లండన్ చేరుకున్న సీఎం జగన్…!
ఏపీలో ముగిసిన పోలింగ్
కుటుంబంతో కలిసి విదేశీ యాత్రకు బయల్దేరిన సీఎం జగన్
తిరిగి ఈ నెల 31న ఏపీకి రాక

ఏపీలో ఎన్నికల అనంతరం సీఎం జగన్మోహన్ రెడ్డి గత రెండునెలలుగా తీరిక లేకుండా ఎన్నికల ప్రచారంలో ఉన్నారు…సిద్ధం ,మేమంతా సిద్ధం సభలతో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు … ఎన్నికల అనంతరం కౌంటింగ్ వరకు 20 రోజులపాటు విరామం ఉండటంతో తన ఇద్దరు కూతుళ్లతో గడిపేందుకు యూరప్ దేశాల పర్యటనకు వెళ్లారు …ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఏ 1 గా ఉన్న జగన్ విదేశీ పర్యటనకు సిబిఐ కోర్ట్ అనుమతి అవసరం కావడంతో ఆయన కోర్ట్ ను ఆశ్రయించి అనుమతి పొందారు ..ఆయనకు అనుమతి ఇవ్వద్దని సిబిఐ కోర్టులో అభ్యంతరం చెప్పింది …సిబిఐ అభ్యంతరాన్ని తోసిపుచ్చిన కోర్ట్ ఆయన పర్యటనకు అనుమతి ఇవ్వడంతో శక్రవారం రాత్రి 11 గంటలకు ప్రత్యేక విమానంలో భార్య భారతితో కలిసి గన్నవరం విమాశ్రయం నుంచి లండన్ బయలుదేరి వెళ్లారు ..
ఆయన ఇవాళ లండన్ చేరుకున్నారు. ఉన్నత విద్య కోసం సీఎం జగన్ ఇద్దరు కుమార్తెలు లండన్ లో ఉంటున్నారు. ఏపీలో పోలింగ్ పూర్తి కావడంతో సీఎం జగన్ లండన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ దేశాల్లో పర్యటించేందుకు కోర్టు అనుమతి తీసుకున్నారు. తిరిగి ఈ నెల 31న ఆయన ఏపీకి రానున్నారు. జూన్ 4 న ఏపీ అసెంబ్లీ ఎన్నికలతోపాటు , పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ జరుగుతుంది ….
ఇదిలావుంచితే, ఏపీలో వైసీపీ గెలుపు ఖాయం అంటూ ఆ పార్టీ సోషల్ మీడియాలో ఉత్సాహం ప్రదర్శిస్తోంది. సీఎం జగన్ రెండో పర్యాయం ముఖ్యమంత్రిగా జూన్ 9న విశాఖలో ప్రమాణస్వీకారం చేస్తారని, సంబరాలకు సిద్ధం అవ్వండి అంటూ శ్రేణులకు పిలుపునిచ్చింది…
Save or share this story as a newspaper-style Epaper Clip: