Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

ఆస్ట్రేలియాలో హింసాత్మకంగా మారిన టీకా వ్యతిరేక నిరసనలు…

ఆస్ట్రేలియాలో హింసాత్మకంగా మారిన టీకా వ్యతిరేక నిరసనలు…
-ఆస్ట్రేలియాలో మళ్లీ పెరుగుతున్న కేసులు
-ఒక్క డోసైనా వేసుకున్న కార్మికులే పనులకు వెళ్లాలని ప్రభుత్వం ఆదేశం
-నిరసిస్తూ ఆందోళనకు దిగిన కార్మికులు
-హింసాత్మకంగా మారడంతో నిర్మాణ రంగ పనులు రెండు వారాలపాటు నిలిపివేత

కరోనా మహమ్మారి ఆస్ట్రేలియాలో తిరిగి విజృభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది . పనికి వెళ్లే వారు కనీసం ఒక్క టీకా అయినా తీసుకోవాలని లేకపోతె వారి పనికి వచ్చేందుకు వీలు లేదని ఆదేశాలు జారీచేసింది. అంటే కాకుండా గత 15 రోజులుగా లాక్ డౌన్ విధించడంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్నది . అది నిరసనలకు దారిసింది . పోలీసులకు ప్రజలకు మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. పోలీసులకు ,ప్రజలకు గాయాలు అయ్యాయి. కొంతమంది నిరసన కారులను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. మొదటిసారిగా కరోనా పరిస్థితులవల్ల నిర్మాణ రంగాన్ని రెండు వారాలపాటు నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఒక్క మెల్బోర్న్ నగరంలోనే కాకుండా విక్టోరియా, న్యూ సౌత్‌వేల్స్‌లలో కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. లాక్ డౌన్ విధించింది. ప్రజలనుంచి ప్రభుత్వ చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనేక నగరాలలో కూడా ప్రజలు లాక్ డౌన్ కు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు.

విక్టోరియా, న్యూ సౌత్‌వేల్స్‌లలో కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హింసకు దారితీసింది. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నిర్మాణరంగంలోని కార్మికులు కనీసం ఒక డోసు టీకా అయినా తీసుకున్నాకే పనికి వెళ్లాలని ఆదేశించింది.

అయితే, ప్రభుత్వ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మెల్‌బోర్న్‌లో వందలాదిమంది కార్మికులు రోడ్లపైకి వచ్చి రెండు రోజులుగా ఆందోళన చేస్తున్నారు. దీంతో వారిని అడ్డుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగడంతో పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిపోయాయి. నిరసనకారులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు పోలీసు అధికారులు సహా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం మెల్‌బోర్న్‌లో నిర్మాణ రంగ పనులను రెండు వారాలపాటు నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.

Related posts

వ్యాక్సిన్ నిల్వలు లేకనే విరామం పెంచారా? అంటూ జైరాం ట్వీట్!

Drukpadam

ఎంత శ్రమిస్తున్నా కొన్ని పరిస్థితులు మన చేతుల్లో ఉండవు: సీఎం జగన్

Drukpadam

భారత్ లో కొత్తగా 6,650 కరోనా కేసులు మరణాలు 374..!

Drukpadam

Leave a Comment