీఐడీకి ఫిర్యాదు చేసిన ఆర్కే
- ఆర్కే ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన సీఐడీ
- చంద్రబాబు, మాజీమంత్రి నారాయణలకు నోటీసులు
- సీఆర్పీసీ సెక్షన్ 160 కింద ఆర్కేకి కూడా నోటీసులు
- రేపు ఉదయం 11 గంటలకు హాజరవ్వాలని ఆదేశం
అమరావతి అసైన్డ్ భూముల అంశంపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఐడీకి ఫిర్యాదు చేయడం తెలిసిందే. ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సీఐడీ… టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణలకు నోటీసులు జారీ చేసింది.
తాజాగా ఈ కేసుకు సంబంధించి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి కూడా సీఐడీ అధికారులు నోటీసులు పంపారు. సీర్పీసీసీ సెక్షన్ 160 కింద నోటీసులు జారీ చేశారు. రేపు ఉదయం 11 గంటలకు విజయవాడ సీఐడీ కార్యాలయంలో హాజరు కావాలని ఎమ్మెల్యేకి స్పష్టం చేశారు.
కాగా ఈ అంశంలో ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. సీఎం జగన్ కు ఎవరిపైనా కక్ష సాధించాలన్న ఆలోచన లేదని స్పష్టం చేశారు. అమరావతి భూముల అంశంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా సీఐడీ ముందు హాజరై వివరణ ఇస్తారని వెల్లడించారు.