Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కేసీఆర్ విజన్ తో తెలంగాణ దేశానికి ఆదర్శం-పార్లమెంట్ లో నామ

కేసీఆర్ విజన్ తో తెలంగాణ దేశానికి ఆదర్శం-పార్లమెంట్ లో నామ
-తెలంగాణ గ్రామాలూ రోల్ మోడల్
-సభ్యులంతా నోరెళ్ళబెట్టి ఆశక్తిగా విన్న దృశ్యం
-ఒకరి ముఖాలు ఒకరి చూసుకున్న బండి, ధర్మపురి
-నామ ను అభినందించిన పలువురు ఎంపీలు
దేశానికి తెలంగాణ ఆదర్శం … కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడు … తెలంగాణ అభివృద్ధి లో అన్ని రాష్ట్రాలకంటే ముందుంది … రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని టీఆర్ యస్ లోకసభ పక్షనేత ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు అన్నారు. ఆయన చేసిన ప్రసంగం అత్యంత అద్భుతంగా , సభ్యులకు అర్థం అయ్యే రీతిలో ఆవిష్కరించినతీరు ప్రశంసలనుఅందుకుంది.
హిందీ , ఇంగ్లీష్ లలో తేలికైన భాషలో ఆయన చేస్తున్న ప్రసంగాలు అందరికి అర్థం అయ్యేలా ఉంటాయి. ఆయన విషయాలను సభదృష్టికి తెచ్చే తీరు చక్కగా ఉంటుందనే అభిప్రాయం ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఆయన పార్లమెంట్ లో చేస్తున్న ఉపన్యాసాలు సభ్యులను ఆలోచింపజేస్తాయి. పెద్దగా తడుముకోరు, పదాలు ఏవైనా దూసుకు పోతున్నట్లు ఉంటాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సందర్భంగా రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించిన తీరు సభను ఆకట్టుకున్నది. ఆయన ప్రసగిస్తున్నంతసేపు బీజేపీ తెలంగాణ ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్ లు ఒకరిముఖం ఒకరు చూసుకున్నారు. మిగితా సభ్యులు ఆశక్తిగా విన్నారు. ఒకరకంగా చెప్పాలంటే పార్లమెంట్ లో తెలంగాణ సంక్షేమాన్ని ఆవిష్కరించారు . కేసీఆర్ పథకాలు దేశానికే రోల్ మోడల్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అములు జరుపుతున్న పథకాలు అనేకం మన్నారు. గాంధీజీ కలలు కన్న గ్రామస్వరాజ్యం మరెక్కడోలేదు తెలంగాణాలో పల్లెల్లో ఉందన్నారు. రైతులకు మేలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే నన్నారు. రైతు బందు పధకం తెలంగాణ తప్ప మారే రాష్ట్రంలో అమలు జరపటంలేదన్నారు. ఎకరాకు 10 వేల రూపాయలు రైతులకు అందజేసుతున్న ప్రభుత్వం కేసీఆర్ దేనన్నారు . 2017 ,2018 ఈ పధకం అమలవుతుందన్నారు. ఇప్పటి వరకు 39 వేల కోట్లు నేరుగా రైతుల ఖాతాలలో జమ చేసిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది ఒక్క కేసీఆర్ ప్రభుత్వమేనన్నారు. 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్న ప్రభుత్వం కూడా తమదే అన్నారు. రైతుల క్షేమం కోసం 5 వేల ఎకరాలకు ఒక రైతు వేదిక వేర్పాటు చేసిన ఘనత కూడా కేసీఆర్ దేనన్నారు. ప్రకృతి వైఫరీత్యాలు వచ్చినప్పుడు ,సన్న, చిన్నకారు రైతులను ఆదుకునేందుకు ప్రత్యేక నిధిని వేర్పాటు చేసిన ప్రభుత్వం తమదే అన్నారు. గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేసేందుకు తమ ముఖ్యమంత్రి కేసీఆర్ నిధులు , విధులతో పాటు , వారికి కావలిసిన మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం చేపట్టిన చర్యలను వివరించారు. పల్లెలు ప్రగతికి మెట్లు , గ్రామాల బాగుంటేనే అందరం బాగుంటం అని , గ్రామాభివృద్దే దేశాభివృద్ధి అని నమ్మిన కేసీఆర్ ఆదర్శ గ్రామాలుగా తీర్చి దిద్దుతున్నారని పేర్కొన్నారు.చనిపోయిన వ్యక్తులను ఖననం చేసేందుకు స్థలాలు దొరకటం కష్టంగా ఉందని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని స్మశాన వాటికలు కోసం ప్రతి గ్రామంలో అన్ని సౌకర్యాలతో వైకుంఠ ధామాలను వేర్పాటు చేయటం జరిగిందన్నారు. అదేవిధంగా ప్రతి గ్రామపంచాయతి ట్రాక్టర్ , ట్రాలీ , ట్యాంకర్ , ఇచ్చి వాటి మెయింటెనెన్స్ కూడా చూస్తున్నదని అన్నారు. గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చి దిద్దటంలో తెలంగాణ దేశానికే రోల్ మోడల్ గా ఉందన్నారు. ప్రతి గ్రామానికి , ప్రతి ఇంటికి తాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకొని ఇప్పటి వరకు 98 .64 శాతం ప్రజలకు తాగు నీరు అందిస్తున్నది తెలంగాణ ప్రభుత్వమే అన్నారు. కల్యాణలక్ష్మి , షాదీ ముబారక్ , అమలు చేస్తున్నామన్నారు. దేశంలో తలసరి ఆదాయం లక్ష 26 వేలు ఉండగా తెలంగాణాలో తలసరి ఆదాయం రెండు లక్షల 5 వేలు గా ఉందని చెప్పారు నామ . బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ తో పాటు , రాష్ట్రములో ట్రైబల్ యూనివర్సిటీ , ఐ ఐ ఎం , హైదరాబాద్కు మరో రింగ్ రోడ్, రైల్వే ప్రాజక్టు లు , ఎయిర్ పోర్ట్ ,నవోదయ విద్యాలయాలు మంజూరిలాంటి సమస్యలను ఆయన సభదృష్టికి తెచ్చారు.

Related posts

అలా చేస్తే లీటర్ పెట్రోల్ రూ. 70కి, డీజిల్ రూ. 60కే ఇవ్వొచ్చు: కేటీఆర్!

Drukpadam

బండి సంజయ్‌ బండారం బయట పెడతా : మైనంపల్లి…

Drukpadam

బీజేపీని మట్టి కరిపించాలనే పట్టుదలతో ముందుకెళ్తున్నాం: మల్లికార్జున ఖర్గే…!

Drukpadam

Leave a Comment