Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో షేక్ సాబ్జీ విజయం

  • ఈ నెల 14న ఏపీలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్
  • నేడు ఓట్ల లెక్కింపు
  • 1,500కి పైగా మెజారిటీలో సాబ్జీ గెలుపు
  • కొనసాగుతున్న గుంటూరు-కృష్ణా జిల్లాల ఓట్ల లెక్కింపు

ఏపీలో ఈ నెల 14న రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. నేడు కౌంటింగ్ నిర్వహించగా తూర్పు గోదావరి-పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో షేక్ సాబ్జీ విజయం సాధించారు. షేక్ సాబ్జీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో యూటీఎఫ్ అభ్యర్థిగా బరిలో దిగారు. ఆయన తన సమీప ప్రత్యర్థి గంధం నారాయణరావుపై 1,500కి పైగా ఓట్ల తేడాతో నెగ్గారు. అటు, గుంటూరు-కృష్ణా జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో కల్పలత ముందంజలో ఉన్నారు. ప్రస్తుతానికి తన సమీప ప్రత్యర్థి బొడ్డు నాగేశ్వరరావుపై కల్పలత 1,058 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

Related posts

ఏపీ లో తెలుగు అకాడమీ పేరు మార్పుపై రాద్ధాంతం….

Drukpadam

నవంబరు నుంచి వాట్సాప్ సేవలు ఈ క్రింద మొబైల్స్‌లో బంద్ కానున్నాయి!

Drukpadam

అసెంబ్లీ ఎవడబ్బ సొత్తుకాదని గుర్తు పెట్చుకో …పొంగులేటికి ఎంపీ వద్దిరాజు వార్నింగ్

Drukpadam

Leave a Comment