Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

వివాదంలో తెలంగాణ వైద్య శాఖ డైరెక్ట‌ర్‌.. క్షుద్ర పూజలు చేస్తూ దొరికిన వైనం!

వివాదంలో తెలంగాణ వైద్య శాఖ డైరెక్ట‌ర్‌.. క్షుద్ర పూజలు చేస్తూ దొరికిన వైనం!
-దేవుడు క‌రుణిస్తాడ‌ని విచిత్ర పూజ‌లు
-ఖ‌మ్మంలో దేవ‌త‌గా ప్ర‌క‌టించుకున్న ఎంపీపీ చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు
-రాజ‌కీయ ఎంట్రీ కోస‌మే శ్రీనివాస్ క్షుద్ర పూజ‌లంటూ విమ‌ర్శ‌లు

శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో క్షుద్రపూజలు చేయడం పై విమర్శలు ఉన్నాయి. పల్లెల్లో సైతం ఎవరైనా అలాంటివి చేస్తే అతనికి పిచినెత్తికెక్కిందని , పైత్యమని అంటారు . అలాంటిది రాష్ట్రంలో ఆరోగ్యశాఖకు డైరక్టర్ గా ఉన్న వ్యక్తి రహస్యంగా క్షుద్రపూజలు చేయించడంపై విమర్శలు వెల్లు ఎత్తుతున్నాయి. సైన్స్ ను విధిగా ప్రచారం చేసి మూఢనమ్మకాలను ప్రజల నుంచి దూరం చేయాల్సిన ఒక ఉన్నతాధికారి చర్యలను పలువురు ప్రశ్నిస్తున్నారు .

తెలంగాణ వైద్య శాఖ డైరెక్ట‌ర్ శ్రీనివాస్ పెను వివాదంలో చిక్కుకున్నారు. క‌రోనా నేప‌థ్యంలో ఇటీవ‌ల నిత్యం మీడియా ముందుకు వ‌స్తున్న శ్రీనివాస్‌.. కొత్త‌గూడెంలో క్షుద్ర పూజ‌లు చేస్తూ దొరికిపోయారు. ప్ర‌భుత్వ అధికారిగా.. అది కూడా వైద్య శాఖ డైరెక్ట‌ర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్ క్షుద్ర పూజ‌లు చేయ‌డం ఏమిటంటూ ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు. ఈ వ్య‌వ‌హారం ఇప్పుడు తెలంగాణ‌లో హాట్ టాపిక్‌గా మారిపోయింది.

గ‌త కొంత కాలంగా కొత్తగూడెం, ఖ‌మ్మం ప‌రిధిలో ప‌ర్య‌టిస్తున్న శ్రీనివాస్ దేవుడు క‌రుణిస్తాడ‌ని చెబుతూ విచిత్ర పూజ‌లు చేయిస్తున్నార‌ట‌. అంతేకాకుండా ఖ‌మ్మంలో త‌న‌ను తాను దేవ‌త‌గా ప్ర‌క‌టించుకున్న టీఆర్ఎస్ ఎంపీపీ చుట్టూ ఆయ‌న ప్ర‌ద‌క్షిణ‌లు చేస్తున్నార‌ట‌. దీనికి సంబంధించిన విజువ‌ల్స్ ఇప్పుడు మీడియాలో వైర‌ల్‌గా మారిపోయాయి. అంతేకాకుండా రాజకీయ రంగ ప్ర‌వేశం కోస‌మే శ్రీనివాస్ క్షుద్ర పూజ‌లు చేస్తున్నారంటూ ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

క్షుద్ర పూజ‌ల‌పై తెలంగాణ హెల్త్ డైరెక్ట‌ర్ స్పంద‌న ఇదే

తెలంగాణ వైద్య శాఖ డైరెక్ట‌ర్ శ్రీనివాస్ క్షుద్ర పూజ‌లు చేస్తున్నార‌న్న వార్త‌లు రాష్ట్రంలో క‌ల‌క‌లం రేపుతున్న సంగ‌తి తెలిసిందే. కొత్తగూడెంలో జ‌రిగిన క్షుద్ర పూజ‌ల్లో శ్రీనివాస్ పాల్గొన్న వీడియోలు కూడా న్యూస్ ఛానెళ్ల‌లో ప్ర‌సారం కావ‌డంతో ఆయ‌నే స్వ‌యంగా మీడియా ముందుకు వ‌చ్చి వివ‌ర‌ణ ఇచ్చారు.

ఈ సంద‌ర్భంగా క్షుద్ర పూజ‌ల ఆరోప‌ణ‌ల‌పై శ్రీనివాస్ మాట్లాడుతూ.. “మా నాన్న పేరిట చారిట‌బుల్ ట్ర‌స్ట్ పెట్టాం. సేవ‌లో భాగంగా హెల్త్ క్యాంపులు నిర్వ‌హిస్తున్నాం. ఎంపీపీలు పూజ‌లు చేస్తున్నామ‌ని పిలిచారు. హాలిడేలో భాగంగా కొత్త‌గూడెం వెళ్లాను. బంజారా గిరిజ‌న దేవ‌త పూజ‌కు మాత్ర‌మే హాజ‌ర‌య్యా. నేను హోమానికే దండం పెట్టాను. వ్య‌క్తికి దండం పెట్ట‌లేదు. హోమంలో పాల్గొని బొట్టు మాత్ర‌మే పెట్టుకున్నా. అంతే. అంత‌కుమించి ఏమీ లేదు. రాజ‌కీయాల‌తో నాకు సంబంధం లేదు” అంటూ ఆయన వివ‌రించారు.

Related posts

కుక్కపిల్లల కోసం ఎలుగుబంటిని లెక్కచేయని అమెరికా అమ్మాయి!

Drukpadam

తెలంగాణాలో ఆర్టీసీ లగేజి చార్జీల బాదుడు …సామాన్యుడిపై మరింత భారం!

Drukpadam

వివేకా హత్య కేసులో అజేయ కల్లం మాపై ఇలాంటి ఆరోపణలు చేస్తారని ఊహించలేదు: సీబీఐ

Ram Narayana

Leave a Comment